ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, ఆర్డీఓలు జి. గణేష్, ఎల్. రాజేందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, ఖమ్మం అర్బన్ మండల తహసిల్దార్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల పర్యవేక్షకులు, సిబ్బంది, మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.
No comments:
Post a Comment