Tuesday, 6 December 2022

జర్నలిస్టుల పట్ల కెసిఆర్ ఆదర్శంగా నిలబడాలి

ఖమ్మం తమ పథకాలు కేంద్రం ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల పట్ల కూడా ఆదర్శంగా నిలబడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచించారు ఖమ్మం ప్రెస్క్లబ్లో మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు జర్నలిస్టులు కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయాలని కోరుతున్నారని ఆయన నొక్కి చెప్పారు.

దశాబ్ద కాలం పైబడి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెరాస ప్రభుత్వం 2014లో ఇళ్ల స్థలాల విషయం తన మేనిఫెస్టోలో చేర్చింసదని 8 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు సదర్ హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జర్నలిస్టుల కనీస అవసరాలు ఇళ్ల స్థలాలు వైద్యం సంబంధించిన సమస్యలను వెంటనే కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణాది రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించారని అదేవిధంగా తెలంగాణలో కూడా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన పేర్కొన్నారు అలాగే దళిత బంధు తరహా జర్నలిస్టు బంధు పథకం కూడా తెలంగాణలో ప్రవేశపెట్టాలని అది నూటికి నూరు శాతం జర్నలిస్టులకు వర్తింపజేయాలని ఆయన కోరారు జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ సంఘం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు

No comments:

Post a Comment