Saturday, 29 May 2021

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం


శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శ‌నివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment