ఖమ్మం, జూన్ 01 : తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు బీఆర్ ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో అంతా పాల్గొని భాగస్వాములు కావాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించి, సాధించుకున్న తెలంగాణాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి, తెలంగాణాను సాదించుకున్నామని, గత పదేండ్లలో ఎంతో ప్రగతి సాదించుకున్నామని ప్రజల జీవితాల్లో కూడా సమూల మార్పులు తీసుకురావడమే కాకుండా ప్రతి తెలంగాణా బిడ్డ సగర్వoగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిగా చేసుకున్నామని చెప్పారు.దేశం గర్వించేలా కేసీఆర్ తెలంగాణా ను అన్ని విధాలా అభివృద్ధి చేశారని అన్నారు. కష్టపడి సాధించుకుని, అభివృద్ధి చేసుకున్న తెలంగాణాను విచ్ఛిన్న o కాకుండా జాగ్రత్త పడాలని, కేసీఆర్ కు అండగా నిలవాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.తెలంగాణా కల సాకారం చేసుకుని,బంగారు తెలంగాణా గా రుదిద్దిన కేసీఆర్ చరిత్ర ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారని నామ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment