కెసిఆర్ గారి సారధ్యంలో BRS జాతీయ పార్టీగా విజయఢంకా మోగించటం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.దేశాన్ని అమ్మే నాయకులు కాదు దేశానికి కావాల్సింది. కేంద్రం ప్రైవేటీకరణ విషం చిమ్ముతోందని.. దీంతో పలు సంస్థలకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కార్పొరేట్ సంస్థల పరం అవుతాయని
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
కెసిఆర్ గారి సంకల్పంతో యావత్ దేశ నలుమూలల దేశ ప్రజలకు కోతలు లేని కరెంట్ ఖచ్చితంగా అంది తీరుతుందని,
కెసిఆర్ గారి వెంట నడిస్తే యావద్దేశాన్ని అన్నపూర్ణ దేశంగా తీర్చిదిద్దవచ్చని రైతు రాజు అయ్యే రోజులు కెసిఆర్ తోనే సాధ్యమవుతుందని అజయ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జాతీయస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేసే సదుద్దేశంత కేంద్ర పాలకుల నిర్ణయాలతో దేశంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జాతీయ పార్టీగా BRS ప్రకటించడం జరిగిందన్నారు.
బిజెపి నాయకులు దేశ ప్రజలను తమ డొల్ల మాటలతో గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని దేశ ప్రజలు ఈ విషయంలో చైతన్యవంతంగా ఆలోచించాలని మంత్రి విజ్జప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వ
సంక్షేమ పథకాలు
యావత్ దేశంలో అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
No comments:
Post a Comment