Saturday, 31 December 2022

సీతాకళ్యాణాన్ని కనులకు కట్టిన కలేక్టర్ సతీమణి గౌతమి...

 భద్రాచలం, 31 డిసెంబర్:
 శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్  సతీమణి గౌతమి నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.     శనివారం నాడు రాత్రి శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల  సందర్భంగా నాట్య కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీతా కళ్యాణం కూచిపూడి నృత్యం చేశారు.సీతా కళ్యాణ ఘట్టాన్ని నర్తనలో చూపరుల కళ్లకు కట్టారు..   అనంతరం కలెక్టర్ దంపతులకు దేవస్థానం తరపున ప్రశంస పత్రం అందించి, సన్మానం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు
     ఈ కార్యక్రమంలో నృత్య గురువు మీనా కుమారి, వనిత శ్రీ కాదండి చిన్నారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment