Friday, 28 June 2024

కేసీఆర్ ఉక్కు సంకల్పం సీతారామ ప్రాజెక్టు : నామా


▶️ కేసిఆర్ వల్లనే సీతారామ కల సాకారం

▶️ సీతారామ సక్సెస్ పట్ల నామ నాగేశ్వరరావు హర్షం

▶️ రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్

 ▶️▶️ ఖమ్మం, జూన్ 28 :  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 
అవిరళ కృషి, భగీరథ అద్భుత  ప్రయత్నంతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమై, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల జల సంకల్పం నెరవేరిందని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నీటితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమై, అన్నదాతల కలలు సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా తీసికొని ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి, కరవును పారదోలే కల్పతరవుగా ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు.ఈ మొదటి దశ పంపు హౌస్ ద్వారా గోదావరి జలాలు ఊరూరా పరుగులిడి, లక్షలాది ఎకరాలకు చేరతాయని అన్నారు.కేసీఆర్ ఉక్కు సంకల్పం వల్లనే ఈ ప్రాజెక్టు కల సాకారమైందని చెప్పారు.ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని తెలిపారు.ఈ ప్రాజెక్టు ను జిల్లా రైతాంగానికి అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు పనులన్నీ పూర్తి అయ్యాయని చెప్పారు.ఈ విజయంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కూడా అభినందిస్తున్నట్లు నామ నాగేశ్వరరావు తెలిపారు.

Wednesday, 26 June 2024

మాదకద్రవ్యాల మత్తులో పడకండి ; సి.పి.సునీల్ దత్ ఉద్భోద


ఖమ్మం, జూన్ 26: యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం - అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కారించుకొని బుధవారం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం అన్నింటికంటే భయంకరమైన వ్యాధని, అది చాప క్రింద నీరులా వ్యాప్తి చెందకుండా ముందస్తు అప్రమత్తత చాలా కీలకమని అన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని ఆయన అన్నారు. మత్తు పదార్థాల రవాణా, సరఫరా వినియోగాన్ని నిర్మూలించి తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తుందని, రాష్ట్ర యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి వినియోగంతో జరిగే అనర్థాలపై వివిధ శాఖల సమన్వయంతో 
పోలీసుశాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆయన తెలిపారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 8712671111 ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. గడచిన ఆరేళ్ళలో 204 కేసుల్లో 265 మందిని అరెస్ట్ చేసి రూ. 11 కోట్ల విలువ చేసే 9008 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి మత్తుకు అలవాటు పడిన 165 మందికి సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని  సృష్టించేందుకు తమవంతు సహకారం అందించేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. 
ఈ సందర్భంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని వైరా, కల్లూరు, ఖమ్మం రూరల్ డివిజన్‌ ఏసీపీ అధికారులు, అన్ని మండల పోలీస్ స్టేషన్లలో ఎస్.హెచ్.ఓ. ల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా యువతను, విద్యార్థులను, స్ధానిక పౌరులను చైతన్య పరుస్తూ అవగాహన ర్యాలీ లు నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రామ్ గోపాల్ రెడ్డి , అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సిఐలు భాను ప్రకాశ్ , శ్రీహరి, రమేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 22 June 2024

వదంతులు నమ్మకండి: టిటిడి..



తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు - టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం - టీటీడీ .తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది.పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేయడమైనది.
------------------------------
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దు - భక్తులకు టీటీడీ విజ్ఞప్తి 

ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని  కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం  సర్కులేట్  అవుతున్నది.

      వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరు గా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. భక్తులు గమనించ గలరు. అయితే కొందరు దళారులు  అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు  మా దృష్టికి వచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడమైనది అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.


