ఖమ్మం ట్రాఫిక్ సీఐ అంజలి మేడం బండి కమలమ్మ మెమోరియల్ ట్రస్ట్ మొగిలి ఎంటర్టైజ్మెంట్ మెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జానపదం మా ప్రాణపదం కరపత్రాన్ని నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు . అక్టోబర్ 22 శనివారం సాయంకాలం ఆరు గంటలకు స్థానిక భక్తురామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జానపదం మా ప్రాణపదం అను కార్యక్రమానికి రేలారే రేలా ఫేమ్ శివ నాగులు మరియు ప్రముఖ జానపద గాయని స్నేహ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు . జానపద కలను , కళలు కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు . కళాకారులు , కళాభిమానులు , కళా పోషకులు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణ కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత పాలకుర్తి కృష్ణ , గౌరవ సలహాదారులు ముత్తామాల ప్రసాద్ , ప్రముఖ యాంకర్ కమెడియన్ మొగిలి గుణకర్ లు కోరారు .
No comments:
Post a Comment