Thursday, 31 March 2022

అసేతు.. హిమచలానా యువతకు స్పూర్తి మన జెండా : ప్రియదర్శిని అడ్మిన్ డైరెక్టర్ ఎ.వి.రమణ ఉద్ఘాటన



యువత జాతీయ పతాకాన్ని తమ దైనందిన జీవితంలో ప్రధాన అంశంగా భావించాలని 101 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను స్మరించుకోవాలని అదే స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులకు మనం ఇచ్చే గౌరవం అని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అడ్మిన్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ అన్నా రు.
1921 మార్చి 31న మొదటిసారిగా జాతీయ పతాకాన్ని రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మా గాంధీ కి అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అట్లూరి  పాల్గొని ప్రసంగించారు.
దేశంలోని ఏ  విషయంపైనైనా వ్యతిరేకంగా మాట్లాడ వచ్చేమో కానీ జాతీయ పతాక విషయంలో మాత్రం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరాదని, స్వాతంత్ర సమర కాలంలో భరత జాతిని ఉద్యమం వైపు నడిపించిన అపురూప శక్తి జాతీయ పతాకం అని తెలిపారు. ప్రతి కదలికలో పతాకం పట్ల విశేషమైన గౌరవం మర్యాద తొణికిసలాడాలని కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
క్విట్ ఇండియా, జాతీయోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం  మరియు సాయుధ పోరాటాలు వైపుకు ప్రజలను ఆకర్షితులను చేసిన ప్రధాన ఆయుధం జాతీయ పతాకమేనని స్పష్టం చేశారు..
జాతీయ పతాకాన్ని తాకటమంటే మన శరీరాన్ని మనస్సును ఆత్మను ప్రకాశింప చేసుకోవడమేనని అన్నారు..
ఎన్ని అవాంతరాలు వచ్చినా, కాలాలు మారినా, ఎన్ని తరాలు మారినా, నిరంతరం ఉన్నత స్థాయిలో అన్నింటి కన్నా ఎత్తులో ప్రపంచానికి వెలుగునిచ్చేది కేవలం జాతీయ పతాకమని అట్లూరి అభివర్ణించారు...
స్వాతి, దివ్య, నిఖిత,రాగ,పల్లవి, రుక్సానా, సంయుక్త, నాగశ్రీ,  ఉదయ శ్రీ, సీతలతో తన సారధ్యంలో జాతీయపతాక కమిటీని ఏర్పాటు చేసారు...
దిశ దశలా జాతీయ పతాకాన్ని స్వాతంత్ర ఉద్యమాల చరిత్రను ప్రచారం చేసి దేశాన్ని విశ్వవిజేతగా నిలబెట్టడమే తమ ప్రాధాన్యతని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపాల్, విభాగాధిపతులు
నరసింహారావు, రమేష్, స్వామి, సతీష్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment