Friday, 28 May 2021

ఓటుకు నోటు కేసు చంద్రబాబు డైరెక్షన్లోనే -. శైలజా చరణ్ రెడ్డి


ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినదని వైకాపా రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజ రెడ్డి అన్నారు. గురువారం ఆమే విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేశారని, చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డితో పాటు వేం కృష్ణ కీర్తన్‌రెడ్డి, స్టీఫెన్‌సన్‌, చంద్రబాబు పాత్ర కూడా కీలకంగా ఉన్నదని, బ్రీఫ్‌డ్‌ మీ తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  వెలుగులోకి ఓటుకు కోట్లు కేసు ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు చేశారనేది, ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగం స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే  ధ్రువీకరించిన ఫోరెన్సిక్‌ నివేదిక ఉత్కంఠ ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు 2015 మే 31న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కి అతని ఇంట్లోనే రూ. 50 లక్షలు ఆఫర్‌ చేస్తూ రేవంత్‌ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిపిన విచారణలో 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' వ్యవహరం వెలుగు చూసింది.దాదాపు ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించి పక్కా ఆధారాలతో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందనే దానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

No comments:

Post a Comment