ఆగస్ట్ నుండి భూముల కొత్త మార్కేట్ వాల్యూ: అధనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వెల్లడి


ఖమ్మం, జూన్ 21: జిల్లాలోని భూముల మార్కెట్ వ్యాల్యూపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
తహసీల్దార్ లు, మండల అభివృద్ధి అధికారులు, సబ్ రిజిస్టర్ లు, మునిసిపల్ కమీషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భూముల మార్కెట్ వాల్యూపై ప్రతి రెండేళ్లకు సమీక్ష జరుగుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు స్థానిక పరిస్థితులను బట్టి భూముల విలువ ఉంటుందని తెలిపారు. ఈ నెల 29 వ తేదీ వరకు సంబంధిత అధికారులు భూమి  విలువ డ్రాఫ్ట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నారు. సవరించిన ధరలు ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు ఆగస్టు నుంచి అమలులో ఉంటాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశం లో జడ్.పి. సిఇఓ ఎస్. వినోద్, జిల్లా రిజిస్టార్ చిట్టీమల్ల అశోక్ కుమార్ , ఆర్.డి.ఓ. గణేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 16 June 2024

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్...


ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
     నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్,  ఆర్డీఓలు జి. గణేష్, ఎల్. రాజేందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, ఖమ్మం అర్బన్ మండల తహసిల్దార్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల పర్యవేక్షకులు, సిబ్బంది,  మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.

Saturday, 15 June 2024

నాన్నగారి స్వాగతం ....


పుత్రికోత్సహం ఆ తండ్రి  ముఖంలో ఆనందమై విరిసింది.. తన కంటే పెద్ద ఉద్యోగం సాధించి శిక్షణ ఐఏఎస్ అధికారిగా తన వద్దకే  వచ్భిన కుమార్తె ను చూసి ఆ తండ్రి సేల్యూట్ కొట్టారు ..ఈ సంఘటన చూపరులను కట్టి పడేసింది . వివరాల్లోకి వెళితే టీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు కుమార్తే ఉమా హారతి ఐఎఎస్ సాధించి శిక్షణలో భాగంగా వివిధ శాఖల్లో పనితీరు పరిశీలనలో భాగంగా తన తండ్రి వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్ గా వున్న టీజీపీఏ అకాడమీ కి వచ్చారు ఐఏఎస్ గా తన అకాడమీకి వచ్ఛిన  కుమార్తేకు విధినిర్వహణలో.. పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు  వెంకటేశ్వర్లు అనంతరం ఆమెకు సెల్యూట్ చేశారు.. దీంతో ఆమె ఉప్పొంగిపోయింది

Friday, 14 June 2024

*జర్మనీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకలు*


*జర్మనీ:-* జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ.... “ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారు. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు మీ ఉద్యోగాలు, కుటుంబాల్ని వదలి రాష్ట్రంలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేసిన తీరు అభినంధనీయం. నియంత జగన్ రెడ్డి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన యోధుడు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి అధ్భుత, అసాధరణ విజయాన్ని మనకు అందించిన ఘనత చంద్రబాబు గారిదే. అభివృద్ధి, సంక్షేమం రెండూ జరగాలని ఆయన కోరుకుంటారు. కేవలం రాష్ట్రాభివృద్ధి చెందితే సరిపోదని దేశం కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షిస్తారు. 2014లో ఒకవైపు విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించిన దార్శనికుడు చంద్రబాబు. 2019 లో తెలుగు ప్రజలు చేసిన ఒక్క తప్పిదానికి ఐదేళ్లు అంధకారంలో ఏపీ మగ్గిపోయింది. నవరత్నాల పేరుతో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లో ఇష్టారాజ్యంగా జగన్ రెడ్డి ప్రభత్వం దోచుకుంది. రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారు. సంక్షేమ పథకాలను అందించకుండానే అందినట్లు చూపించి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన ఘనత జగన్ రెడ్డిది. జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని భరించలేని ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. 11 సీట్ల నుంచి తిరిగి పుంజుకోవడానికి జగన్ రెడ్డి ఏమి చంద్రబాబు కాదు. 2019లో 175కి కేవలం 23 సీట్లు నెగ్గాం. ఇక టీడీపీ పని అయిపోయిందని ఎవరెవరో విశ్లేషణలు ఇచ్చారు. కానీ గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జనలా 164 గెలిచి అఖండ విజయాన్ని సాధించాం. ఈ విజయంలో టీడీపీ ఎన్‌ఆర్ఐ విభాగం కూడా కీలకపాత్ర పోషించడం హర్షణీయం. ఈ విజయం అందరిది. జగన్ ప్రభుత్వంలా హింసా, విద్వేష రాజకీయాలు, పగలు, ప్రతీకారాలు తీర్చుకునే నీఛ ప్రభుత్వం మనది కాదు. అటువంటి వాటిని చంద్రబాబు ప్రోత్సహించరు కూడా. దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో మనం కూడా పాత్రను పోషించుదాం” అని గ్రీష్మ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ కోర్ కమిటీ సభ్యులు కుర్ర పవన్, బత్తల శివ, కొర్రపాటి సుమంత్, దాసరి వంశీ, మద్దిపట్ల తిట్టు, కోనేరు నరేష్, కుడితిపూడి శ్రీకాంత్, కండ్ర వెంకట్, మిక్కిలినేని అనిల్ తదిరులు పాల్గొన్నారు.

త్వరలో సామాన్యుల ధరణి.‌...మంత్రి పొంగులేటి

*• సామాన్యులకు అందుబాటులో ధరణి పోర్టల్*
*• రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు*
*• గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం – రెవెన్యూ మంత్రి పొంగులేటి*
*• మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ*
*• సిద్ధమవుతున్న ధరణి నివేదిక*
 గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత స్వయంగా తాను ఖమ్మం జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ ను పునర్ వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిందని ఈ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు.శుక్రవారం నాడు డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండ రెడ్డి, ఎం.సునిల్ కుమార్, మధుసూదన్ లతో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ (ధరణి) ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని, ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ చేసిన సిఫారసులపై ఈరోజు జరిగిన సమావేశంలో సుధీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేకంటే ముందు అన్నీ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.  ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలోని RoR యాక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించింది. భూమి వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన  చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందని మంత్రిగారు వెల్లడించారు. లోపభూయిష్టమైన 2020 RoR చట్టాన్ని తద్వారా రూపొందించిన ధరణి పోర్టల్ ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్ లో మార్పులు-చేర్పులు చేపట్టబోతున్నామని మంత్రిగారు వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బి లో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

*బస్ భవన్ ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ లు*

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్ లు బస్ భవన్ ని శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.తెలంగాణ కేడర్ కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో ప్రాక్టీకల్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్ ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్ లు ఉమా హారతి, గరిమా నరులా, మనోజ్‌, మృణాల్‌, శంకేత్‌, అభిజ్ఞాన్‌, అజయ్‌ లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్ లతో పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీడీఎస్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ కందుకూరి ఉషారాణి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Thursday, 13 June 2024

టికెట్ ధరలు పెంచలేదు..అలా ప్రచారం చేయకండి: సజ్జనార్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగిందని తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంస్థ పేర్కొంది.

Sunday, 9 June 2024

ముచ్చటగా మూడోసారి హస్తీన పీఠంపై మోడీ .. కొలువు తీరిన క్యాబినెట్....



దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ  ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 
కేంద్ర మంత్రులుగా పలు వురు ఎంపీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజర య్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజర య్యారు.
జవహర్‌లాల్ నెహ్రూ తర్వా త వరుసగా మూడోసారి
విశాల భారతం…. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం..లెక్కకు మించిన కులమతాలు… విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు…. అనేక రాజకీయ వైరుధ్యాలు…. నేతలపై నమ్మకం కోల్పో తున్న ప్రజలు…రాజకీయా లపై ఓ విధమైన ఏహ్య భావం….
రాష్ట్రాలపై వారసత్వ కుటుంబాల ఆధిప త్యం….ప్రాంతీయ పార్టీలకు పెరుగుతున్న ఆదరణ…. ఉనికి కోల్పోతున్న జాతీయ పార్టీలు… ఇలాంటి పరిస్థితులున్న చోట…ఒకే ఒక్కడు… తానే ఓ గ్యారంటీ అని ప్రకటించి… ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిగెలి చారు.
నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయా నుకూల రాజకీయ నిర్ణయా లు తీసుకోవడంలోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహా లతో ఓట్లు రాబట్టుకోవడం లోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి..తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు. 
అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకవ సరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు...
*భారత ప్రభుత్వ నూతన మంత్రివర్గం*

