Friday, 7 June 2024

పకడ్బందీగా గ్రూప్ -1ప్రిలిమినరీ... 10 గంటల వరకే ఎంట్రీ... కలెక్టర్ వి పి గౌతమ్


ఖమ్మం :   జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు   గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, సూచనలు చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం  గ్రూప్-1 ప్రిలిమినరీ పరిక్షల నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి సారిగా బయోమెట్రిక్ పద్దతిన పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.  జిల్లాలో మొత్తం 52 సెంటర్లు ఏర్పాటు చేయగా, 18403 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవనున్నట్లు ఆయన అన్నారు.  పరీక్షకు  హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ పరిక్ష కేంద్రాన్ని  తెలుసుకోవాలని తెలిపారు.  అభ్యర్థుల హాల్ టికెట్స్ టిజిఎస్పిఎస్సి సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థులు పరిక్షా కేంద్రానికి ఉదయం 9.00 గంటలకే చేరుకోవాలని అన్నారు. ప్రతి కేంద్రంలో ఉదయం 10.00 గంటలకు గేట్లు మూసివేయాలని అధికారులని ఆదేశించారు. మహిళా అభ్యర్థులను తనిఖీలు చేయడానికి, ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు.   ప్రతి పరీక్ష హాలులో  వెబ్  కెమెరాలు ఏర్పాటు  చేయాలన్నారు. అభ్యర్థికి అభ్యర్థికి ఒక మీటరు దూరం పాటించేలా చూడాలని అన్నారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలని తెలిపారు. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించుకొని, సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాలని, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్స్ , డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సెల్ ఫోన్ లు అనుమతి లేదని అన్నారు. అభ్యర్థులు షూస్, జ్యూవెల్లరి వేసుకొని రాకూడదని, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లకు, రికార్డింగ్ వస్తువులు, క్యాలిక్యులేటర్, వాచ్, రైటింగ్ ప్యాడ్ లకు  అనుమతి లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు  విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. జాన్ బాబు, ఎస్బిఐటి ప్రిన్సిపాల్ డా. డి. రాజకుమార్, జిల్లా అధికారులు,  ఫ్లైయింగ్ స్కాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment