Saturday, 31 December 2022
సీతాకళ్యాణాన్ని కనులకు కట్టిన కలేక్టర్ సతీమణి గౌతమి...
Thursday, 29 December 2022
తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం
Tuesday, 27 December 2022
“సింగరేణి దర్శన్”**ప్రత్యేక ప్యాకేజీతో టి.ఎస్.ఆర్టీసీ... బస్సును లాంఛనంగా ప్రారంభించిన సంస్థ ఛైర్మన్, ఎం.డి**ఇక నల్ల బంగారం గనులను ఎంచక్కగా తిలకించే అవకాశం
Wednesday, 14 December 2022
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అద్యక్షునిగా లెటర్ హెడ్ పై తొలి సంతకం...కెసిఆర్ కు వెల్లువలా శుభాకాంక్షలు.. అభినంధనలు...
Monday, 12 December 2022
సింహాద్రి అప్పన్న ఆలయంలో భక్తి శ్రద్దలతో నిత్య కైంకర్యాలు...
విశాఖ /సింహాచలం, సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు సోమవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.
శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి సహస్ర నామార్చన, వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా , పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రా గమశాస్త్రం విధానంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.Wednesday, 7 December 2022
ఆందోళన వద్దు.. అండగా వుంటాం.. పాత్రీకేయుల ఇంటి జాగా బాధ్యత నాదే : మంత్రి పువ్వాడ
Tuesday, 6 December 2022
జర్నలిస్టుల పట్ల కెసిఆర్ ఆదర్శంగా నిలబడాలి
ఖమ్మం తమ పథకాలు కేంద్రం ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల పట్ల కూడా ఆదర్శంగా నిలబడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచించారు ఖమ్మం ప్రెస్క్లబ్లో మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు జర్నలిస్టులు కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయాలని కోరుతున్నారని ఆయన నొక్కి చెప్పారు.
దశాబ్ద కాలం పైబడి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెరాస ప్రభుత్వం 2014లో ఇళ్ల స్థలాల విషయం తన మేనిఫెస్టోలో చేర్చింసదని 8 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు సదర్ హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జర్నలిస్టుల కనీస అవసరాలు ఇళ్ల స్థలాలు వైద్యం సంబంధించిన సమస్యలను వెంటనే కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణాది రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించారని అదేవిధంగా తెలంగాణలో కూడా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన పేర్కొన్నారు అలాగే దళిత బంధు తరహా జర్నలిస్టు బంధు పథకం కూడా తెలంగాణలో ప్రవేశపెట్టాలని అది నూటికి నూరు శాతం జర్నలిస్టులకు వర్తింపజేయాలని ఆయన కోరారు జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ సంఘం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారుతిరువణ్ణామలైలో వెలిగిన భరణి దీపం... నేడు కృత్తికా దీపోత్సవం..
తమిళనాడు : తిరువన్నమాలైలో సోమవారం భరణి దీపం కాంతులు వెదజల్లాయి ఆలయంలో అర్చకులు ఐదు పెద్ద ప్రమిదల్లో ఆవు నెయ్యి నింపి ఒత్తులు వేసి సోమవారం ప్రదోషకాలం సాయంత్రం వెలిగించి స్వామివారికి హారతులు ఇచ్చారు. సోమవారం 100 ఏళ్ల కాలంనాటి వెండి రథంపై ఊరేగింపు నిర్వహించారు భరణి దీపాన్ని యమగండాలు తొలగించే దీపంగాను సమస్త భారాలు తొలగించే దీపం గాను తమిళనాడు వాసులు భావిస్తారు భరణి దీపం సోమవారం వెలిగించగా ఈరోజు సాయంత్రం కృత్తికా దీప వెలిగించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి తమిళనాడు పోలీసులు కృత్తికా దీపోత్సవానికి భద్రత ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు ఈ కృత్తికా దీపోత్సవానికి దాదాపు 30 లక్షల మంది వీక్షించేందుకు వస్తారని అంచనాతో భారీ భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ కంట్రోల్ రూమ్ వ్యవస్థలు తిరువన్నమాలై పోలీసులు ఏర్పాటు చేశారు భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు