Monday, 12 December 2022

సింహాద్రి అప్పన్న ఆలయంలో భక్తి శ్రద్దలతో నిత్య కైంకర్యాలు...


విశాఖ /సింహాచలం, సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో  వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు సోమవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి సహస్ర నామార్చన, వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా , పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రా గమశాస్త్రం విధానంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

No comments:

Post a Comment