*ప్రధాని :* నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

*కేబినెట్ మంత్రులు:*

1) రాజ్‌నాథ్ సింగ్

2) అమిత్ అనిల్ చంద్ర షా

3) నితిన్ జయరాం గడ్కరీ

4) జగత్ ప్రకాష్ నడ్డా

5) శివరాజ్ సింగ్ చౌహాన్

6) నిర్మలా సీతారామన్

7) డా.సుబ్రహ్మణ్యం జయశంకర్

8) మనోహర్ లాల్

9) హరదనహళ్ళి దేవగౌడ కుమార స్వామి

10) పీయూష్ వేద్‌ప్రకాష్ గోయల్

11) ధర్మేంద్ర ప్రధాన్

12) జితిన్ రాం మాంఝీ

13) రాజీవ్ రంజన్ సింగ్

14) శర్వానంద సోనోవాల్

15) డా.వీరేంద్ర కుమార్

*16) కింజరాపు రామ్మోహన్ నాయుడు*

17) ప్రహ్లాద్‌ వెంకటేష్ జోషి

18) జుయొల్ ఒరాన్

19) గిరిరాజ్ సింగ్

20) అశ్వినీ వైష్ణవ్

21) జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా

22) భూపేంద్ర యాదవ్

23) గజేంద్రసింగ్ షెకావత్

24) అన్నపూర్ణ దేవి

25) కిరణ్ రిజుజు

26) హర్దీప్‌సింగ్ పూరి

27) డా.మన్సూక్ మాండవీయ

*28) గంగాపురం కిషన్ రెడ్డి*

29) చిరాగ్ పాశ్వాన్

30) సి.ఆర్.పాటిల్

*సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత)*

1) రావ్ ఇంద్రజీత్ సింగ్

2) డా.జితేంద్ర సింగ్

3) అర్జున్ రాం మేఘవాల్

4) ప్రతాప్‌రావ్ గణపతిరావ్ జాదవ్

5) జయంత్ చౌదరి

*సహాయ మంత్రులు*

1) జితిన్ ప్రసాద్

2) శ్రీపాద్ యశో నాయక్

3) పంకజ్ చౌదరీ

4) కృష్ణ పాల్

5) రాందాస్ అథోవలె

6) రాంనాధ్ ఠాకూర్

7) నిత్యానంద్ రాయ్

8) అనుప్రియ పటేల్

9) వి.సోమన్న

*10) డా.పెమ్మసాని చంద్రశేఖర్*

11) ప్రొఫెసర్ ఎస్.పి సింగ్ భగేల్

12) శోభా కరణ్ రాజె

13) కీర్తివర్ధన్ సింగ్

14) బి.ఎల్.వర్మ

15) శంతను ఠాకూర్

16) సురేష్ గోపి

17) డా.ఎల్ మురుగన్

18) అజయ్ తంత

*19) బండి సంజయ్ కుమార్*

20) కమలేష్ పాశ్వాన్

21) భగీరథ్ చౌదరీ

22) సతీష్ చంద్ర దూబే

23) సంజయ్ సేథ్

24) రవనీత్ సింగ్

25) దుర్గాదాస్ ఉయికే

26) రక్షా నిఖిల్ ఖడ్సే

27) సుకంత మజుందార్

28) సావిత్రి ఠాకూర్

29) తోఖన్ సాహు

30) డా.రాజ్ భూషణ్ చౌదరీ

*31) భూపతి రాజు శ్రీనివాస వర్మ*

32) హర్ష్ మల్హోత్ర

33) నిముబాయ్ జయంతిబెన్ మమడియా

34) మురళీదర్ మొహోల్

35) జార్జ్ కురియన్

36) పవిత్ర మార్గెరిట

*💥చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధం..**11 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి*


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ఐదుగరు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులతోపాటుగా దాదాపు లక్ష మందికిపైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. 80 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Friday, 7 June 2024

పకడ్బందీగా గ్రూప్ -1ప్రిలిమినరీ... 10 గంటల వరకే ఎంట్రీ... కలెక్టర్ వి పి గౌతమ్


ఖమ్మం :   జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు   గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, సూచనలు చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం  గ్రూప్-1 ప్రిలిమినరీ పరిక్షల నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి సారిగా బయోమెట్రిక్ పద్దతిన పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.  జిల్లాలో మొత్తం 52 సెంటర్లు ఏర్పాటు చేయగా, 18403 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవనున్నట్లు ఆయన అన్నారు.  పరీక్షకు  హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ పరిక్ష కేంద్రాన్ని  తెలుసుకోవాలని తెలిపారు.  అభ్యర్థుల హాల్ టికెట్స్ టిజిఎస్పిఎస్సి సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థులు పరిక్షా కేంద్రానికి ఉదయం 9.00 గంటలకే చేరుకోవాలని అన్నారు. ప్రతి కేంద్రంలో ఉదయం 10.00 గంటలకు గేట్లు మూసివేయాలని అధికారులని ఆదేశించారు. మహిళా అభ్యర్థులను తనిఖీలు చేయడానికి, ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు.   ప్రతి పరీక్ష హాలులో  వెబ్  కెమెరాలు ఏర్పాటు  చేయాలన్నారు. అభ్యర్థికి అభ్యర్థికి ఒక మీటరు దూరం పాటించేలా చూడాలని అన్నారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలని తెలిపారు. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించుకొని, సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాలని, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్స్ , డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సెల్ ఫోన్ లు అనుమతి లేదని అన్నారు. అభ్యర్థులు షూస్, జ్యూవెల్లరి వేసుకొని రాకూడదని, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లకు, రికార్డింగ్ వస్తువులు, క్యాలిక్యులేటర్, వాచ్, రైటింగ్ ప్యాడ్ లకు  అనుమతి లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు  విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. జాన్ బాబు, ఎస్బిఐటి ప్రిన్సిపాల్ డా. డి. రాజకుమార్, జిల్లా అధికారులు,  ఫ్లైయింగ్ స్కాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 4 June 2024

మచ్చలేని వ్యక్తిత్వంతో సేవలందించా.. నామా ఉద్వేగం ... గెలిచినా...ఓడినా .ప్రజల మధ్యే ఉంటా....


❇️ గెలుపోటములు సహజం
❇️ గెలిచినా... ఓడినా .ప్రజల మధ్యే ఉంటా
❇️ కన్న తల్లి ఎంత ఇష్టమో
నియోజకవర్గ ప్రజలంటే అంతే ఇష్టం
❇️ మచ్చలేని వ్యక్తిత్వంతో సేవలందించా..
❇️ పార్టీ శ్రేణులందరికీ, ఓటర్లకు  కృతజ్ఞతలు 
❇️ తొమిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశాం
❇️ రఘురాంరెడ్డి కి  అభినందనలు
👉 బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి  నామ నాగేశ్వరరావు 
తాను గెలిచినా...ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల 
మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ  నాగేశ్వరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం  ఇక్కడ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో ..నా నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదు ..ఓడితే కుంగేది లేదని అన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రశ్నించే గొంతుకగా ఉంటూ వారి  సమస్యల పరిష్కారం కోసం.. సంక్షేమమే ధ్యేయంగా   పని చేస్తానని వెల్లడించారు. ప్రజల 
కనీస సదుపాయాల కోసం కొట్లాడతాని చెప్పారు. ఎంపీ గా ప్రజా సేవే  లక్ష్యంగా ఎలాంటి అవినీతి కి ఆస్కారం లేకుండా మచ్చ లేని వ్యక్తిత్వంతో ప్రజలకు సేవలు అందించానని గుర్తు చేశారు.నాకు అన్ని విధాలా అండగా ఉండి, ముందుకు నడిపించిన  పార్టీ కార్యకర్తలు,  నాయకులకు, అభిమానులకు,  శ్రేయోభిలాషులకు , తనకు ఓటేసిన ఓటర్లకు  కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలువుతున్నట్లు నామ పేర్కొన్నారు.తన  బలం.. 
బలగం  ధైర్యం..ప్రజలేనని, అదే లక్ష్యంతో ఇకముందు కూడా వారికి ఎల్లవేళలా  అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిస్కారం.. సంక్షేమం కోసం శ్రమిస్తానాన్ని  స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలతోనే తన జీవితం  అన్నారు . ఇక్కడే పుట్టాను ..ఇక్కడే పెరిగాను ..ఇక్కడే నా ప్రజల మధ్యనే ఉంటాను. .ఎల్లవేళల  ప్రజల కోసం నా  ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి.. ఏ సమస్య వచ్చినా తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పు కోవచ్చని నామ తెలిపారు .తన జీవితం  ప్రజాసేవకే అంకిత మని ప్రజా సేవ లోనే ఉంటానని  నామ మరోమారు స్పష్టం చేశారు .తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో  ఎంతో  అభివృద్ధి జరిగిందని, గడప గడపకు  సంక్షేమ పథకాలు చేర్చామని,ప్రతి వ్యక్తి ఏదో రూపంలో లబ్ది పొందేలా ప్రజారంజక పాలన అందించ గలిగామని   అన్నారు..గెలిచిన రఘురాంరెడ్డి కి  అభినందనలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు తెలిపారు

Sunday, 2 June 2024

రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం.. టి ఎస్ ఆర్ టి సి ఎండి సజ్జనార్....


*తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం*
*ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు*
*పెరిగిన రద్దీకి అనుగుణంగా 2990 కొత్త బస్సులు*
*త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ*
*తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్*
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స‌జ్జ‌న‌ర్ అన్నారు. ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హాజరై.. జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. తెలంగాణ ఉద్య‌మంలో ప్రాణాల‌ర్పించిన అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భ‌ద్ర‌తా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. 
ఈ సందర్భంగా స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మ‌లి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తున్నామని అన్నారు. “ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు ‘మేము సైతం’ అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారు. దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచింది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది.” అని అన్నారు. 
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే  అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్పూర్తితో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతోందన్నారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. 
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7  ఏళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి.. ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు.
గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. 
కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర అవ‌ర‌త‌ణ వేడుకల్లో టీజీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ఫ, సీఈఐటీ రాజ‌శేఖ‌ర్, సీటీఎం(కమర్షియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీసీవోఎస్ విజయభాస్కర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Saturday, 1 June 2024

తెలంగాణ గుండె చప్పుడు కేసిఆర్... దశాబ్ధి వేడుకల్లో అందరం భాగస్వాములు అవుదాం... నామ పిలుపు




 ఖమ్మం, జూన్ 01 :  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు బీఆర్ ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో అంతా పాల్గొని భాగస్వాములు కావాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించి, సాధించుకున్న తెలంగాణాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి, తెలంగాణాను  సాదించుకున్నామని, గత పదేండ్లలో ఎంతో ప్రగతి సాదించుకున్నామని ప్రజల జీవితాల్లో కూడా సమూల మార్పులు తీసుకురావడమే కాకుండా ప్రతి తెలంగాణా బిడ్డ సగర్వoగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిగా చేసుకున్నామని చెప్పారు.దేశం గర్వించేలా కేసీఆర్ తెలంగాణా ను అన్ని విధాలా అభివృద్ధి చేశారని అన్నారు. కష్టపడి సాధించుకుని, అభివృద్ధి చేసుకున్న తెలంగాణాను విచ్ఛిన్న o కాకుండా జాగ్రత్త పడాలని, కేసీఆర్ కు అండగా నిలవాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.తెలంగాణా కల సాకారం చేసుకుని,బంగారు తెలంగాణా గా రుదిద్దిన కేసీఆర్ చరిత్ర ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారని నామ స్పష్టం చేశారు.

తిరుమల కొండలపై అడుగడుగునా హనుమకీ జన్మోత్సవ వేడుకలు

ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో శాస్త్రోక్తంగా సుమ‌ల్లికార్చ‌న‌
– జ‌పాలి తీర్థంలోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన టీటీడీ ఈవో
– తిరుమ‌ల‌లో వైభ‌వంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు ప్రారంభం

తిరుమ‌ల‌, 2024 జూన్ 01: శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం నుండి శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారు వెల‌సి ఉన్నార‌ని, హ‌నుమ‌త్‌ జ‌యంతి సంద‌ర్భంగా విశేష అభిషేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు శ‌నివారం వైభ‌వంగా ప్రారంభమ‌య్యాయి.

