తమిళనాడు : చెన్నై పూంతమల్లి వద్ద భారతీయుడు - 2 షూటింగ్ కోసం సెట్ వేసే సమయంలో క్రేన్ ప్రమాదంలో ముగ్గురు మరణించడం పట్ల నటుడు కమల్ హసన్ ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. తానుకూడా 3 సంవత్సరాల క్రితం ఓ సందర్భంలో గాయలపాలైయ్యానని తెలిపారు. అ సమయంలో ఎంతో మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిపారు. శంకర్ దర్శకత్వంలో నిర్మాణం లో వున్న భారతీయుడు -2 చిత్రీకరణలో భాగంగా ఈవీపీ స్టూడియోలో లైటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడింది. ఈ ఘటనలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ మృతిచెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను హాస్పిటల్లో పరమార్మ్మించిన అనంతరం ఆయన మీడియాతో మాాట్లాడారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని ప్రస్తుత ప్రమాదంలో తాను ముగ్గురు సహ సినీ సహచరులను కోల్పోవడం భాధకరమని పేర్కొన్నారు.
తన బాధ కంటే వారిని కోల్పోయిన కుటుంబం యొక్క దుఃఖం చాలా రెట్లు ఉంటుందని
వారిలో ఒకరిగా తన వంతుగా 1కోటి రూపాయలు ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ప్రకటించారు. వారి కష్టాల్లో తన వంతు సహాకారం అందజేస్తానన్నారు.
No comments:
Post a Comment