జగత్యాల ఎస్పీ సింధుశర్మ అవినీతి సిబ్బందిపై గురి పెట్టారు. వరుస దాడులతో జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ క్షేత్ర స్థాయి సిబ్బందిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం ఆరంభించారు. ఇటీవల కాలంలో జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ, కథలాపూర్ ఎస్ఐ పృథ్వీథర్ గౌడ్, కానిస్టేబుల్ రమేష్‌లు లంచం తీసుకుంటూ పోలీసులు ఏసీబీకి చిక్కారు. దీంతో, అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గురించి ఆరా తీయించిన ఎస్పీ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, బుధవారం ముగ్గురు ఎస్‌ఐలను అటాచ్డ్ చేశారు. అయితే, జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ వరుస దాడులు అధికారులను అలర్ట్ చేశాయి. దీంతో, ఎస్పీ సింధూ శర్మ అవినీతికి పాల్పడుతున్న పోలీసుల డాటా సేకరించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.ఆమె లక్ష్యం నేరువేరుతుందా లేక ఆమె ముక్కుసూటి తనానికి బదిలీ బహుమతి దొరుకుతుందో వేచి చూడాలి..
No comments:
Post a Comment