*తిరుపతి,2021జూన్ 30
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు
శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో
శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లిశ్వరి, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------
No comments:
Post a Comment