తమిళనాడు : తిరువన్నమాలైలో సోమవారం భరణి దీపం కాంతులు వెదజల్లాయి ఆలయంలో అర్చకులు ఐదు పెద్ద ప్రమిదల్లో ఆవు నెయ్యి నింపి ఒత్తులు వేసి సోమవారం ప్రదోషకాలం సాయంత్రం వెలిగించి స్వామివారికి హారతులు ఇచ్చారు. సోమవారం 100 ఏళ్ల కాలంనాటి వెండి రథంపై ఊరేగింపు నిర్వహించారు భరణి దీపాన్ని యమగండాలు తొలగించే దీపంగాను సమస్త భారాలు తొలగించే దీపం గాను తమిళనాడు వాసులు భావిస్తారు భరణి దీపం సోమవారం వెలిగించగా ఈరోజు సాయంత్రం కృత్తికా దీప వెలిగించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి తమిళనాడు పోలీసులు కృత్తికా దీపోత్సవానికి భద్రత ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు ఈ కృత్తికా దీపోత్సవానికి దాదాపు 30 లక్షల మంది వీక్షించేందుకు వస్తారని అంచనాతో భారీ భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ కంట్రోల్ రూమ్ వ్యవస్థలు తిరువన్నమాలై పోలీసులు ఏర్పాటు చేశారు భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు
No comments:
Post a Comment