ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా..? సీఎం వైఎస్ జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ పై స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ రెడ్డి సీపీఐ రామకృష్ణగారు నిజమైన కమ్యూనిస్టులా ఆలోచించండి అని హితవు పలికారు
విద్యార్ధులు, నిరుద్యోగుల పట్ల మీకున్న చిత్తశుద్దికి ధన్యవాదాలు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు..
విద్యార్ధులు, నిరుద్యోగులపై మీకెందుకు ప్రేమ లేదని ప్రశ్నించారు
వారి భవిష్యత్తు గురించి మీరెందుకు ఆందోళన చెందలేదు..?
2014 -19 మధ్య 9 నోటిఫికేషన్లే ఇచ్చి..
216 పోస్టులే ఉన్నాయని చెబితే..
చంద్రబాబును నిలదీయాలని మీకెందుకు అనిపించలేదు..?
రామకృష్ణ గారు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ వాళ్లని ..
రోడ్డు మీదకు తీసుకొచ్చి నినాదాలు చేయించడం కాదు సార్..!!
సీఎం జగన్ గారు ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నారో చూడండి.
వచ్చిన రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు..
జాబ్ క్యాలండర్ ద్వారా 10, 143 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దమయ్యారు..?
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు..
జాబ్ క్యాలండర్ అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారు..?
ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరుగుతుందో...నిజమైన కమ్యూనిస్టులా ఆలోచించండి అని శైలజా చరణ్ రెడ్డి సూచించారు
No comments:
Post a Comment