ముందుగా ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి, శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారికి శ్రీ‌వారి ఆల‌యం నుండి విశేష‌మైన శేష‌ వ‌స్త్రాలు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మ‌ర్పించారు. హ‌నుమంతుని జ‌న్మ విశేషాల‌తో ప్రారంభ‌మై, ఉప‌చారాలు, పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. లోక క్షేమం కొర‌కు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన మ‌ల్లెల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న నిర్వ‌హించారు.
జ‌పాలి తీర్థంలోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి….

జ‌పాలి తీర్థంలోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి ఈవో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.
అనంత‌రం జ‌పాలి తీర్థం వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ, హ‌నుమంతుల వారు అంజ‌నాదేవి త‌పోఫ‌లితంగా వాయుదేవుని వ‌ర‌ప్ర‌సాదంతో అంజ‌నాద్రిలో జ‌న్మించార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు. హ‌నుమజ్జ‌యంతి సంద‌ర్భంగా హ‌నుమ జ‌న్మ‌స్థాన‌మైన ఆకాశ‌గంగ తీర్థంలోని శ్రీ బాలంజ‌నేయస్వామివారికి ఐదు రోజుల పాటు అభిషేకం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. అదేవిధంగా నాద‌నీరాజ‌నం వేదిక‌, ఆకాశ‌గంగ‌, జ‌పాలి ప్రాంతాల్లో ధార్మికోప‌న్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు.
జూన్ 2వ తేదీ ఆదివారం ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంద‌ని, హ‌నుమంతుడు సీతాన్వేష‌ణ కోసం లంక‌కు వెళ్లి సీత‌మ్మ జాడ తెలుసుకుని శ్రీ‌రామ‌చంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2823 శ్లోకాల‌ను పండితులు పారాయ‌ణం చేస్తార‌ని చెప్పారు. హ‌నుమంతుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా రామ‌కార్యం కోసం వెళ్లారో అదేవిధంగా పండితులు నిరంత‌రాయంగా 18 గంట‌ల పాటు పారాయ‌ణం చేస్తార‌ని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల కోసం ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌న్నారు.
జాపాలి మ‌హ‌ర్షి త్రేతాయుగంలో ఆకాశ‌గంగ‌లో త‌ప‌స్సు చేయ‌డంతో హ‌నుమంతుడు ప్ర‌త్య‌క్ష‌మై వ‌రాలిచ్చార‌ని, అనంత‌రం ఇక్క‌డి జాపాలి తీర్థంలో హ‌నుమంతుని విగ్ర‌హాన్ని మహ‌ర్షి ప్ర‌తిష్టించార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు. ఇక్క‌డి స్వామివారిని, స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మైన‌ ఆకాశ‌గంగ‌లో మాతృమూర్తి శ్రీ అంజ‌నాదేవి స‌మేత‌ శ్రీ బాలాంజ‌నేయ‌స్వామిని భ‌క్తులు ద‌ర్శించుకుని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

"జ‌పాలి తీర్థంలో మొద‌టి సారిగా మాల్ పూరి ప్ర‌సాదం*
రాష్ట్ర దేవాదాయ శాఖ‌ క‌మీష‌న‌ర్ ఆదేశాల మేర‌కు జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో మొద‌టి సారిగా మాల్ పూరి ప్ర‌సాదాన్ని విక్ర‌యిస్తున్న‌ట్లు హ‌థీరాంజీ మ‌ఠం ప‌రిపాల‌న ఆధికారి శ్రీ ర‌మేష్ తెలిపారు. హ‌నుమ‌త్ జ‌యంతి సంద‌ర్భంగా శ‌నివారం నుండి ప్ర‌తి రోజు భ‌క్తుల‌కు విక్ర‌యిస్తామ‌న్నారు. రూ.20 విలువ గ‌ల ఈ మాల్ పూరి ప్ర‌సాదం ఎంతో ఎంతో రుచిక‌రంగా ఉంద‌ని, భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని ఆయ‌న చెప్ప‌రు.

శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో..

శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వ‌హించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.