Wednesday, 30 June 2021

శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోవాలూ..శాస్త్రోక్తంగా అభిషేకం...


                     
*తిరుపతి,2021జూన్ 30

తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం  స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం నిర్వ‌హించారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు. 

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు
శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో
శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.  సాయంత్రం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

        ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------

అవినీతి సిబ్బంది పై ఎస్.పి.సింధుశర్మ కన్నేర్ర.. ముగ్గురు ఎస్.ఐ.లపై వేటు...

జగత్యాల ఎస్పీ సింధుశర్మ అవినీతి సిబ్బందిపై గురి పెట్టారు. వరుస దాడులతో జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ క్షేత్ర స్థాయి సిబ్బందిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం ఆరంభించారు. ఇటీవల కాలంలో జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ, కథలాపూర్ ఎస్ఐ పృథ్వీథర్ గౌడ్, కానిస్టేబుల్ రమేష్‌లు లంచం తీసుకుంటూ పోలీసులు ఏసీబీకి చిక్కారు. దీంతో, అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గురించి ఆరా తీయించిన ఎస్పీ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, బుధవారం ముగ్గురు ఎస్‌ఐలను అటాచ్డ్ చేశారు. అయితే, జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ వరుస దాడులు అధికారులను అలర్ట్ చేశాయి. దీంతో, ఎస్పీ సింధూ శర్మ అవినీతికి పాల్పడుతున్న పోలీసుల డాటా సేకరించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.ఆమె లక్ష్యం నేరువేరుతుందా లేక ఆమె ముక్కుసూటి తనానికి బదిలీ బహుమతి దొరుకుతుందో వేచి చూడాలి..


Thursday, 24 June 2021

సీపీఐ రామకృష్ణగారు నిజమైన కమ్యూనిస్టులా ఆలోచించండి - శైలజా చరణ్ రెడ్డి



ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా..? సీఎం వైఎస్‌ జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ పై స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ రెడ్డి సీపీఐ రామకృష్ణగారు నిజమైన  కమ్యూనిస్టులా ఆలోచించండి అని హితవు పలికారు
విద్యార్ధులు, నిరుద్యోగుల పట్ల మీకున్న చిత్తశుద్దికి ధన్యవాదాలు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు..
విద్యార్ధులు, నిరుద్యోగులపై మీకెందుకు ప్రేమ లేదని ప్రశ్నించారు

వారి భవిష్యత్తు గురించి మీరెందుకు ఆందోళన చెందలేదు..?

2014 -19 మధ్య 9 నోటిఫికేషన్లే ఇచ్చి..
216 పోస్టులే ఉన్నాయని చెబితే..
చంద్రబాబును నిలదీయాలని మీకెందుకు అనిపించలేదు..?
రామకృష్ణ గారు ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ వాళ్లని ..
రోడ్డు మీదకు తీసుకొచ్చి నినాదాలు చేయించడం కాదు సార్‌..!!
సీఎం జగన్‌ గారు ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నారో చూడండి.
వచ్చిన రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు..
జాబ్ క్యాలండర్ ద్వారా 10, 143 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దమయ్యారు..?
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు..
జాబ్ క్యాలండర్  అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారు..?
ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరుగుతుందో...నిజమైన  కమ్యూనిస్టులా ఆలోచించండి అని శైలజా చరణ్ రెడ్డి సూచించారు

జగన్నాధునికి జైష్టపున్నమి ఉత్సవం..స్నాన యాత్ర..పరమాత్మునికి 14రోజుల చీకటి గది వాసం..


పరమాత్మునికే తప్పని.14 రోజుల గృహ బంధనం.. పూరిలో ప్రచారం లో వున్న జగన్నాధుని జ్వరం కధ..

 .  భూమిపై పుట్టిన వారికి జరామరణాలు అనివార్యం... 
పుట్టిన వారికి మరణం తప్పదు. సుఖదుఃఖాలు, వ్యాధులు అనివార్యం. తాను కూడా వాటికి అతీతుణ్ణి కానని చాటిచెబుతు 14 రోజులు వెలుతురు తక్కువగా వుండే మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ సర్వాంతర్యామి పూరి జగన్నాథుడు  వైధ్యం చేయించుకున్నట్లు పూరణ కధ. దీనిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓడిశాలోని  పూరిలో ఓ వేడుక రూపంలో నిర్వహిస్తారు.
జ్వరం పేరిట 14 రోజులు చీకటి మందిరంలో గోప్య చికిత్స, సేవలు నిర్వహిస్తారు. తర్వాత నవయవ్వన రూపంతో భక్తులకు కనులపండువ చేసి పెంచిన తల్లి సన్నిధి(గుండిచా మందిరం)కి రథాలపై చేరుకుంటారు. ఇందులో భాగంగా నిర్వహించే  కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గోంటారు..
దీనికి సంబంధించిన ఓ వృత్తాంతం గమనంలో వుంది
 ఇహ ఆలయంలో జరిగే వేడుక గురించి తెలుసుకుందాం.
చీకటి మందిరంలో చికిత్స వేడుకను పూరిలో జగన్నాథ ఆలయంలో
ఏటా జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన జరుగుతుంది. ఈ వేడుకలో చతుర్థామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్ర జలాలతో స్నానమాచరిస్తారు. దీన్నే దేవ స్నాన యాత్రగా పేర్కొంటారు. స్నాన పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పూరి మందిరంలో స్నానమండపంలో ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించారని. జల క్రీడలాడిన పురుషోత్తముడు జ్వరానికి గురై, అదేరోజు రాత్రి చీకటి మందిరానికి చేరుకోగా అక్కడ పక్షం రోజులు స్వామి వారికి గోప్య చికిత్సలు నిర్వహిస్తారు.. గోప్య సేవల నేపధ్యంలో 14 రోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం ఉండదు. అస్వస్థతకు లోనైన చతుర్థా మూర్తులకు దైతాపతి సేవాయత్‌లు సేవలు చేస్తారు. వారికి పలియా సేవాయత్‌లు సహకరిస్తారు. ఈ గదిలోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు.
స్వామికిక్కడ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స జరుగుతుంది. కరక్కాయ, జాజి, తాడి, గుగ్గిలం, కర్పూరం, చెట్ల బెరళ్లు, ఆకు పసర్లతో తయారు చేసిన ఔషధాలను చికిత్సలో వాడతారు. నువ్వుల నూనెలో పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి మట్టి కుండల్లో ఏడాది పాటు మట్టిలో పాతిపెట్టి ఉంచుతారు. చీకటి గది సేవల సమయంలో ఈ కుండలు వెలుపలకు తీసి శుద్ధి చేసి స్వామికి లేపనంగా వినియోగిస్తారు. దీన్ని పుల్లెరి తెల్లో అంటారు. గోప్య సేవల్లో 11వ రోజు రాజవైద్యుని సూచనల మేరకు దశమూలికా గుళికలు పురుషోత్తమునికి అర్పిస్తారు. దీంతో స్వామి కోలుకుంటారు. పథ్యంలో భాగంగా ఈ పద్నాలుగు రోజులూ పళ్లు, ఖర్జూరం, తేనె, జున్ను, పంచామృతం నైవేద్యంగా పెడతారు.  
ఆరోగ్యవంతుడైన స్వామి ఆషాఢ శుద్ధ పాఢ్యమి నాడు భక్తులకు దర్శనమిస్తాడు. . పద్నాలుగు రోజులూ అస్వస్థతతో కళ్లు తెరవని స్వామి ఆరోగ్యవంతుడై, ఆసనాన్ని అధిరోహించి భక్తులను పెద్ద కళ్లతో వీక్షిస్తారు. అందుకే దీన్ని నేత్రోత్సవం అని పిలుస్తారు. మనవునిగా పుట్టినందుకు దైవం కాల ధర్మం ఆచారించారు..మనం అతీతులం కాదని గమనించాలి..

Saturday, 19 June 2021

లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి - శైలజ చరణ్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ మాటలను ఖండిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ చరణ్ రెడ్డి మహిళా విభాగం తరపున హెచ్చరించారు.

●నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.దయచేసి రోడ్ లో తిరగకు పిచ్చికుక్క అని కొడతారు.....

●మాజీ సీఎం కొడుకు లాగా మాట్లాడు తాగుబోతు కొడుకులాగా మాట్లాడకు. నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటునావు,

●జగన్ అన్న ని ఎదుర్కోవడం మీ నాయన వల్లనే కాలేదు నువ్వెంత...

●మీ అబ్బ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే.. అనంత‌పురం జిల్లా రాప్తాడులోని త‌హ‌శీల్దార్ కార్యాలయానికి పిలిపించి వైసీపీ లీడ‌ర్ ప్రసాద్‌రెడ్డిని చంపేశారు. 

●చంద్ర‌బాబు 2014లో సీఎం అయ్యాక కేవ‌లం రూ.5 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే రాయ‌ల‌సీమ‌లోని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. కానీ ఐదేళ్ల‌లో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయ‌లేదు

●2019లో వైయ‌స్ జ‌గ‌న్ 151 సీట్లు గెలిచి టీడీపీని అరు అడుగుల లోతులో పాతిపెట్టాడు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల్లో టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయ్యింది. అందుకే క‌దా తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు పార్టీ లేదు..బొక్కా లేద‌న్నాడు.
●జ‌గ‌న్ చిటికేస్తే మీరు కూడా తిరుగ‌లేరు..కానీ వైయ‌స్ జ‌గ‌న్‌కు అలాంటి ఆలోచ‌న లేదు. సీఎంను ప‌ట్టుకొని ఇన్ని బూతులు మాట్లాడుతున్నావంటే..అది ఆయ‌న మంచి త‌నమే. 
●ఊడ‌త ఊపుల‌కు బ‌య‌ప‌డేవారు ఎవ‌రూ లేరు..
ఫ్లూట్ జింక ముందు ఊదు..సింహం ముందు కాదు .
●ఇక్క‌డ పులి వెందుల పులులు ఉన్నాయి. న‌క్క‌లు, కుక్క‌లు, తోడేళ్లు ఏమీ పీక‌లేవు. నీవు సింహానివి కావు. గ్రామ సింహానివి.. సింహానికి, గ్రామ సింహానికి చాలా తేడా ఉందిరా మాలోకం.
 రాయ‌ల‌సీమ‌లో 52 అసెంబ్లీద స్థానాలు ఉంటే టీడీపీ గెలిచింది కేవ‌లం 3 సీట్లు . నీ అబ్బ సొంత జిల్లా చిత్తూరులో ఒక్క‌టే ఒక్క సీటు. అదిరా నీ అబ్బ న‌క్క‌జిత్తుల నారా చ‌రిత్ర....
కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత పత్తికొండ నారాయణ రెడ్డి నీ టిడిపి వారు చంపినప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కోరలేదు లోకేష్.

తనకు ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా లోకేష్ అని శైలజా చరణ్ రెడ్డి మండిపడ్డారు

రెండేళ్ల‌లో సామాన్య భ‌క్తుల కోసం అనేక కార్య‌క్ర‌మాలు... కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు పెద్ద ఎత్తున హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారం ; టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి



   శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో రెండేళ్లుగా అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశంతో సామాన్య భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంతోపాటు, కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు పెద్ద ఎత్తున హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌న్నారు. రెండేళ్లుగా స్వామిసేవ, భ‌క్తుల సేవ చేసుకోవ‌డానికి అదృష్టం క‌ల్పించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ట్టు చెప్పారు. టిటిడి వ‌ద్ద నిల్వ ఉన్న ర‌ద్ద‌యిన నోట్ల మార్పిడి అంశం భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉంద‌ని,  ఈ నోట్ల మార్పిడికి అనుమ‌తించాల‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌ను తాను నాలుగుసార్లు వ్య‌క్తిగ‌తంగా క‌లిసి విజ్ఞ‌ప్తి చేశానన్నారు. రిజ‌ర్వు బ్యాంకును కూడా అనేక సార్లు సంప్ర‌దించామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శ‌నివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌తోపాటు రెండేళ్ల‌లో త‌మ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాలు, అమ‌లుచేసిన కార్య‌క్ర‌మాల‌ను శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ప‌లువురు బోర్డు స‌భ్యులు, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డితో క‌లిసి మీడియాకు వివ‌రించారు. ముఖ్యాంశాలివి.
- ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు సామాన్య భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డానికి ఎల్‌1, ఎల్‌2 ద‌ర్శ‌నాలు ర‌ద్దు.

- తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డంలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధం. ఏడాదిగా సంపూర్ణంగా అమ‌లు.

- ప్ర‌పంచ ప్ర‌జ‌లను కోవిడ్ బారి నుంచి కాపాడాల‌ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ప్రార్థిస్తూ గ‌త 15 నెల‌లుగా అనేక ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. వీటిలో కొన్ని నేటికీ కొన‌సాగుతున్నాయి. శ్రీ‌వారి ఆశీస్సులతో త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లంతా క‌రోనా మీద విజ‌యం సాధిస్తారు.

- రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో నిర్మించ‌ద‌ల‌చిన 500 ఆల‌యాలను క‌రోనా కార‌ణంగా నిర్మించ‌లేక‌పోయాం. రాబోయే ఏడాదిలో ఈ ఆల‌యాల నిర్మాణం పూర్తి చేసేలా తీర్మానం.

- హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జ‌మ్మూలో ఇటీవ‌ల భూమిపూజ చేసిన శ్రీ‌వారి ఆల‌య నిర్మాణాన్ని 18 నెల‌ల్లో పూర్తి చేసి ఉత్త‌ర భార‌త‌దేశంలో గొప్ప ఆల‌యంగా త‌యారుచేసేందుకు నిర్ణ‌యం.

- వార‌ణాశి, ముంబ‌యిలో ఏడాదిలో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి చ‌ర్య‌లు.

- గుడికో గోమాత కార్య‌క్ర‌మంలో భాగంగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ రాష్ట్రాల్లో 100 ఆల‌యాల‌కు గోమాత‌ల‌ను అందించాం. మ‌రో 40 ఆల‌యాల‌కు కూడా అందిస్తాం. దీనివ‌ల్ల ప్ర‌జ‌లు గోసేవ చేసుకునే అవ‌కాశం క‌ల్పించిన‌ట్ట‌వుతుంది.

- తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యం వాకిలి, వాకిలిచ‌ట్రం, గ‌ర్భ‌గృహ ప్ర‌వేశద్వారాల‌కు వెండి తొడుగులు అమ‌ర్చేందుకు నిర్ణ‌యం.

- గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్య‌క్ర‌మం కింద గ‌త 45 రోజులుగా స‌హ‌జ ఆధారిత పంట‌ల‌తో స్వామివారికి త‌యారు చేస్తున్న నైవేద్యాల కార్య‌క్ర‌మాన్ని శాశ్వ‌తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులో ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా రైతుల‌ను సంసిద్ధం చేసి వారి పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాం.

- మూడు నెల‌ల్లోపు ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్ల ప్ర‌సారాలు ప్రారంభించాల‌ని నిర్ణ‌యం.

- దేశ‌వ్యాప్తంగా అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో దేవాల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా నిధులు అందిస్తాం.

- తిరుప‌తి, తిరుచానూరులో నివ‌సిస్తున్న అర్హ‌త గ‌ల హెచ్‌డిపిపి పెన్ష‌న‌ర్ల‌కు(ప‌ర్య‌వేక్ష‌క మ‌రియు నాన్‌-ప‌ర్య‌వేక్ష‌క‌) ఇత‌ర తితిదే పెన్ష‌న‌ర్ల త‌ర‌హాలోనే పుణ్య‌క్షేత్ర భార‌బృతి భ‌త్యం రూ.500/- నుండి రూ.700/-కు పెంచేందుకు ఆమోదం.

- టిటిడిలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేయ‌డానికి ఇప్పటికే కమిటీని నియమించాము. ఈ క‌మిటీ విధి విధానాలతో  మూడు నెలల్లో కమిటీ నివేదిక అందజేస్తుంది.  ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా దీన్ని అమ‌లుచేస్తాం.

-  తిరుమ‌లలో ఉన్న అన‌ధికారిక దుకాణాలు, త‌ట్ట‌లను వారం రోజుల్లో తొల‌గిస్తాం. దుకాణ‌దారులు టిటిడి అనుమ‌తించిన వ్యాపారాలు మాత్ర‌మే చేసేలా చ‌ర్య‌లు.

- త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా స్విమ్స్‌, బ‌ర్డ్ ఆస్ప‌త్రుల అభివృద్ధి ప‌నుల‌తో పాటు చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి శంకుస్థాప‌న‌, తిరుమ‌ల‌లో కొత్త‌గా నిర్మించిన బూందీ పోటు ప్రారంభోత్స‌వం.

- రాష్ట్రంలో కొత్త‌గా 13 క‌ల్యాణ‌మండ‌పాల నిర్మాణానికి ఆమోదం.

- తిరుమ‌ల‌లోని  హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం. ఈ అంశంపై ఇక మీద‌ట ఎలాంటి వివాదాల‌కు తావు ఇవ్వ‌రాదు.

- తిరుప‌తిలో ట్రాఫిక్ స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారం కోసం శాస‌న‌స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి విజ్ఞ‌ప్తి మేర‌కు ప్ర‌స్తుతం ఆగిన చోట నుండి అలిపిరి వ‌ర‌కు గ‌రుడ వార‌ధి నిర్మాణానికి ఆమోదం. టిటిడి నిధుల‌తో ఈ వార‌ధి నిర్మాణానికి త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలవాల‌ని నిర్ణ‌యం.

- కోవిడ్ ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచాల‌ని నిర్ణ‌యం.

- తిరుమ‌లను గ్రీన్‌హిల్స్‌గా ప్ర‌క‌టించినందున‌ ఉచిత బ‌స్సుల స్థానంలో  త్వ‌ర‌లో విద్యుత్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం. ఆర్టిసి కూడా ఇందుకోసం 100 విద్యుత్ బ‌స్సులు కొనుగోలుకు ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుమ‌తించారు. తిరుప‌తి - తిరుమ‌ల మ‌ధ్య న‌డిచే ప్ర‌యివేటు ట్యాక్సీల య‌జ‌మానులు టిటిడిని సంప్ర‌దిస్తే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి విద్యుత్ వాహ‌నాలు కొనుగోలు చేయించాల‌ని నిర్ణ‌యం.
           
----------------------------------------------------------------

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Wednesday, 16 June 2021

ఆయోధ్య రామునికి కంచర్ల గోపన్న వంశస్తులచే పాదుకా పీఠం..

.

కంచర్ల గోపన్న  పేరే రామదాసుగా మార్పు జరిగిన రామ భక్తి తత్పరుడు..భద్రాచలం రామలయం అంటేమనకు గుర్తుకు వచ్ఛేది రామదాసే . అటువంటి రామదాసు వంశంలో పుట్టి రాముడన్న..హనుమంతుడన్న అచంచల భక్తి .ప్రపత్తులు కలిగిన *కంచర్ల వెంకట రమణ గారు..చల్ల పవన్ కుమార్ ట్రస్ట్ బాధ్యులు, చల్ల శ్రీనివాస్ సహకారంతో  *అయోధ్య రామునికి .. రెండు తులాలు బంగారంతో శంఖ చక్రాలు రాళ్లతో కూడిన వజ్రాలతో పొదబడిన..8 కేజీల వెండితో తయారైన పాదపీఠాన్ని కంచర్ల వెంకట రమణ గారు మరియు చల్ల పవన్ కుమార్ పౌండేషన్ సహకారంతో  అయోధ్య రాముని కి  కానుకగా  పంపించారు. తయారికి దాదాపు 12 లక్షల రూపాయలు వ్యయం అయినట్లు   కంచర్ల వెంకట రమణ పేర్కొన్నారు.. రామునికి పాదపీఠం సమర్పచడం రాముడే మరో మారు రామదాసు వంశస్తుల ద్వారా తనకు పాద పీఠం తయారు చేయించుకున్నారని.

.ఇది తమకు అత్యంత ఆనందకరమైన విషయం అని కంచర్ల రమణ పేర్కొన్నారు.. కాగా.. ప్రతి యేట నేలకొండపల్లిలో జరిగే.. భక్తరామదాసు ఉత్సవాలలో క్రమం తప్పకుండా రమణాగారు పాల్గొంటారు.. మరోవైపు.. రాముని కి గత కొన్ని సంవత్సరాలుగా  రాముని కళ్యాణ వేళ తలంబ్రాలకు పలువురు సహకారంతో చేతితో వలచిన వడ్లను సమర్పణ చేస్తూ రామ సేవలో తరిస్తున్నారు...ప్రస్తుత కరోనా సంకట సమయంలో..అందరికీ ఆరోగ్యం ..ఆయురారోగ్యాలతో వుండాలని..కోరుకుంటున్నట్లు రమణాగారు పేర్కొన్నారు... ఇహ మమూ బ్రోవమని ఛెప్పవే సీతమ్మ తల్లి అందామ మరీ..@ మణికుమార్

ఫ్లైఓవర్‌ కింద ఆక్సిజన్‌ పార్కు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో్...


దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో సరికొత్త ఆలోచనకు
ఎల్బీనగర్‌లో కామినేని దవాఖాన ముందున్న ఫ్లైఓవర్‌ వేదిక అయింది. ఆక్సిజన్‌ అధికంగా అందించే 38 రకాల మొక్కలతో 34,329 మొక్కల మధ్య 734 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌. ఆక్సిజన్‌ అధికంగా అందించే వేల మొక్కలతో ఈ ఫ్లైఓవర్‌ కింద ఆక్సిజన్‌ పార్కును సిద్ధం చేస్తున్నారు.
వీటిమధ్య వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై నడవటం ద్వారా ఫిట్‌నెస్‌తోపాటు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలవుతుంది.


Tuesday, 15 June 2021

యాదాద్రిసుని దర్శించిన సుఫ్రిం చీఫ్ జస్టీస్ ఎన్.వీ.రమణ..


యాదాద్రి, జూన్ 15: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు  యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు  ఘన స్వాగతం పలికారు.
అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు సుప్రీం దంపతులకు వేద ఆశీర్వచనం..చేశారు.

Monday, 14 June 2021

ఘంటామఠం తవ్వాకాల్లో మరికొన్ని ప్రాచీన శాసనాలు


శ్రీశైలం ఘంటామఠం పునరుద్ధరణ పనులు జరిగుతుండగా మరో సారి బయటపడిన ప్రాచీన కాలంనాటి తామ్ర శాసనాలు
పునరుద్ధరణ పనులలో 18 రాగి శాసనాలు లభ్యం రాగి రేకులపై కన్నడ,మరాఠీ, దేవనాగరి లిపి
తామ్ర శాసనాలను అధికారులు,స్థానిక రెవెన్యూ,పోలీసు అధికారులతో కలసి శ్రీశైలం దేవస్థానం ఇ.ఒ. కె.ఎస్, రామారావు పరిశీలించారు.

Sunday, 13 June 2021

జమ్మూలో కొలువు తీరనున్న తిరుమల వాసుడు.. .ఆలయ నిర్మాణానికి సన్నాహక పూజ...

తిరమలవాసుని ఆలయానికి జమ్ములో భూమి పూజ నిర్వహించారు...జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంమంత్రి జి.కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ..టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర బోర్డు సభ్యులు టిటిడి వేద పండితుల ఆధ్యర్యంలో భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా మాట్లాడుతూ జమ్మూ డివిజన్‌లోని మత పర్యాటక రంగం ఆలయ నిర్మాణంతో మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
వేద పాఠశాల, ఆసుపత్రితో పాటు ఆలయాన్ని టిటిడి నిర్మిస్తుందని చెప్పారు. మాతా వైష్ణో దేవి మందిరం, అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రాలతో పాటు యాత్రికులకు, పర్యాటకులకు టిటిడి నిర్మాణం లో బాలాజీ ఆలయం కూడా ఉత్తరాధిలో ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు..సుదూర ప్రాంతం జమ్మూ నుండి తిరుమల వెళ్లలేని వారికి వెంకటేశ్వరుని ఆశీస్సులు లభించాయని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతిపాదిత ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం శ్రీ ఆండాల్ మరియు శ్రీ పద్మావతి ఉప దేవాలయాలు నిర్మాణం జరుగనున్నాయి.. దక్షిణ భారతీయ టెంపులర్ ఆర్కిటెక్చర్‌ను చిత్రీకరించడానికి గర్భాలయంలు మరియు అర్ధ మండపం దక్షిణ భారత గ్రానైట్ రాయితో నిర్మించేందుకు  ప్రతిపాదించబడ్డాయి.

