మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో... శ్రీశైలం పుణ్యక్షేత్రానికి లక్ష విస్తరాకులను గురువారం అందజేశారు.
వీటిని ఇ.ఒ.కెఎస్.రామారావు శ్రీశైలం దేవాలయం అన్న సత్రం వద్దస్వీకరించి కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే సేవ సమితీ తరఫున మంచిరాజు మహాలక్ష్మీ దంపతులు సేవ సమితీ బాధ్యులతో కలసి లక్ష రూపాయలు గోశాలలో గోమాతలకు ఆహారం కోసమై అందజేయగా..
గత సంవత్సరం చేపట్టిన లక్ష విస్తర్ల సేవకు కొనసాగింపుగా ఈ ఏడాది కూడా రెండు లక్షల రూపాయల విలువతో లక్ష విస్తారాకులను కొనుగోలు చేసి ట్రాన్సుపోర్టు ఇతరత్రా ఖర్చులు భరించి శ్రీశైలం ఆలయంలోని అన్నప్రసాద శాలలో అందజేశారు. శివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో వచ్ఛే భక్తులకు అన్న ప్రసాదం అందజేసేందుకు వీటిని వినియోగించనున్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీఎస్ మహాలక్ష్మి, అబ్బరాజు శ్రీనివాసకుమార్ తదితరులను ఆలయ అధికారులు అభినందించారు....
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉన్న సమితి ప్రతినిధుల సహకారంతో సుమారు రూ.2 లక్షల విలువైన విస్తర్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భధ్రాచల వాస్తవ్యులు.. తూము నరసింహదాసు వారసులు.. సీనియర్ పాత్రీకేయులు.. తూము శ్యామ్ గారిని సమితీ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది.. సమితీ బాధ్యులు.. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ.శ్రీనివాసకుమార్, ఎ.రాము(అనంతపురం), నాగేంద్రమ్మ, కె.మల్లిశ్వరి(తెనాలి), ఎ.రామచంద్రయ్య, సి.హెచ్.అప్పారావు(హైదరాబాద్), పి.గురవయ్య, వై.ప్రణయతి, లలితా ప్రసాద్, ప్రసన్న, సాంబశివరావు, విష్ణు మూర్తి, పురుషోత్తం(భధ్రాచలం) తదితరులు తమ తమ టీం సభ్యులతో కలసి పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు.
Dhanyavaadaalu
ReplyDelete