Saturday, 29 May 2021

లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపటిన పుల్వమా అమర జవాను భార్య "నికిత"

పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ విభూతి శంకర్‌ భార్య నిఖితకౌర్… లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టారు. తన భర్త ట్రైనింగ్ తీసుకున్న చెన్నైలోని అకాడమీలోనే సీటు సాధించి శిక్షణ పొందారు.


విభూతి శంకర్ చనిపోయే నాటికి నిఖితకు పెళ్లయి 9 నెలలే అవుతుంది. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయారు. తనపై జాలి పడొద్దని చెప్పి… ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు.

తన భర్త వదిలి వెళ్లిన మార్గాన్ని కొనసాగిస్తున్నానన్న నిఖిత.. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు

The wife of Indian Army officer, Major Vibhuti Shankar Dhoundiyal, who was killed fighting terrorists in Pulwama in February 2019, joined the Indian Army on Saturday

Nitika Kaul passed out from the Officer’s Training Academy in Chennai, Tamil Nadu on Saturday and is now commissioned as a Lieutenant in the Indian Army

Her husband, Major Vibhuti Dhoundiyal was part of an operation in Pinglang area of south Kashmir’s Pulwama on the trail of those behind the Pulwama attack that killed 40 CRPF soldiers.

While the forces were successful in neutralising JeM commander Kamran, one of the key plotters of the Pulwama attack on the CRPF convoy, Major Dhoundiyal along with three others were killed in the attack. For his valour, he was decorated with the Shaurya Chakra. #indianarmy #chinarcorps #youngbites @indianarmy.adgpi @chinarcorpsia follow @youngbitesofficial


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం


శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శ‌నివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

శ్రీ‌వారికి 6 టన్నుల ప్ర‌కృతి వ్య‌వ‌సాయం బియ్యం అందజేత


మే 29, తిరుమల 2021: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళంగా అందాయి. టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖర్ రెడ్డి, కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ కలిసి ఈ విరాళాన్ని అందించారు.
దాతల తరఫున వారి ప్రతినిధి ఈ మేర‌కు విరాళాన్ని శ్రీ‌వారి ఆల‌యం వద్ద ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు. ఇందులో 25 కిలోల పసుపును తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అందించాలని దాతలు కోరారు.


Friday, 28 May 2021

ఓటుకు నోటు కేసు చంద్రబాబు డైరెక్షన్లోనే -. శైలజా చరణ్ రెడ్డి


ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినదని వైకాపా రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజ రెడ్డి అన్నారు. గురువారం ఆమే విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేశారని, చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డితో పాటు వేం కృష్ణ కీర్తన్‌రెడ్డి, స్టీఫెన్‌సన్‌, చంద్రబాబు పాత్ర కూడా కీలకంగా ఉన్నదని, బ్రీఫ్‌డ్‌ మీ తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  వెలుగులోకి ఓటుకు కోట్లు కేసు ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు చేశారనేది, ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగం స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే  ధ్రువీకరించిన ఫోరెన్సిక్‌ నివేదిక ఉత్కంఠ ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు 2015 మే 31న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కి అతని ఇంట్లోనే రూ. 50 లక్షలు ఆఫర్‌ చేస్తూ రేవంత్‌ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిపిన విచారణలో 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' వ్యవహరం వెలుగు చూసింది.దాదాపు ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించి పక్కా ఆధారాలతో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందనే దానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

Wednesday, 26 May 2021

ఆయన మనసే ఓ స్కానర్... నాడీ చూస్తే రోగం చప్పేస్తారంతే....

ఆయనొక నడిచే ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వం. అపర ధన్వంతరి. నాడీ పరీక్షలో ఆయనను మించిన వారు లేరేమో. బసంత్ థియేటర్ వెనుక సందులో ఆయుర్వేద వైద్యులు రంగాచారి గారి ఆసుపత్రికి  మబ్బుల మూడుగంటల నుంచే పేషెంట్లు వచ్చి వరుసలో కూర్చుంటరు. ఉదయం స్నానం చెయ్యకముందయితేనే నాడి  సరిగ్గ తెలుస్తుందట. నీ జబ్బేమిటి నీ అవస్థేమిటి అని ఆయన రోగిని అస్సలు అడగడు. చెప్పబోతే కూడా వద్దని వారిస్తారు. క్షణ కాలం  నాడీ పట్టుకుంటె చాలు స్కాన్ తీసినట్టు మన దైహిక పరిస్థితి అంతా ఆయనే అలవోకగా చెప్పేస్తారు. నాకు నాడీ పరీక్ష చేసి మీకు దేహం లో ఒక చోట కణితి ఉంది అన్నారు. నిజమే .. నాకు ఎప్పటినుంచో ఛాతీలో ఒకచోట కొంచెం దుర్మాంసం పెరిగి ఉంది . డాక్టర్లు పరీక్ష చేసి దాంతో పెద్ద ప్రమాదం లేదంటే వదిలేసాను. నా వెంట వచ్చిన మరో మిత్రుడికి ప్రొస్టేట్ గ్లాండ్ వాచింది అని చెప్పారు. అతనికి అప్పటికా విషయం తెలియదు. తర్వాత హాస్పిటల్ లో పరీక్ష చేస్తే అది నిజమని తేలింది. నేను అయనిచ్చిన మందులు  సరిగ్గా వాడకుండా మళ్ళ పోతే మీరు మందులు వాడలేదని కోప్పడ్డడు. రుచిగా ఉన్నాయి కనక అసవలు తాగారు . చేదుగా ఉన్న చూర్ణాలు సరిగ్గ వాడలేదు అన్నడు.  నాడీ పరీక్షతో ఈయన కు ఈ సంగతి కూడా తెలుస్తుందా అని ఆశ్చర్య పోయాను . చాలా మంది మిత్రుల్ని ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళాను. క్రమశిక్షణగా మందులు వాడిన వాళ్ళందరికీ మంచి గుణం కనిపించింది.                                               ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ కు రంగాచారి గారి వైద్యమంటే చాలా గురి. అయన ఇక్కడ గవర్నర్ గా ఉన్ననాళ్ళూ రంగాచారి గారి దగ్గర వైద్యం చేయించుకునే వారు. రంగాచారి గారి తాతగారు నిజాం రాజ పరివారానికి వైద్యం చేసి చాలా కీర్తిప్రతిష్టలు గడించిన వారు.  వైద్య విజ్ఞానం వారికి పరంపరగా వచ్చింది. మహా భిషగ్వరుడు రంగాచారి గారు రెండురోజుల క్రితం అనాయాస మరణం పొందారు. పారంపరికమైన వైద్య విజ్ఞానం ,  88 ఏండ్ల అపార అనుభవం కలిగిన రంగాచార్యులు గారు ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు. ఆయన గురించిన సమాచారం కూడా ఎక్కడా అందుబాటులో లేదు. రంగాచారి గారి అనుభవాల సంపుటి గనుక రికార్డు అయ్యుంటే ఆయుర్వేద విద్యార్థులకు కరదీపిక గా మారుండేది.  దేశీయ వైద్య విజ్ఞానఖని రంగాచారి గారికి  నా వినమ్ర నివాళి💐🙏

#NB : మిత్రులు Deshapathi Srinivas గారి Post యధాతతంగా...
ఈ "బసంత్ టాకీస్" అనేది హైదరాబాద్, కాచిగూడ "X" క్రాస్ రోడ్స్ లో, వైశ్య హాస్టల్ వెనుక వైపు సందులో వుంటుంది, అయితే ఇప్పుడక్కడ "బసంత్ టాకీస్" అనే దానిని కూల్చేసి "బసంత్ అపార్ట్మెంట్స్" కట్టారు.

సుందరకాండ అఖండ పఠనమ్ @ 412 రోజులు..


ప్రపంచ మానవాళి ఆరోగ్యంగా వుండాలని.. కరోనా విపత్తు తొలగిపోవాలని కోరుతూ టిటిడి నిర్వహించిన  అఖండ సుందరికాండ పారాయణంలో బుధవారం ఉదయం  58 సర్గాల నుండి 167 శ్లోకాల పఠనంతో నాద నీరంజనం వేదిక ప్రతిధ్వనించింది.
ఈ సందర్భంగా హంపికి చెందిన శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ తిరుమలలో జరిగే సుందరకాండ పఠనంలో పాల్గొనడం తనకు ఆశీర్వాదం అని అన్నారు
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ, మానవాళి శ్రేయస్సు కోసం తిరుమల వద్ద టిటిడి నిర్వహించిన పరాయణ మహోత్సవం మే 26 న 350 రోజుల సుందరకాండ పఠనంతో సహా మొత్తం 412 రోజులు పూర్తి చేసిందని అన్నారు.
అఖండ పఠనం 14 వ ఎడిషన్‌లో 167 శ్లోకాలను వేద పండితులు శ్రీ పివిఎల్‌ఎన్ మారుతి, శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ ఎం పవన్ కుమార్ శర్మ జపించారు.
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఎస్‌విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చూడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తమ ఇళ్ల నుంచి పఠనం మహోత్సవంలో పాల్గొన్నారు.
టిటిడి అదనపు ఇఓ శ్రీ ఎవి ధర్మరెడ్డి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య మురళీధర్ శర్మ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపక సభ్యులు, వేద పండితులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ALIPIRI FOOTPATH CLOSED FROM JUNE 1 To JULY 31


With a view to fast track the repair and top-slab works of the footpath from Alipiri to Tirumala, the TTD has announced its closure from June 1 to July 31.
TTD stated that the devotees desiring to reach Tirumala on foot could utilise the Srivari Mettu path. 

Devotees are requested to note that TTD would provide free buses up to Srivari Mettu from Alipiri.

FLORAL TRIBUTES PAID AT TARIGONDA BRINDAVAN____!!!



On the occasion of the 291st Jayanti of Matrusri Tarigonda Vengamamba, TTD officials paid floral tributes at Vengamamba Brindavan in Tirumala on Tuesday.
The festivities of Jayanti utsava were held in Ekantam at Brindavan and after in the evening at Ranganayakula mantapam inside Srivari temple instead of Narayanagiri Gardens in view of Covid guidelines.
Sri Vengamamba, an ardent devotee of Narasimha Swamy and Venkateswara Swamy was born in 1730 at Tarigonda in Chittoor district and at attained Sajeeva Samadhi in 1817. She pioneered Anna Prasadam in Tirumala.
The practice of sankeetans of Annamacharya and Vengamamba are still continued in the Srivari temple even today.

Tuesday, 25 May 2021

అకారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లవద్దు: డిజిపి ఎం. మహేందర్ రెడ్డి *



హైదరాబాద్, మే 25, 2021. 
ప్రజలు అనవసరంగా బయటకు రావడం మంచి పద్దతి కాదని...తెలంగాణ  డిజిపి మహేందర్ రెడ్డి  అన్నారు.
 ఈ రోజు కెపిహెచ్‌బి పిఎస్ పరిమితుల్లోని జెఎన్‌టియు చెక్‌పోస్ట్‌ను  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్‌తో కలిసి సందర్శించిన డిజిపి వాహనదారులను తనిఖీ చేశారు..
అనంతరం మీడియాతో మాట్లాడారు.
 లాక్డౌన్ రాష్ట్రవ్యాప్తంగా చాలా కఠినంగా అమలు ఆవుతోందని 
  ప్రజల  ఆరోగ్యం కోసమే లాక్డౌన్ అమలు అవుతున్న విషయం అందరూ గ్రహించి పోలీసులకు సహకారాన్ని అందజేయాలని డిజిపి విజ్ఞప్తి చేశారు. 
 వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్డౌన్ మాత్రమే పరిష్కారంగా కనిపించడం వల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని  ఎటువంటి చెల్లుబాటు అయ్యే కారణం లేదా అవసరం లేకుండా ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటపడవద్దని కోరారు.

లాక్డౌన్ మినహాయింపు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయబడుతుందని. లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేయబడుతోందని. పర్యవేక్షించడానికి పోలీసు అధికారులందరూ రోడ్డుపైకి వచ్చారని..వైరస్ కట్టడికి స్వీయ నియంత్రణ ఎంతైనా అవసరమని మహేంధర్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులకు మాత్రమే అనుమతి వుందని ఇతరులు చెల్లుబాటు అయ్యే ఇ-పాస్‌లు వుంటేనే  అనుమతి ఉంటుందని డిజిపి తెలిపారు. ఎటువంటి సరైన కారణం లేకుండా పాస్ కోసం దరఖాస్తు చేయవద్దని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించవద్దని ఆయన హెచ్చరించారు.
(Manikumar @ Satya News)
అనంతరం సజ్జనార్ అల్లిన్ క్రాస్ రోడ్లు, భెల్, రామ్‌చంద్రపురం మరియు ఇతర ప్రదేశాలలో పర్యటించారు. లాక్డౌన్ పరిస్థితిని తెలుసుకున్నారు.. లాక్డౌన్ నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు దీశ నిర్థేశం చేశారు. డిజిపి వెంట డిసిపి ట్రాఫిక్ శ్రీ ఎస్ఎం విజయ్ కుమార్, మాధపూర్ డిసిపి మిస్టర్ ఎం. వెంకటేశ్వర్లు మరియు కుకత్పల్లి ఎసిపి మిస్టర్ బి. సురేందర్ రావు తదితరులు వున్నారు...@@#

రిఫ్రిజిరేటర్ వాడకంలో తస్మాత్ జాగ్రత్త : Dr.గౌతమ్ కాశ్యప్

మనం ప్రతి రోజూ ఎంతో ఆప్యాయంగా మురిసిపోతూ తెగవాడేస్తూ ఇంట్లో వున్న ప్రతి ఆహార పదార్ధాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని సంతోషపడతాం కదా... ఫ్రిజ్ వాడుతున్నందుకన్నా దాన్నెలా వాడుతున్నారో ఎలా వాడాలో యూట్యూబ్ లో చూసి తెలుసుకోండి. ఎందుకంటే ఫ్రిజ్ వాడకం వల్ల ఎన్ని సమశ్యలు తలెత్తుతున్నాయో మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. అసలు ఇలాంటి సమశ్యలు ఫ్రిజ్ వల్ల మనకు వస్తున్నాయని ఎప్పుడైనా ఎవ్వరైనా అనుకుంటారా.
ఫ్రిజ్ వాడడం వల్ల ఫ్రిజ్ లలో నిల్వచేసిన ఆహారపదార్ధాలను మనం కొనడం వల్లా వాటిని వాడడం వల్లా మన శరీరంలోకి ఎలా వ్యాధులు వస్తాయో మనం తెలుసుకోవాలి కదా ... 
వైరల్ డిసీజెస్ విజృంభిస్తున్నాయి అని అంటున్న ఈ కాలంలో ఖచ్చితంగా మనమంతా తెలుసుకుని తీరాల్సిన నిజాలు. ఎలా మన ఫ్రిజ్ వల్ల మనం అనారోగ్యాల్ని తెచ్చిపెట్టుకుంటున్నాం?  ఇహ చదవండి. తెలియని వారికి మీ ఆంగ్ల పరిజ్ఞానమంతా ప్రదర్శించి చదివి వినిపించండి. లేదా ట్రాన్సలేట్ చేయించుకోండి. నా బాధ్యత అయిపోయింది. 
- Dr Gautham Kashyap PhD., 
 
Refrigerant poisoning happens when someone is exposed to the chemicals used to cool appliances. Refrigerant contains chemicals called fluorinated hydrocarbons (often referred to by a common brand name, “Freon”).
Freon is a tasteless, mostly odorless gas. When it is deeply inhaled, it can cut off vital oxygen to your cells and lungs.
Limited exposure — for example, a spill on your skin or breathing near an open container — is only mildly harmful. However, you should try to avoid all contact with these types of chemicals. Even small amounts can cause symptoms.
Inhaling refrigerant fumes on purpose to “get high” can be very dangerous. It can be fatal even the very first time you do it. Regularly inhaling high concentrations of Freon can cause conditions such as:
breathing difficulty
fluid buildup in your lungs
organ damage
sudden death
What are the symptoms of refrigerant poisoning?
Mild exposure to refrigerant chemicals is generally harmless. Poisoning is rare except in cases of misuse or exposure in a confined space. Symptoms of mild to moderate poisoning include:
irritation of your eyes, ears, and throat
headache
nausea
vomiting
frostbite (liquid Freon)
cough
chemical burn to your skin
dizziness
Symptoms of severe poisoning include:
fluid buildup or bleeding in your lungs
burning sensation in your esophagus
vomiting up blood
decreased mental status
difficult, labored breathing
irregular heart rate
loss of consciousness
seizures
People who misuse inhalants like refrigerant might have a mild rash around the nose and mouth. Other symptoms include:
watery eyes
slurred speech
an appearance of alcohol misuse
irritability or excitability
sudden weight loss
chemical smells on the clothing or breath
paint stains on the clothing, face, or hands
lack of coordination
hidden empty spray cans or rags soaked in chemicals
What are the health complications of misuse?
Along with a rapid “high,” and a feeling of euphoria, the chemicals found in refrigerant produce many negative effects on your body. These can include:
lightheadedness
hallucinations
delusions
agitation
nausea and vomiting
lethargy
muscle weakness
depressed reflexes
loss of sensation
unconsciousness
Even people who misuse for the first time can experience devastating consequences.
A condition known as “sudden sniffing death” can occur in healthy people the very first time they inhale refrigerant. The highly concentrated chemicals can lead to irregular and rapid heart rates.
The irregular, fast heart rates can then lead to heart failure within minutes. Death can also occur due to:
asphyxiation
suffocation
seizures
choking
a fatal accident from driving while intoxicated
Some chemicals found in refrigerant stick around in your body for a long period of time. They attach easily to fat molecules and can be stored in your fatty tissue.
The buildup of refrigerant poison can negatively impact vital organs, including your liver and brain. The buildup can also become habit-forming. Regular or long-term misuse may also result in:
weight loss
loss of strength or coordination
irritability
depression
episodes of psychosis
rapid, irregular heart rate
lung damage
nerve damage
brain injury
death

రెండు రోజుల క్రితం సినీజీవితానికి రిటైర్మేంట్ ప్రకటించిన చంద్రమోహన్


కరోనా సమయం అందరూ జాగ్రత్త అంటూ 80వ పుట్టిన రోజున సందేశం ఇచ్ఛారు సహజ నటుడు చంద్రమోహన్...50 ఏళ్లపైబడి నట జీవితంలో ఎంతో హుందాగా వ్యవహరించారు..
ఓ జర్నలిస్ట్ మిత్రుడు చేసిన ఇంటర్యూ.....
నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో పని చేసిన అనుభవం...
ఐదున్నర దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమతో మమేకమైన నట జీవితం... 
కథానాయకుడిగా, స్నేహితుడిగా, తండ్రిగా, వినోదాత్మక - భావోద్వేగభరిత పాత్రల్లో చక్కటి ఆర్టిస్టుగా... నటనలో వివిధ కోణాలను ఆవిష్కరించే విలక్షణ పాత్రలు పోషించిన పరిపూర్ణ నటులు చంద్రమోహన్. హీరోగా 175కు పైగా సినిమాలు చేసిన ఆయన, 55 ఏళ్ళ కెరీర్ లో మొత్తం 932 సినిమాలు చేశారు. ఆదివారంతో 80 ఏళ్ళు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ తో ఇంటర్వ్యూ.

చంద్రమోహన్ గారు... జన్మదిన శుభాకాంక్షలు!
-థాంక్యూ

ప్రశ్న: మీరు గతంలో పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
జవాబు: పెద్ద కుటుంబంలో ఉండటం వల్ల అసలు పుట్టినరోజు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మా సినిమా ఫ్యామిలీ చాలా ఏళ్ళు, చాలా సార్లు ఘనంగా సెలబ్రేట్ చేసింది. పుట్టినరోజున సినిమా సెట్ లో కాకుండా... ఒకవేళ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య  ఘనంగా, హాయిగా సెలబ్రేట్ చేసుకునేవాడిని. దానికి ముఖ్య కారణం... నా సతీమణి, మా అమ్మాయిలు, ఇప్పుడు మనవరాళ్లు, మా మేనల్లుళ్లు, వాళ్ల కుటుంబాలు.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?
నా సతీమణి జలంధర. ఆమె గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు. చాలా మంచి రచయిత్రి. ఎన్నో మంచి కథలు, నవలలు రాసింది. మా పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. పెళ్లి తర్వాత నా ప్రోత్సాహం కూడా తోడయ్యింది. నాకు కోపమెంత ఎక్కువో, ఆమెకు సహనం అంత ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది, నా కోపాన్ని తగ్గించడానికేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. హ్యాపీ లైఫ్‌. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్‌ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు. ఈ పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు – అన్నీ నా భార్యే చూసుకుంది. అందుకే నా కెరీర్‌ హ్యాపీగా సాగిపోయింది. బంధువుల ఫంక్షన్లకు కూడా మా ఆవిడే వెళ్లేది.

ప్రశ్న: కరోనా సమయం కాబట్టి రెండేళ్లుగా పరిశ్రమ ప్రముఖుల మధ్య ఘనంగా సెలబ్రేట్ చేసుకునే వీలు లేదు. ఎక్కువమంది మిమ్మల్ని కలిసే అవకాశం లేకుండా పోయింది. 
జవాబు: రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాను. గత ఏడాది మా సిస్టర్స్, వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చారు. ఈసారి లాక్‌డౌన్ కావడం వలన వాట్సాప్ వీడియో కాల్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 

ప్రశ్న: నటుడిగా 55 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం మీది. విశ్రాంతి లేకుండా నటించారు. మీ మోటివేషన్ ఏంటి?
జవాబు: కొన్ని రోజులు కెరీర్ లో స్థిరపడటం, కొన్ని రోజులు ఫైనాన్షియల్ గా సెటిల్ కావడం నా మోటివేషన్. ఆ తర్వాత నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం వర్క్ చేశాను. కానీ, ఏ వేషం అంగీకరించినా... అది నా పరిధిలో బాగా చేయాలనీ, ఫస్ట్ టేక్‌లో ఓకే చేయాలన్న ఛాలెంజ్ చాలా పెద్ద మోటివేషన్.

ప్రశ్న: హీరోగా విజయవంతమైన మీరు, తర్వాత కాలంలో వినోదాత్మక పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. అప్పటి, ఇప్పటి వినోదంపై మీ స్పందన?
జవాబు: వినోదం చాలా సులభంగా కనిపించే అతి కష్టమైన ప్రక్రియ. ఆ పాత్రలు వేస్తున్నప్పుడు హీరోలకు, ముఖ్య పాత్రలకు ఉండే సపోర్ట్ సిస్టమ్ మాకు ఉండదు. ఇండస్ట్రీలో ప్రతి కమెడియన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే... అతనికి డైలాగ్ లో పంచ్, మోటివేషన్ ఉండాలి. ముఖ్యంగా జనం నాడి తెలుసుకోవాలి. సన్నివేశంలో ఇతర ఆర్టిస్టులను డామినేట్ చేయకూడదు. మన మూడ్, సిట్యువేషన్ తో సంబంధం లేకుండా నటించాలి. హాస్య నటులకు ఉన్న మరింత కష్టం... త్వరగా స్టేల్ అవుతారు. ప్రేక్షకులు ప్రతి కమెడియన్ నుంచి ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు. మంచి దర్శకుల దగ్గర ట్రయినింగ్, అబ్జర్వేషన్, మా ఫ్యామిలీలో మేం నవ్వకుండా నవ్వించే అలవాటు ఉండటం - ఇవన్నీ నా కమెడియన్ పాత్రలకు సహాయపడి, నన్ను సక్సెస్ చేశాయి. మా తమ్ముడు, అక్కయ్యలు, నాన్నగారు - అందరూ నవ్వకుండా నవ్వించే అలవాటు ఉన్నవాళ్లే. ఆ కాలమైనా, ఈ కాలమైనా... సిట్యువేషనల్ కామెడీ మంచిదని నా అభిప్రాయం. 
ప్రశ్న: హీరోగా, నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేశారు. ప్రతినాయకుడిగా ఏమైనా చేశారా?జవాబు: రెండు మూడు చేశాను. అందులో 'గంగ మంగ' సినిమాను ప్రధానంగా చెప్పుకోవాలి. అలాగే, జయసుధ తొలి సినిమా 'లక్ష్మణరేఖ'లో నాది నెగెటివ్ రోల్. 

ప్రశ్న: అప్పట్లో హీరోగా చేస్తూ, సహాయక పాత్రలు చేయడానికి కారణం?
జవాబు: పరిస్థితుల ప్రభావం! ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ కాక తప్పదని అర్థమైంది. హీరోగా మాత్రమే చేయాలని అనుకుంటే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండేవాడిని కాదు. 

ప్రశ్న: ఈమధ్య చిత్రాలు చేయడం తగ్గించారు. ఎందుకని?
జవాబు: దీనికి ముఖ్య కారణం... నా ఆరోగ్యం. దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగా పని చేసి, నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ఎవరైనా హెచ్చరించినా... ఇనుముకు చెదలు పడుతుందా? అని వెటకారం చేసేవాడిని. కానీ, నా నిర్లక్ష్యం నన్ను దెబ్బ తీసింది. నా వల్ల నా నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకు ఇష్టం లేదు. 'రాఖీ'లో ఎమోషనల్ సీన్ చేసి వచ్చి... బైపాస్ సర్జరీ కోసం నేరుగా ఆసుపత్రిలో చేరాను. అలాగే, 'దువ్వాడ జగన్నాథమ్' షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే, రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అయినా... ప్రతిరోజూ టీవీలో నా సినిమా ఏదో ఒకటి వస్తోంది. యూట్యూబ్ ద్వారా చాలా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులు అవన్నీ చూస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు అభిమానులు ఎక్కువ అయ్యారు. అది ఆశ్చర్యంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకు 'ఇది చాలు' అనిపిస్తుంది. 
ప్రశ్న: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి?జవాబు: చాలా చాలా ఉన్నాయి. సక్సెస్ అయిన సినిమాలు మీ అందరికి తెలుసు. సక్సెస్ కాని సినిమాల్లో 'భువనేశ్వరి' వంటివి చాలా ఉన్నాయి. 

ప్రశ్న: మీ డ్రీమ్ రోల్ ఏది?
జవాబు: అలా అని ఏమీ లేదు. కానీ, నాలో నాకే తెలియని టాలెంట్ ఉందని బీఎన్ రెడ్డిగారు, బాలచందర్ గారు, ఎస్వీ రంగారావు గారు వంటి గురుతుల్యులు చాలామంది చెప్పేవారు. దర్శకులు ఎంత తీసుకోగలిగితే అంత ప్రతిభ ఉందని చెప్పిన వాళ్ల ఆశీసులకు న్యాయం చేసే పాత్రల కోసం ఎదురు చూశా. మా అన్నయ్య విశ్వనాథ్ గారు, బాపుగారు, బాలచందర్ గారు నాలో చాలా సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ట్రై చేసి సక్సెస్ అయ్యారు. నా ప్రేక్షకులు ఆనందించిన అన్ని పాత్రలు నాకు ఆశీర్వచనాలు ఇచ్చాయి. అదే తృప్తి. 

ప్రశ్న: ఇతర భాషల్లో నటించారా?
జవాబు: తమిళంలో ఐదు చిత్రాలు... మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించాను. తమిళంలో ఎంజీఆర్‌తో 'నాళై నమదై'లో నటించాను. అది 'అన్నదమ్ముల అనుబంధం' రీమేక్. తెలుగులో బాలకృష్ణ పోషించిన పాత్రను తమిళంలో నేను చేశా. శివాజీ గణేశన్‌తో 'అండమాన్ కాదలై' సినిమా చేశా. తెలుగులో 'అండమాన్ అమ్మాయి'గా రీమేక్ చేశారు. రెండు భాషల్లో నేను నటించాను. ముత్తురామన్ దర్శకత్వం వహించిన 'సుడరుమ్ సురావళియుమ్' చేశా. అలాగే, నటి శ్రీప్రియ సొంత చిత్రం 'నీయ'లో చేశాను. హిందీలో ఏమీ చేయలేదు. మలయాళంలో షీలా కాంబినేషన్ లో 'అనంత శయనం' అనే సినిమా చేశా. టీచర్‌తో స్టూడెంట్ లవ్ స్టోరీ అది. అందులో నిక్కరు వేసుకుని నటించా. నా కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమా అది.    

ప్రశ్న: అప్పటికి, ఇప్పటికి చిత్రసీమలో ఎటువంటి మార్పులు వచ్చాయి? కరోనా తర్వాత... 
జవాబు: ఆ కాలంలో ఎక్స్‌పీరియన్స్‌కి ఇంపార్టెన్స్ ఉండేది. సీనియర్ నటుడు ఎప్పుడూ తన ఎక్స్‌ప్రెషన్ లో విడిగా కనబడుతూ ఉండేవాడు. ఈ కాలంలో గ్లామర్, ఫైట్స్, సాంగ్స్ పిక్చరైజేషన్ కి ఇంపార్టెన్స్ వచ్చింది. ఒకే సన్నివేశాన్ని చాలా షాట్స్ లో తీస్తున్నారు. తెలివిగల ఫొటోగ్రాఫర్, దర్శకుడు ఉంటే సన్నివేశాన్ని వాళ్లే నిలబెడతారు. దానికి ఆర్టిస్ట్ టాలెంట్ 50 శాతం చాలు. ఇది కొత్త ట్రెండ్. మా సినిమా ఇండస్ట్రీలో వేలమందికి ఉపాధి కల్పించినంత కాలం, మా నిర్మాతలు చల్లగా ఉన్నంత కాలం ఏ ట్రెండ్ అయినా పర్వాలేదు. కరోనా మాత్రం మా సినిమా ఇండస్ట్రీకి ఉపాధి లేకుండా దెబ్బకొడుతోంది. ఇది నాకే కాదు... నాతోటివారు అందరికీ బాధ కలిగించే విషయం. 

ప్రశ్న: సినీ జీవితం నేర్పిన పాఠాలు?
జవాబు: పేరు, డబ్బు, బంధాలు - ఏవీ శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. ఎప్పటికీ చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది.

ప్రశ్న: జాతీయ పురస్కారాల్లో తెలుగువారికి అన్యాయం జరుగుతుందని కొందరు అంటున్నారు. మీరేమంటారు?
జవాబు: అందరి విషయం అని కాదు. బీఎన్ రెడ్డి, విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీలగారు... చాలామందికి గౌరవపూర్వకమైన అవార్డులు వచ్చాయి. కానీ... ఎస్వీ రంగారావు, సావిత్రమ్మ, కన్నాంబ, నాగయ్య గారు వంటి చాలామంది మంచి ఆర్టిస్టులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని నా అభిప్రాయం.

ప్రశ్న: మీ ప్రతిభకు తగ్గ పురస్కారం రాలేదనే అసంతృప్తి ఏమైనా... 
జవాబు: ప్రజాభిమానమే నాకు పెద్ద అవార్డు. రివార్డులు. నాలో ఎటువంటి అసంతృప్తి లేదు. 

ప్రశ్న: కరోనా నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జవాబు: నాకంటే మా ఇంట్లోవాళ్ళు నాపట్ల ఎక్కువ జాగ్రత్త వహిస్తున్నారు. నాకు చాలా స్వేచ్ఛ పోయినట్టు ఉంది. కానీ, తప్పదు. మనం మరొకరికి ఇబ్బంది కాకూడదు కదా. అందరం వీలైనంత వరకూ జాగ్రత్తలు పాటించి, మనల్ని మనం రక్షించుకోవడం, ఎదుటివాళ్ళకు రక్షణ ఇవ్వడం తప్పనిసరి. 

ప్రశ్న: పుట్టినరోజు సందర్భంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు, ప్రేక్షకులకు ఏమైనా చెబుతారా?
జవాబు: ఇన్నేళ్లూ నన్ను గుండెల్లో అదుముకుని, ఆశీర్వదించిన సినీ కళామతల్లికి, నాతోటి కళాకారులకు... అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండండీ

Monday, 17 May 2021

2డీజీ ఔషధం విడుదల చేసిన కేంద్రమంత్రులు

కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌) అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల చేశారు. మొదట రక్షణ మంత్రి డ్రగ్‌ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా.. డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.

పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి చేసింది. 2డీజీ డ్రగ్‌ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని డీఆర్‌డీఓ పేర్కొంది. క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని వివరించింది.

Sunday, 16 May 2021

రామ కనవేమిరా.. కరోనా గీత దాటితే రామనామమే పనిష్మేంట్..

మద్యప్రదేశ్/సాత్నా ; కరోనా లాక్డౌన్ లో  దేశవ్యాప్తంగా పోలీసులు ఆయా రాష్ట్రాల వారీగా అహర్నిశలు శ్రమిస్తున్నారు..కరోనా గీతా దాటిన వారిని రకరకాల పనిష్ చేసో విసిగిపోయిన సత్నా పోలీసులు.. పలువురికి రామనామం రాయడాన్ని పనిష్మేంట్గా ఇస్తున్నారు. ఆలాగైన వారిలో మార్పు వచ్ఛి అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా వుండాలని వారు బావిస్తున్నట్లువుంది..మొత్తానికి కరోనా గీత దాటితే రామనామం రాయడం బాగానే వుందని పలువురు ఆనందిస్తున్నారు...మరోవైపు రామ నాామం రాయించడం పట్లవిమర్శలువినిపిస్తున్నాయి.

Saturday, 15 May 2021

బందరు మిఠాయి మూగవోయింది,!

బందరు లడ్డు సృష్టికర్త
ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు శిర్విశేట్టి సత్యన్నారాయణ (తాతారావు)
మా లడ్డూ తినండి అంటూ ఆప్యాయంగా పలుకరించి
నోరూరా తీపిని అనురాగాన్ని పంచే తాతారావు పెద్దాయన ను కరోనా ఈ రోజు మింగేసింది
మొత్తంగా తీపి ప్రియులకు ఇది చాలా చేదు వార్త
వ్యక్తిగతంగా ష్ఠానికుడి గా,  ఎంతో ఆత్మీయ అనుబంధం  ఉంది. ఇది జీర్ణించుకోలేని విషయం.
 

Monday, 10 May 2021

ఎ.పిలో పోలీస్‌ 'పాస్‌' తీసుకోవాలంటే... ఇలా చేయండి.!

*

 అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకో దలచిన వారు తమ యొక్క వినతి పత్రాలను క్రింద ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించ బడవు. మీరు ప్రయాణించే టప్పుడు మీతో పాటు మీ యొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పని సరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.*
► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. 

*ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S*
S.No
Unit Name
WHATSAPP 
Mobile Number
e-mail ID's

 *1.* 
 *SRIKAKULAM* 
6309990933
dail100srikakulam@gmail.com

 *2.* 
 *VIZIANAGARAM* 
9989207326
spofvzm@gmail.com

 *3.* 
 *VISAKHAPATNAM RURAL* 

9440904229
vizagsp@gmail.com

 *4.* 
 *VISAKHAPATNAM CITY* 
9493336633
cpvspc@gmail.com

 *5.* 
 *EAST GODAVAI (KAKINADA*)

9494933233
sp@eg.appolice.gov.in

 *6.* 
 *RAJAHMUNDRY URBAN* 
9490760794
sp@rjyu.appolice.gov.in

 *7.* 
 *WEST GODAVARI* 

8332959175
policecontrolroomeluruwg@gmail.com

 *8.* 
 *KRISHNA (MACHILIPATNAM*)
9182990135
sp@kri.appolice.gov.in

 *9.* 
 *VIJAYAWADA CITY* 
7328909090
cp@vza.appolice.gov.in

 *10.* 
 *GUNTUR RURAL* 
9440796184
Dail100gunturrural@gmail.com

 *11.* 
 *GUNTUR URBAN* 
8688831568
guntururbansp@gmail.com

 *12.* 
 *PRAKASHAM* 
9121102109
spongole@gmail.com

 *13.* 
 *NELLORE* 
9440796383
nelloresp@gmail.com

 *14.* 
 *CHITTOOR* 
9440900005
spchittoor@gmail.com

 *15.* 
 *TIRUPATHI URBAN* 
9491074537
sptpturban@gmail.com

 *16.* 
 *ANANTHAPURAM* 
9989819191
spatp1@gmail.com

 *17.* 
 *KADAPA* 
9121100531
spkadapa2014@gmail.com

 *18.* 
 *KURNOOL* 
7777877722
spkurnool.kur@gmail.com
                                  
*

Monday, 3 May 2021

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. స్వర్ణలత


విజయవాడ, 03 మే: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా (పూర్తి అదనపు బాధ్యతలు) ఎల్. స్వర్ణలత మే 1వ తేదీన విజయవాడలోని కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు. 
1992లో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా డీపీఆర్వోగా ఎంపికైన లింగం స్వర్ణలత ... తొలుత గుంటూరులో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా (డీపీఆర్వో) గా తదనంతరం నెల్లూరులో విధులు నిర్వర్తించారు. రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులుగా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలో పనిచేశారు. ఆ తర్వాత ప్రాంతీయ ఉపసంచాలకులుగా విశాఖపట్టణం, విజయవాడలో విధులు నిర్వర్తించారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా పదోన్నతిపై విజయవాడ, ఒంగోలులో పనిచేశారు. కోస్తా తీరంలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా జోన్-1, జోన్-2, జోన్-3 లలో పనిచేసిన స్వర్ణలత విశేష అనుభవం గడించడమే కాక క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వహణలో మంచి పేరు సంపాదించారు. ఇటీవలే సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులుగా పదవీ విరమణ పొందిన డి.శ్రీనివాస్ స్థానంలో స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు. 

అనంతరం ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. 

గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో, విపత్తులు, వరదల సమయంలో, రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ పోటీలు తదితర కార్యక్రమాల్లో విశేష సేవలందించిన స్వర్ణలత  అదనపు సంచాలకులుగా మరిన్ని సేవలందించాలని ఈ సందర్భంగా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కోరారు.

................................................................................................................................................................

*జారీచేసిన వారు : సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

Sunday, 2 May 2021

RS ONE CRORE DONATION TO SVBC TRUST____



A corporate devotee from Chennai M/s G square Realtors has donated  Rs. 1 crore to the SVBC trust on Sunday morning.
Representatives of the corporate group handed over the DD to TTD Additional EO and MD of SVBC Sri AV Dharma Reddy at the Nada Niranjanam platform.

Saturday, 1 May 2021

కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు


- - పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతి
- - సామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం
- - పదుల సంఖ్యలో బాధితులు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నల్లగొండ : పెండ్లి సంబంధం కోసం మీ ఫోటో ఎవరికైనా ఇస్తున్నారా, ఆ వ్యక్తి గురించి మీకు అన్ని వివరాలు తెలిస్తేనే ఇవ్వండి..... లేదంటే ఇలా మోసపోతారని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు....

ఇలా అబ్బాయిల ఫోటోలను అమ్మయిల తల్లితండ్రుల వద్ద నకిలీ పేర్లతో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటుంది ఈ కిలాడీ లేడి... అంతే కాదు తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లితండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ కేసులలో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది ఈ మాయలేడి... ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు...

ఇక వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ఇందు దాసరి అలియాస్ ధరణి రెడ్డిపై వచ్చిన పిర్యాదు విచారించి నల్లగొండ వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. ఈ కిలాడీ లేడీపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్ తమను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా తాము షేర్ చేసిన తమ ఫోటోలను ఉపయోగించి పెండ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం కుదిరిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లుగా తమకు తెలిసిందని పిర్యాదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. వెంకటేష్ పిర్యాదు మేరకు విచారణ చేయగా కిలాడీ లేడీ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ కు చెందిన బొమ్మెల వెంకటేష్ కు ఇందు దాసరి పేరుతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని అతనితో నగ్నంగా వీడియో చాటింగ్ చేసి వాటిని తన వద్ద భద్రపర్చుకోవడమే కాకుండా అతని బంధువు, సోదరుడైన బొమ్మెల అనుదీప్ అనే వ్యక్తితో సైతం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని వారి ఫోటోలను సేకరించి గత మూడు నెలలుగా తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నదని, వారు అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలని నిలదీయడంతో డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులలో ఇరికిస్తానని బెదిరించినట్లు తెలిపారు. ముఖ్యంగా బొమ్మెల వెంకటేష్ కు ఇందు దాసరి అనే పేరుతో ఫేస్ బుక్ ఐ.డి.లో మహేశ్వరి అనే పేరుతో అనుదీప్ తో పరిచయము  చేసుకొని అతనితో చాటింగ్ చేసి అతన్ని మరోచోటికి తీసుకొని వెళ్లి అతనికి తెలియకుండా చూపించిందని తెలిపారు. అనుదీప్ పటేల్ ను మరోచోట వాళ్ళకు కార్తీక్ పేరుతో పరిచయము చేసిందన్నారు.
కూకట్ పల్లిలో మహేశ్వరి అలియాస్ మహేశ్వరి రెడ్డి పేరుతో ఆమె, సంతోష్ అనే మరో వ్యక్తి కలిసి మణికంఠ అనే వ్యక్తిని ఫేస్ బుక్ ఫేక్ ఐ డి తో పరిచయం చేసుకొని అతని ఫోటోలు సంపాదించి, వాటిని తన దగ్గర పెట్టుకొని అతడిని బెదిరించి 4 లక్షల 50 వేలు వసూలు చేసిందని చెప్పారు. ఈ విషయంలో కూకట్ పల్లిలో కేసు నమోదు కాగా రిమాండ్ చేశారని తెలిపారు. ఆ తర్వాత ఘట్ కేసర్ పరిధిలో అబ్బాయి మాదిరిగా ఒక అమ్మాయిని  ఫేస్ బుక్  లో  పరిచయం చేసుకొని తన దగ్గర ఉన్న వేరే వ్యక్తుల ఫోటోలు చూపించి ఆమెను లవ్ చేస్తున్నట్టుగా చెప్పి, ఆ తర్వాత తన ఆమె యువతిని బెదిరించి ఒక లక్షా 75 వేలు వసూలు చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు.కేసు విచారణలో ఉన్నట్లు వివరించారు. ఖమం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పారావు అనే వ్యక్తి కూతురుకి పెండ్లి సంబంధము ఉన్నదని, అప్పారావుకు బంధువు అయిన కిలాడి లేడీ జయంత్ అనే వ్యక్తి  ఫోటోలు చూపిస్తూ వాళ్లకు మాత్రం అతని పేరు కృష్ణహర్ష అని చెప్పి, వాళ్ల సోదరుడు వెంకటేష్.సిఐ ఉద్యోగం చేస్తున్నాడు, తాను సంబంధం కుదిరిస్తానని చెప్పడమే కాక, వాళ్ళు ఏడు లక్షలు అడుగుతున్నారని చెప్పి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నదని చెప్పారు. తరువాత వారు మోసపోయినట్లుగా తెలుసుకొని కేసు పెట్టినట్లు తెలిపారు. ఆలాగే  నాగలక్ష్మి అనే అమ్మాయికి పెండ్లి సంబందాలు చూస్తున్నానని చెప్పి వాళ్లకు వెంకటేష్ తమ్ముడు అనుదీప్ పటేల్ ఫోటోలు చూపించి అతని పేరు పేరు కార్తీక్ అని చెప్పి   మాయమాటలు చెప్పి ఫోను లో  మహేశ్వరే అబ్బాయి మాదిరిగా మాట్లాడి వారిదగ్గర మూడు లక్షలు  వసూలు చేసిందని, ఇలా మొత్తం 11 లక్షల 70 వేలు వసూలు చేసుకొని తప్పించుకొని నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో నివాసం ఉంటునట్లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు వివరించారు.
ఈ కిలాడీ లేడీపై కూకట్ పల్లి, ఘట్ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్లతో పాటు కరింనగర్ షీ టీమ్, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.

ఈ కేసు విషయంలో తక్కువ వ్యవధిలో వివరాలు సేకరించి సమర్ధవంతంగా పని చేసిన మహిళా పొలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ గౌడ్, నల్లగొండ వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేష్ లను డిఐజి రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.

కోవిడ్ ను జయించిన 99 ఏళ్ల వృద్ధురాలు


*మంగళగిరి రూరల్-*  కరోనా సెకండ్ వేవ్ ప్రజానికాన్ని వణికిస్తోంది.మహమ్మారి ప్రభావంతో వయసుతో తారతమ్యం లేకుండా అనేక మంది మృత్యువాత పడుతున్నారు.ఈ నేపథ్యంలో 99 ఏళ్ల వృద్ధురాలు కోవిడ్ నుండి కోలుకుని ఇతరులకు మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు.
విజయవాడ పటమటకు చెందిన గూడపాటి సుబ్రమణ్యం సతీమణి గూడపాటి లక్ష్మీ ఈశ్వరమ్మ కరోనా కరోనా బారిన పడ్డారు.ఈమె వయసు 99 సంవత్సరాలు.మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో వైద్యులు,నర్సింగ్ సిబ్బంది  కోవిడ్ కు చికిత్స అందించారు.పది రోజుల చికిత్స అనంతరం శనివారం సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యుల సూచన మేరకు మందులు వాడి పౌష్టికాహారం తీసుకోవటం వల్ల తాను కోలుకున్నట్లు చెప్పారు.కోవిడ్ సోకిన వారు ధైర్యాన్ని కోల్పోకుండా సమయానికి మెడిసిన్ వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే వైరస్ ను జయించవచ్చునని పేర్కొన్నారు.ప్రతీ ఒక్కరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.