సిమెంట్ సుడై అలంకార లక్షణాలతో కూడిన ఆర్‌సిసి ఫ్రేమ్‌వర్క్‌తో ముఖమండపం ప్రతిపాదించబడింది. ఈ ఆలయంలో యాత్రికుల సౌకర్యాలు కాంప్లెక్స్, వేదపాఠశాల, ఆధ్యాత్మిక / ధ్యాన కేంద్రం, కార్యాలయం, నివాస గృహాలు మరియు పార్కింగ్ కూడా ఉంటుంది. ఆలయ నిర్మణానికి మొత్తం 62.06 ఎకరాల భూమిని సమకూర్చారు..  నిర్మాణానికి  మొత్తం వ్యయం 33.22 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ ఆలయం 18 నెలల వ్యవధిలో నిర్మించబడుతుంది.

Friday, 11 June 2021

చెవిరెడ్డికి చీఫ్ జస్టీస్ ఆత్మీయ పలకరింపు


*చంద్రగిరి: ఏం.. భాస్కర్ బాగున్నావా... బాగా పనిచేస్తున్నావ్.. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయం. నువ్వు తయారు చేసిన ఔషదం నాకు కూడా అందిందయ్యా.. నువ్వు ఇలాగే ప్రజాక్షేమం  కోసం మంచి కార్యక్రమాలు తలపెట్టాలి అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ.రమణ, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించి అభినందించారు. శుక్రవారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ క్రమంలో చీఫ్  జస్టీస్ ఆయన్ను పై విధంగా ఆత్మీయంగా పలకరించారు. మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్ ధ్యాన మందిరంను సందర్శిస్తానని చెవిరెడ్డికి  తెలిపారు. ఈ మేరకు మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని పొందుపరచాలని జిల్లా జడ్జిని ఆయన ఆదేశించారు.

Wednesday, 9 June 2021

నిత్య సేవకులకు నీరాజనం అప్పన్న బోయిలకు నూతన వస్త్రాలు.... నగదు ఆలయంలో అందజేసిన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు


సింహాచలం , జూన్ 9 : అప్పన్న దేవస్థానంలో బోయిల పాత్ర అత్యంత కీలకం ., సిరులొలికించే సింహాద్రినాధుడిని నిరంతరం తమ భుజస్కందాలపై మోసే అదృష్టం దక్కించుకున్న బోయిలు నిరంతర సేవకులే ,,. కొండ దిగువున పాత అడవివరం , విజినీగిరిపాలెంకు చెందిన 20 మంది బోయిలు నిరంతరం సింహాద్రినాధుడి సేవలో తరిస్తారు ., అయితే వీరు శాశ్వత ఉద్యోగులు కాదు , అలాగని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంత కంటే కాదు . కాని ఆలయంలో విశేష ఉత్సవాలు జరిగినప్పుడు , కొండ దిగువుకు స్వామిని తీసుకువచ్చే సమయంలో వీరే కీలకం . మకరవేట ( గజేంద్రమోక్షం ) , తెప్పోత్సవం , జమ్మివేట , బొట్టినడిగే పున్నమితో పాటు అనేక సందర్భాల్లో స్వామిని , అమ్మవార్లను మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు వీరే తీసుకువస్తారు . ఇక గ్రామ తిరువీధిలోని వీరి సేవలు ప్రశంసనీయం . అయితే ఉత్సవాలను బట్టి మాత్రమే వీరు ఆలయ వర్గాలు పిలుపు మేరకు హాజరుకావడం జరుగుతుంది , స్వామి, అమ్మవార్ల సేవలో వీరి సేవలు అత్యంత ప్రశంసనీయం. ఈ నేపధ్యంలోనే వీరి సేవలను గుర్తించాలని భావించి తన వంతు గా  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టు ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు బుధవారం అప్పన్న ఆలయంలో వీరికి పంచ , కండువా , షర్టుతో కూడిన నూతన వస్త్రాలను , కొంత నగదును అందజేసి సత్కరించారు... ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అప్పన్న ఉత్సవాల్లో బోయిలు సేవలు అత్యంత ప్రశంసనీయమని ,. స్వామివారి సేవలో పాల్గొనడం వీరి అదృష్టమని అభివర్ణించారు . కేవలం వేతనం కోసం కాకుండా , స్వామి వారికి సేవలందించాలని భావించే వారు తరచూ హాజరుకావడం జరుగుతుందని ఇది అభినందనీయమన్నారు . సింహాచలం
 గ్రామస్తుడుగా వారి సేవలు తాను గుర్తించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు..భవిష్యత్తులో వారికి దేవస్థానం తాత్కాలిక గుర్తింపు కార్డులు ఇచ్చి , సముచిత స్థానం కల్పించాలని ట్రస్టుబోర్డు సమావేశంలో కోరనున్నట్లు శ్రీనుబాబు చెప్పారు . అనంతరం సింహాద్రి నాధుడు నిత్య కళ్యాణం లో పాల్గొని స్వామి. అమ్మవార్ల ను సేవించి తరించారు...

విలేకరుల ముసుగు..పోలీసుల మంటూ డబ్బులు వసూళ్లు..


*దర్శి:  విలేకర్లు, పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డిఎస్‌పి కె.ప్రకాశరావు తెలిపారు.
స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
ఈనెల 5న తిరువాయపతి వెంకటేశ్వర్లు కొనకనమిట్ల మండలం నాయుడుపేట నుండి ఆటోలో బియ్యాన్ని కొనుగోలు చేసుకుని గొట్లగట్టు నుండి మునగపాడు గ్రామానికి వెళ్తున్నాడు.

మార్గమధ్యంలో సిద్ధవరంకు చెందిన నలుగురు వ్యక్తులు తాము విలేకర్లు, పోలీసులమని చెప్పి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వెంకటేశ్వర్లు భయపడి రూ.20 వేలు ఇచ్చి వెళ్లిపోయాడు.
తరువాత విచారించగా సిద్ధవరం గ్రామానికి చెందిన ప్రైమ్‌-9 పత్రిక విలేకరి పొనుగోటి శ్రీనివాసాచారి, అబ్దుల్‌ఖాదర్‌, మహమ్మద్‌ రఫీ, వంగపాటి ఏడుకొండలు ఈ డబ్బులు వసూలు చేసినట్లు తిరువాయపతి వెంకటేశ్వర్లు కొనకనమిట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ సిహెచ్‌ వెంకటేశ్వర్లు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఎస్‌ఐ ఎం. వెంకటేశ్వర్లునాయక్‌ నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.17 వేలు రికవరీ చేశారు. వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు.

ఈకేసును చేధించిన పోలీసులను డిఎస్‌పి కె. ప్రకాశరావు అభినందించారు.

కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకరరావు పాల్గొన్నారు.

Wednesday, 2 June 2021

నిహారిక రెడ్డి ట్వీట్ కు స్పందించిన కేటీఆర్... బాలుని వైధ్యసాయానికి హామీ...

ఓ ట్వీట్తతో  ఆ చిన్నారికి బతుకు భరోసా దోరికింది..
ఓ ప్రయత్నం ఓ చిన్నారి తల్లిదండ్రుల నిరాశ, నిస్పృహ ల నుండి బయటపడెందుకు దారి చూపింది..
నిహారిక రెడ్డి ఎంట్రప్రన్యూర్..నటి..సామాజిక కార్యకర్త..అన్నింటికీ మించి బాధల్లో వున్న వారి విషయంలో వేగంగే స్పందించే మహిళ..
ఇహ మ్యాటర్లోకి వద్దాం.
 15 రోజుల క్రితం  యూసఫ్ గూడాలోని నిహారిక రెడ్డి హెల్ప్ లైన్ కి ఫుడ్ కావాలంటూ ఓ కాల్.. తాము రెయిన్బో హాస్పిటల్ లో వున్నామని కరోనా లాక్డౌన్ తో తిండికి ఇబ్బందులు పడుతున్నామంటు వేేడుకోలు..  నిహారిరెడ్డి  అప్పటి వరకు కేవలం కరోనా పేషెంట్స్ కాకపోతే డెలివరీ కి  పోసిబిలిటీ లేదు కానీ హాస్పిటల్ అన్నారు కదా ఇంటిదగ్గరికి వచ్చి తీసుకువెళ్ళమని నిహారిక రెడ్డి సమాదానం. రెండు రోజులు ఫుడ్ తీసుకు వెళ్లారు మూడో రోజు  మధ్యాహ్నం  రాలేదు రాత్రి భోజన సమయానికి వచ్ఛారు భార్యా భర్తలు.. నైట్ డిన్నర్ కి వచ్చినప్పడు ఇలా చేస్తే ఎలా అండి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా అని నిహారిక రెడ్డి అనడంతో.. తమ బాబు కి ఆపరేషన్ ఈ రోజు అందుకే రాలేదని , రావటానికి వెహికిల్స ఏమి లేవు నడిచి వస్తున్నాం అని చెప్పారు. ఫుడ్ కోసం బంజారా హిల్స్ రెయిన్బో హాస్పిటల్ నుంచి యూసూఫ్గూడ వరకు నడిచి వస్తున్నారు అన్న వారి మాటలకు నిహారిక రెడ్డి  మనసు చివుక్కుమంది.. ఇహపై మీరు కష్టపడుతూ రాకండీ  తమ్ముడితో  ఫుడ్ హాస్పిటల్ కి  పంపిస్తాను అని చెప్పడంతో వారు దండం పెట్టి వెళ్లారు.. .మరుసటి రోజు  వెళ్ళినపుడు అసలు ప్రాబ్లెమ్ ఏంటి అని ఎంక్వయిరీ చేస్తే  తమ  6 సంవత్సరాల బాబు కి కిడ్నీ  ప్రాబ్లమ్  అని అప్పటికే ఉన్నదంతా బాబు కోసము ఖర్చుపెట్టేశాం..ఇహ ఏమీ చేయడం పలుపోవడం లేదు ,ఇంకా మా దగ్గర మనీ లేవు వెళ్ళిపోతున్నాం ట్రీట్మెంట్ ఆపేసి అని చెప్పరు..
 మీరు ఏమైనా హెల్ప్ చేయండి మీ అక్క కి చెప్పండంటూ బాబు తల్లిదండ్రులు దీనంగా అడిగారు..అది చాలా ఖర్చు తో కూడిన పనికావడంతో తాను చేయలేనని  భావించిన నిహారిక రెడ్డి . Kalvakuntla Taraka Rama Rao - KTR గారికి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.దీంతో  KTR  వెంటనే స్పందించారని , KTR సర్ ఆఫీస్ నుంచి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి సపోర్ట్ చేస్తాము అని చెప్పినట్లు నిహారిక రెడ్డి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా తన ట్వీట్కు స్పందించిన కేటీఆర్ కు  థాంక్ యు KTR సర్ తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు,మీరు తెలంగాణ ఫార్మషన్ డే రోజు ఒక బాబు ప్రాణాలు కాపాడడానికి హామీ ఇచ్చారు. నిజం గా ఇంత స్పీడ్ గా రెస్పాండ్ అవ్వడం , సపోర్ట్  చేయడము గ్రేట్ సర్ అంటూ నిహారిక కృతజ్ఞతలు తెలిపారు...కాగా నిహారిక రెడ్డి గత కొన్నిరోజులుగా కరోనా పెషెంట్లతోపాటు.కుషాయిగూడలోని కరోనా విధుల్లో ఉన్న పోలీసు వారికి చక్కటి భోజనం ప్రతిరోజూ అందజేస్తున్నారు.. మరోవైపు.. కరోనా కారణంగా ఉపాది లేక ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 350  నేతన్నలకుటుంబాలకు పలువురి సహకారంతో నెెల సరుకులను ఆమే స్వయంగా అందజేశారు...

