ఖమ్మం, జూన్ 21: జిల్లాలోని భూముల మార్కెట్ వ్యాల్యూపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
తహసీల్దార్ లు, మండల అభివృద్ధి అధికారులు, సబ్ రిజిస్టర్ లు, మునిసిపల్ కమీషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భూముల మార్కెట్ వాల్యూపై ప్రతి రెండేళ్లకు సమీక్ష జరుగుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు స్థానిక పరిస్థితులను బట్టి భూముల విలువ ఉంటుందని తెలిపారు. ఈ నెల 29 వ తేదీ వరకు సంబంధిత అధికారులు భూమి విలువ డ్రాఫ్ట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నారు. సవరించిన ధరలు ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు ఆగస్టు నుంచి అమలులో ఉంటాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశం లో జడ్.పి. సిఇఓ ఎస్. వినోద్, జిల్లా రిజిస్టార్ చిట్టీమల్ల అశోక్ కుమార్ , ఆర్.డి.ఓ. గణేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment