ఖమ్మం, అక్టోబర్ 3: సర్దార్ పటేల్ స్టేడియంలో మహా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లు కుటుంబ సమేతంగా రాగా, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డిఆర్డీవో విద్యాచందన, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి, బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని ఆయన వివరించారు. జగన్మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు కలెక్టర్ అన్నారు.
No comments:
Post a Comment