Monday, 31 October 2022

మునుగోడే లక్ష్యం

👉మునుగోడులో తెరాస ముప్పేట దాడి
👉 ప్రత్యర్థులపై కెసిఆర్ తెలంగాణ రణతంత్రం.
👉  ఓటర్ మైండ్ ను మలుపు తిప్పిన ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ 
👉ఆ నలుగురు పై కెసిఆర్ ప్రశాంసల వర్షం...
 👉100కోట్ల కధ హైలైట్ చేస్తూ ఇంటింటికి  ప్రచారం చేసిన కారు దళం.. నాయకులు..
 👉బజాపా అభ్యర్థి కంపెనీ  బ్యాంకు లావాదేవీలను వదలకుండా  మంత్రాంగం తెరాస యాంత్రాంగంతో మునుగోడే లక్ష్యం గా పావులు కదిపిన గులాబీ బాసు..
ముగిసిన ప్రచారం...
@ మణికుమార్..

Monday, 24 October 2022

Rishi Succeeded to Become "UK"PM

Rishi Rishi finally indian Made 
Rushi Sunak Succeeded to become the Prime minister of UK after long battle between ex PM Boris johnson and Rushi Supporters. It may have taken him two attempts, but Rishi Sunak has succeeded in becoming prime minister.. The British ruined India's wealth in two hundred years of colonialism.. and now, they rely on an Indian mind to rescue their own ruining economy
Over 30 brave activists have occupied Westminster! 
They’ve brought energy bills from around the country and are holding a banner reading: “Chaos costs lives”.
Rishi Sunak will start his new job with almost one-quarter of the country suffering from fuel poverty and with winter just weeks away.
Tell Rishi to take action now:
We need a government capable of confronting crises, not creating them. People need PERMANENTLY lower bills.said Rushi Sunak..

 


Friday, 21 October 2022

పోలీసు అమరులకు "మంత్రి పువ్వాడ" నివాళులు


ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణలో అహార్నిసలు శ్రమిస్తూ అమరులైన పోలీస్ సిబ్బందికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోహార్లు పలికారు.
శుక్రవారం పోలీస్ అమరవీరుల దినోత్సవంగా సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు గల అమరవీరుల స్థూపం(Smriti Parade) వద్ద పోలీస్ అమరులకు ఘన నివాళులు అర్పించారు.
పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించి కొందరు పోలీస్ అమరవీరులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్న పోలీస్ లే అని అన్నారు.
పోలీస్ వృత్తి అనేక వత్తిడిలతో కూడుకున్నదని, పోలీస్ లు తమ వృత్తి ధర్మం కోసం, కుటుంబాల ను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారని కొనియాడారు.
పోలీస్ లు కొందరు కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, అలాంటి వారి త్యాగాలు గొప్పవని, వారి కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి అని అన్నారు.
నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని, విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు నివాళులు అర్పించడం కనీస బాధ్యత అని అన్నారు.
శాంతి భద్రతల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి చనిపోయిన అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణ కోసం నిబద్ధతతో, ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. 
అమరులైన పోలీసుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరచిపోలేమని.. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
అనంతరం పోలీస్ అమరుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామి ఇచ్చారు. 
కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ గారు, zp చైర్మన్ లింగాల కమాల్ రాజ్ గారు, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ గారు, అదనపు DCP శబరిష్ గారు, బోస్ గారు, ACP లు, CI లు సిబ్బంది ఉన్నారు.

రూ.1.35కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు...


ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.1.60 కోట్లతో నిర్మించనున్న CC సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.
ఖమ్మం నగరంలోని 24వ డివిజన్ కాషయ్య కాలనీ లో రూ.25 లక్షలు, 40వ డివిజన్ జమ్మిబండ రోడ్ నందు రూ.45 లక్షలు, 42వ డివిజన్ నిజాంపేట లో రూ.45 లక్షలు, 43వ డివిజన్ నెహ్రూ నగర్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.1.60 కోట్లతో నిర్మించనున్న CC SIDE DRAINS నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, దాదే అమృతమ్మా సతీష్, పాకాలపాటి విజయ శేషగిరి రావు, BG క్లెమెంట్, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, DE లు స్వరూప రాణి, నవ్య జ్యోతి, రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.

ఎన్నాళ్లీ జీవితాలు..ఏ సొదొ..సుడొ..పడి చెద్దామన్నా...

ఆంధ్రప్రదేశ్/అనంతగిరి మండలం : 
కోటలు దాటే బడ్జేట్ - గిరిజనాల వెతలు తీర్చడం...పట్టణాలకు..6 అంచెలా కారిడార్ లు వచ్ఛాయి..వస్తున్నాయి.. కాని ..గిరిపుత్రులు మాత్రం బురద రోడ్ల వెంట ప్రయాస తప్పడంలేదు.. అత్యవసర సమయాల్లో ఈ వీరి వెతలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో గిరిజనం ఎన్నాళ్లీ జీవితాలు అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు..ఆదివాసీ గిరిజన మహిళ అనారోగ్య కారణం  6 కిలోమీటర్ దూరం డోలు మోతలు  ప్రయాణంతో 
 అనంతగిరి మండలం పెద్ద కోట పంచాయతీ మడ్ద్రీబు (ptg) కొండ తబేలి సులేమాన్ (65) ఆవేశం. గుండెల్లో నొప్పి రావడంతో. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు  మడ్ద్రబు గ్రామం నుండి దాహార్తి గుమ్మంతి వరకు డోలు మోతతో తీసుకువచ్చారు. అక్కడినుండి పిన్న కోట పీహెచ్సీకి విడిచి kgh తీసుకెళ్లడం జరిగింది.
మడ్ద్రీబ్ గ్రామంలో 250 ఆదివాసీ గిరిజనులు నివాసముంటున్నారు. గతంలో  NRGS నుండి 4 కిలోమీటర్ వరకు  90 లక్షల రూపాయలు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. ఎన్నికలు రావడంతో. పని ప్రారంభించలేదని నిధులు రద్దు అయిపోయే. నేటికి ఈ గ్రామం అనారోగ్యం వచ్చినా డోలు మాటల ప్రయాణం చేయవలసి వస్తుంది. గ్రామ పెద్ద కొండతం బలి నర్సింగరావు..గ్రామస్తులు ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

Sunday, 16 October 2022

11రోజుల అనంతరం ఫారెస్ట్ సిబ్బందికి చిక్కిన పులి

11 రోజుల టెన్షన్ కు తెర పడింది... మధ్యప్రదేశ్..బోపాల్ మానిత్ ఇంజనీరింగ్ కాలేజీ కాంపస్ జొరపడిన పులి...విధ్యార్థులకు.. సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేసింది.. రెండు ఆవులను..రెండు గేదేలను చంపిన పెద్ద పులి. ఈ నేల 3న మానిత్ ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ ప్రాంగణంలో కనిపించింది... మధ్యప్రదేశ్ అటవీ శాఖ సిబ్బంది త్రీవ్రంగా శ్రమించి... క్యాంపస్ చెట్ల మధ్య నక్కిన పులిని మత్తు ఇంజక్షన్ ఇచ్ఛి బందించారు..అనంతరం పులి బోనులో వేశారు.. 

Wednesday, 12 October 2022

జానపదం మా ప్రాణపదం కరపత్రాన్ని ఆవిష్కరించిని సీఐ అంజలి .


ఖమ్మం ట్రాఫిక్ సీఐ అంజలి మేడం బండి కమలమ్మ మెమోరియల్ ట్రస్ట్ మొగిలి ఎంటర్టైజ్మెంట్ మెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జానపదం మా ప్రాణపదం కరపత్రాన్ని నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు . అక్టోబర్ 22 శనివారం సాయంకాలం ఆరు గంటలకు స్థానిక భక్తురామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జానపదం మా ప్రాణపదం అను కార్యక్రమానికి రేలారే రేలా ఫేమ్ శివ నాగులు మరియు ప్రముఖ జానపద గాయని స్నేహ పాల్గొంటున్నట్లు  నిర్వాహకులు తెలిపారు . జానపద కలను , కళలు కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు . కళాకారులు , కళాభిమానులు , కళా పోషకులు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణ కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత పాలకుర్తి కృష్ణ  , గౌరవ సలహాదారులు ముత్తామాల ప్రసాద్ , ప్రముఖ యాంకర్ కమెడియన్ మొగిలి గుణకర్ లు కోరారు .

Thursday, 6 October 2022

కేంద్ర విధానాలతో పలురాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకం అందుకే కెసిఆర్ జాతీయ పార్టీ : మంత్రి పువ్వాడ స్పష్టీకరణ



కెసిఆర్ గారి సారధ్యంలో BRS జాతీయ పార్టీగా విజయఢంకా మోగించటం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.దేశాన్ని అమ్మే నాయకులు కాదు దేశానికి కావాల్సింది. కేంద్రం ప్రైవేటీకరణ విషం చిమ్ముతోందని.. దీంతో పలు సంస్థలకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కార్పొరేట్ సంస్థల పరం అవుతాయని
 కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు.. 
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
కెసిఆర్ గారి సంకల్పంతో యావత్ దేశ నలుమూలల దేశ ప్రజలకు కోతలు లేని కరెంట్ ఖచ్చితంగా అంది తీరుతుందని,
కెసిఆర్ గారి వెంట నడిస్తే యావద్దేశాన్ని అన్నపూర్ణ దేశంగా తీర్చిదిద్దవచ్చని రైతు రాజు అయ్యే రోజులు కెసిఆర్ తోనే సాధ్యమవుతుందని అజయ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జాతీయస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేసే సదుద్దేశంత  కేంద్ర పాలకుల నిర్ణయాలతో దేశంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జాతీయ పార్టీగా BRS ప్రకటించడం జరిగిందన్నారు.
బిజెపి నాయకులు దేశ ప్రజలను తమ డొల్ల మాటలతో గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని దేశ ప్రజలు ఈ విషయంలో చైతన్యవంతంగా ఆలోచించాలని మంత్రి విజ్జప్తి చేశారు.
 ముఖ్యమంత్రి కేసీఆర్  సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వ
సంక్షేమ పథకాలు 
యావత్ దేశంలో అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Monday, 3 October 2022

చంద్రప్రభ వాహనంపై వెన్నెల కాంతుల మధ్య తిరువీధుల్లో కాళీయ మర్థన తాండవకృష్ణుని దర్శనం...



శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామివారు నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు  దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.చంద్ర‌ప్రభ వాహనం - సకలతాపహరం చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ రామేశ్వరరావు, శ్రీ మధుసూదన్ యాదవ్, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ ర‌మేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో అంబారాన్నంటిన బతుకమ్మ సంబురం... దసరా వేళ అందరికీ దుర్గమ్మ ఆశీస్సులు వుండాలి : కలేక్టర్ వి.పి.గౌతమ్ ఆకాంక్ష


ఖమ్మం, అక్టోబర్ 3: సర్దార్ పటేల్ స్టేడియంలో మహా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లు కుటుంబ సమేతంగా రాగా, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి,  రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డిఆర్డీవో విద్యాచందన, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి, బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు  శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని ఆయన వివరించారు. జగన్మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు కలెక్టర్ అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల... మనుగోడులో నవంబర్ 3న పొలింగ్...


మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.
ఈ నెల 7 నుంచి నామినేషన్లు, 
నవంబర్ 3 న పోలింగ్
6 న కౌంటింగ్ జరుగుతుందని ఇ.సి.ప్రకటన విడుదల చేసింది..

Sunday, 2 October 2022

స్వర్ణరథంపై వేంకటాద్రిశుని విహారం..



శ్రీవారి న‌వ‌హ్నిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించాడు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో  కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ర‌థ‌న్ని లాగారు.
శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరుప్రక్కలా ఉన్నారు. శ్రీదేవి(లక్ష్మి) సువర్ణమయి. ఆమే బంగారు కాగా - ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహా శక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున  స్వర్ణరథం శ్రీవారికి    అత్యంత ప్రీతిపాత్రమైనది.
 'స్వర్ణ' మంటే 'బాగా ప్రకాశించేది' అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమి నుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం - స్వామివారి మహోన్నతినీ,  సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ,  శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.

Saturday, 1 October 2022

తెలంగాణ లో రాహుల్ జోడో యాత్ర ... రూట్ మ్యాప్ ఫైనల్...


*రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సాగిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణ లో 
   మొత్తం 13 రోజుల పాటు సాగనుంది దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ దాదాపు ఖరారైంది.తెలంగాణలో 359 కిలోమీటర్లు  రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుండగా స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు - చేర్పులు వుంటాయని తెలుస్తోంది.
13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధంమైంది
మక్తల్  నియోజకవర్గం లోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి రాహుల్  గాంధీ జోడో యాత్ర ఎంట్రీ కానుంన్నడగా 
*1వ రోజు..*
మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో  కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు రాహుల్ తో కలసి పాల్గోంటారు.
*2వ రోజు..*
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు..
*3వ రోజు..*
మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.
*4వ రోజు..*
జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.
*5వ రోజు..*
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
మహేశ్వరం అసెంబ్లీ తోపాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.
*6వ రోజు..*
శంషా బాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు. 
*7వరోజు..*
శేరిలింగంపల్లి నియోజకవర్గం రాహుల్ పాదయాత్ర.. 
ఈ పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలు పాల్గొంటారు.
*8వ రోజు..*
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది.
ఈ యాత్రలో మల్కాజ్ గిరి, మహబూబా బాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.
*9వ రోజు..*
సంగారెడ్డి లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
మెదక్, వరంగల్ లోక్ సభ పరిధిలోని  నేతలు పాల్గొంటారు.
*10వ రోజు..*
జోగి పేట లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.
*11వ రోజు..
శంకరం పేట ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర..
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.
*12 వ రోజు..*
జుక్కల్ ప్రాంతాల్లో సాగనున్న రాహుల్ యాత్ర.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు.
*13వ రోజు..*
జుక్కల్ లోనే సాగనున్న యాత్ర.. 
కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్ర వ్యాప్త ముఖ్య నేతలు పాల్గొంటారు.
*13వ రోజు సాయంత్రం తో తెలంగాణలో ముగియనున్న రాహుల్ పాదయాత్ర.

మోహిని ఆవతారంలో మలయప్ప.. మోహపరవశులైన భక్త జనం... #జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని చెప్పేందుకే మోహిని ఆవతారం#

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతారం - 
మాయా మోహ నాశ‌నం
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఎపి హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, త‌మిళ‌నాడు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ టి.రాజ‌, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మారుతి ప్ర‌సాద్‌, క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం
       రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు.

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.