Sunday, 13 June 2021

జమ్మూలో కొలువు తీరనున్న తిరుమల వాసుడు.. .ఆలయ నిర్మాణానికి సన్నాహక పూజ...

తిరమలవాసుని ఆలయానికి జమ్ములో భూమి పూజ నిర్వహించారు...జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంమంత్రి జి.కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ..టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర బోర్డు సభ్యులు టిటిడి వేద పండితుల ఆధ్యర్యంలో భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా మాట్లాడుతూ జమ్మూ డివిజన్‌లోని మత పర్యాటక రంగం ఆలయ నిర్మాణంతో మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
వేద పాఠశాల, ఆసుపత్రితో పాటు ఆలయాన్ని టిటిడి నిర్మిస్తుందని చెప్పారు. మాతా వైష్ణో దేవి మందిరం, అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రాలతో పాటు యాత్రికులకు, పర్యాటకులకు టిటిడి నిర్మాణం లో బాలాజీ ఆలయం కూడా ఉత్తరాధిలో ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు..సుదూర ప్రాంతం జమ్మూ నుండి తిరుమల వెళ్లలేని వారికి వెంకటేశ్వరుని ఆశీస్సులు లభించాయని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతిపాదిత ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం శ్రీ ఆండాల్ మరియు శ్రీ పద్మావతి ఉప దేవాలయాలు నిర్మాణం జరుగనున్నాయి.. దక్షిణ భారతీయ టెంపులర్ ఆర్కిటెక్చర్‌ను చిత్రీకరించడానికి గర్భాలయంలు మరియు అర్ధ మండపం దక్షిణ భారత గ్రానైట్ రాయితో నిర్మించేందుకు  ప్రతిపాదించబడ్డాయి.

సిమెంట్ సుడై అలంకార లక్షణాలతో కూడిన ఆర్‌సిసి ఫ్రేమ్‌వర్క్‌తో ముఖమండపం ప్రతిపాదించబడింది. ఈ ఆలయంలో యాత్రికుల సౌకర్యాలు కాంప్లెక్స్, వేదపాఠశాల, ఆధ్యాత్మిక / ధ్యాన కేంద్రం, కార్యాలయం, నివాస గృహాలు మరియు పార్కింగ్ కూడా ఉంటుంది. ఆలయ నిర్మణానికి మొత్తం 62.06 ఎకరాల భూమిని సమకూర్చారు..  నిర్మాణానికి  మొత్తం వ్యయం 33.22 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ ఆలయం 18 నెలల వ్యవధిలో నిర్మించబడుతుంది.

No comments:

Post a Comment