మే 29, తిరుమల 2021: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమల శ్రీవారికి విరాళంగా అందాయి. టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ శివకుమార్, శ్రీ శేఖర్ రెడ్డి, కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు శ్రీ విజయరామ్ కలిసి ఈ విరాళాన్ని అందించారు.
దాతల తరఫున వారి ప్రతినిధి ఈ మేరకు విరాళాన్ని శ్రీవారి ఆలయం వద్ద ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు. ఇందులో 25 కిలోల పసుపును తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అందించాలని దాతలు కోరారు.
No comments:
Post a Comment