హైదరాబాద్, మే 25, 2021.
ప్రజలు అనవసరంగా బయటకు రావడం మంచి పద్దతి కాదని...తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు.
ఈ రోజు కెపిహెచ్‌బి పిఎస్ పరిమితుల్లోని జెఎన్‌టియు చెక్‌పోస్ట్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్‌తో కలిసి సందర్శించిన డిజిపి వాహనదారులను తనిఖీ చేశారు..
లాక్డౌన్ రాష్ట్రవ్యాప్తంగా చాలా కఠినంగా అమలు ఆవుతోందని
ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ అమలు అవుతున్న విషయం అందరూ గ్రహించి పోలీసులకు సహకారాన్ని అందజేయాలని డిజిపి విజ్ఞప్తి చేశారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్డౌన్ మాత్రమే పరిష్కారంగా కనిపించడం వల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎటువంటి చెల్లుబాటు అయ్యే కారణం లేదా అవసరం లేకుండా ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటపడవద్దని కోరారు.
లాక్డౌన్ మినహాయింపు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయబడుతుందని. లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేయబడుతోందని. పర్యవేక్షించడానికి పోలీసు అధికారులందరూ రోడ్డుపైకి వచ్చారని..వైరస్ కట్టడికి స్వీయ నియంత్రణ ఎంతైనా అవసరమని మహేంధర్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులకు మాత్రమే అనుమతి వుందని ఇతరులు చెల్లుబాటు అయ్యే ఇ-పాస్‌లు వుంటేనే అనుమతి ఉంటుందని డిజిపి తెలిపారు. ఎటువంటి సరైన కారణం లేకుండా పాస్ కోసం దరఖాస్తు చేయవద్దని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించవద్దని ఆయన హెచ్చరించారు.
(Manikumar @ Satya News)
అనంతరం సజ్జనార్ అల్లిన్ క్రాస్ రోడ్లు, భెల్, రామ్‌చంద్రపురం మరియు ఇతర ప్రదేశాలలో పర్యటించారు. లాక్డౌన్ పరిస్థితిని తెలుసుకున్నారు.. లాక్డౌన్ నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు దీశ నిర్థేశం చేశారు. డిజిపి వెంట డిసిపి ట్రాఫిక్ శ్రీ ఎస్ఎం విజయ్ కుమార్, మాధపూర్ డిసిపి మిస్టర్ ఎం. వెంకటేశ్వర్లు మరియు కుకత్పల్లి ఎసిపి మిస్టర్ బి. సురేందర్ రావు తదితరులు వున్నారు...@@#
No comments:
Post a Comment