ఆకాశగంగ వద్ద జూన్ 4 నుంచి 8 దాకా వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు.... వచ్చే ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తాం... ఆంజనేయుని జన్మస్థలం విషయంలో వివాదమే లేదు : అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి వెల్లడి.


తిరుమల, 2 జూన్ 2021:  తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో  ఆకాశగంగ వద్ద  ఈ నెల 4 వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
 తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
 టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా చేస్తామన్నారు. 
ఈ సారి ఆకాశగంగలో 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
   ప్రతిరోజూ ఉదయం 8 - 30 నుంచి 10 గంటల వరకు అంజనాదేవి, బాల హనుమంతల వారికి అభిషేకం, రోజుకొక పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.
 ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా ఉంటుందన్నారు. 
 4వతేదీ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ రాణి సదాశివమూర్తి చే హనుమంతుడు, అష్టసిద్ధులు అనే అంశంపై నేటి పరిస్థితులకు అనుగుణమైన విధంగా సవివర వ్యాఖ్యానం ఉంటుందని చెప్పారు.
  5వతేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ చే నేటి యువతకు ఆదర్శం హనుమ అనే అంశంపై వ్యాఖ్యానం ఉంటుందని చెప్పారు.
   6వతేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ నందన్ భట్ చే హనుమంతుని వ్యక్తిత్వం పై వ్యాఖ్యానం జరుగుతుందని ఆయన తెలిపారు.
7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డాక్టర్ మారుతి చే హనుమంతుని  వాక్ వైభవం అంశంపై వ్యాఖ్యానం జరుగుతుందన్నారు.
  8 వతేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ రాగి వెంకటాచారి వారిచే హనుమంతుని కార్యదక్షత అనే అంశం మీద వ్యాఖ్యానం నిర్వహిస్తామన్నారు.
    ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు ఈవో వివరించారు.
      తిరుమలకు వచ్చే యాత్రికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతిస్తామన్నారు.
     వచ్చే ఏడాది మరింత వైభవంగా ఆకాశగంగ వద్ద హనుజ్జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 
ఆంజనేయ స్వామి రాక్షసుల బారి నుంచి ప్రజలను విముక్తులను చేశారని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను విముక్తులను చేయడానికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
    12 పురాణాలు, దైవ సాక్షాత్కారం పొందిన మహా పురుషులు ఆంజనేయ స్వామి వారు ఆకాశగంగ వద్ద జన్మించారని స్పష్ఠంగా చెప్పారన్నారు.ఇందులో ఎలాంటి వివాదం లేదని శ్రీ ధర్మారెడ్డి వివరించారు
. అయోధ్య శ్రీ రాములవారి జన్మ భూమి అని నిర్ధారణ అయిన తరువాత తిరుమల ఆకాశగంగ వద్ద ఆంజనేయుని జన్మస్థలంగా నిర్ధారణ కావడం దైవ సంకల్పమని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. 
 ఆకాశగంగ వద్ద ఉన్న అంజనాదేవి, బాలహనుమంతుల దర్శనం కోసం భక్తులు సులువుగా వచ్చి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అంతకు ముందు ఆయన ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించారు.