Wednesday, 24 January 2024

ఇక్కడ సాంప్రదాయాలు పాటించాల్పిందే : అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ :   సహాజీవన సంబంధాలను(లివిన్ రిలేషన్‌షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని.. భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ పేర్కొన్నారు.
తనతో సహ జీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబం బలవంతంగా నిర్బంధించిందని ఆరోపిస్తూ 32 ఏళ్ల ఆశిష్ కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశంలో మనం జీవించడం లేదని గుర్తుంచుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి హితవు పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి కిరీటం లాంటివని.. వాటిని గౌరవించాలని సూచించారు.
సమాజంలో సదరు మహిళ, ఆమె కుటుంబం పరువును తీసే దురుద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని జస్టిస్ షమీమ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. మహిళ కుటుంబంపై ఒత్తిడిని పెంచి, అవమాన భయానికి గురి చేసి.. రాజీని కుదుర్చుకునేందుకే ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లుగా అనిపిస్తోందన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్ఠలు తీసే ఇలాంటి పిటిషన్‌ను కోర్టు సమర్ధించబోదని స్పష్టం చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు పిటిషనర్‌పై రూ.25వేల జరిమానా కూడా విధించారు.

Monday, 22 January 2024

ఆయోధ్య సైకత నమూనా వరల్డ్ రికార్డ్..

అయోధ్యలో సైకత శిల్పి సుదర్శన్  పట్నాయక్ ఏర్పాటు చేసిన 500 రామ మందిరం ఇసుక నమూనాలు  వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించున్నాయి. ఇసుక నమోనా మందిరాలను సందర్శించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుదర్శన్ పట్నాయక్ ను ప్రశంసించారు.అక్కడే ఆయన సెల్ఫీ దిగారు..ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ, యు.పి.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లకు పట్నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు..

Thursday, 18 January 2024

180వ సారి ఇరుముడి కట్టి శబరిమలైకు....



అవుటపల్లి రాంబాబు గురుస్వామి ఈ పేరు  కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ప్రాంత అయ్యప్ప మాల దారులను అడిగితే.. గురువులకు గురువు అంటారు..తన 20వ యేట 1978లో తొలిసారి అయ్యప్ప మాల వేసి పెద్ధపాదం   ద్వారా 50మైళ్లదూరం కొండకోనలు..అటవీ చీకటి ప్రాంతాలను దాటి మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు.. 
ఇహ ఆ ఏడాది నుండి అకుంఠిత దీక్షతో  46సంవత్సరాలలో 180 సార్లు
శబరి వాసుని మాలధారణ వేసుకొని శబరిమలై సన్నిధికి వస్తారు..అయ్యప్ప భక్తిలో ఎందరికో దీక్షమాల వేయించి సన్మార్గంలో నడిపించుతూ అయ్యప్పస్వామి సంపూర్ణ ఆశీస్సులు పొందారు..
దీక్షకాలం ప్రారంభం అయిందంటే అయ్యప్ప పడిపూజల ప్రాంగణంలో భక్తి గీతాలు..భజనలు.. స్వాములను భక్తి పారవశ్యంలో ఓలాలాడాంచి దీక్ష మార్గంలో తత్వమసిని స్వాముల హృదయాలకు చేర్చడంలో తరిస్తున్నారు..
46సంవత్సరాల కాలంలో ఒక వైపు సింగరేణి ఉద్యోగం చేస్తూ మరోవైపు స్వాములకు భక్తిమార్గం చూపుతూ... 180వ సారి అయ్యప్పను దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.. కొత్తగూడెం లో అయ్యప్ప ఆలయం నిర్మాణంలో తన వంతు కృషి చేసిన గుర్గుగురువు రాంబాబు..40సంవత్సరాల క్రితమే యాత్ర బస్ ఏర్పాటు చేసి  స్వాములను శబరిమలై సన్నిధికి తీసుకొని వెళ్ళి శబరిసురుని దర్శనం చేయించారు..

Tuesday, 16 January 2024

గోవులను రక్షించుకుందాం సంస్కృతిని కాపాడుకుందాం.. గోమాత పరిరక్షణకుప్రతి ఒక్కరు ప్రతిన బూనాలి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి... Safeguard Cows..Protect Culture... TTD Chairman.... Everyone should inculcate Go Samrakshana


తిరుపతి: వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు  ప్రతిన బూనాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు.  తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు .
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్బంగా 
గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2,500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.పూర్వకాలం నుండి కనుమ పండుగ రోజున గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు.  ఇప్పటి వరకు దాతలు  రూ.250 కోట్లకు పైగా ”ఎస్వీ గో సంరక్షణట్రస్టు” కు విరాళాలు అందించినట్లు వివరించారు అంతకుముందు చైర్మన్   గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు.అటుతర్వాత గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి  దాణా అందించారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పురప్రజలను ఆకట్టుకున్నాయి. 
Tirupati, Chairman Sri Bhumana Karunakara Reddy called upon everyone to inculcate the habit of safeguarding cows to protect our culture as evinced in Vedas and Puranas.
Participating in the Go Puja Mahotsavam held at Sri Venkateswara Go Samrakshanasala in Tirupati as Chief Guest as part of Kanuma festivities the TTD chairman said TTD has been promoting the Gopuja program to empower the younger generation about the significance of the holy cow. He said TTD’s Goshalas at Tirupati and Palamner consisted of about 2500 cows, bulls,elephants and horses.They stood as major attractions during Utsavams of Tirumala and Tiruchanoor. Similarly butter from desi cows is primarily used in all rituals and festivities of Tirumala.He said Gopuja is significant in Kanuma festivities from time immemorial as the practice empowers devotees with prosperity, health and peace.The SV Gosamrakshana trust had received donations of ₹250 crore till date.Earlier the TTD Chairman participated in other puja programs at Sri Venugopal Swamy temple,Tulasi Puja etc. Later he also fed fodder to Cows, Horses, Bulls, elephants etc. after performing puja to them.The cultural programs, Annamaiah sankeertans and bhajans  by artists of Annamacharya and Dasa Sahitya projects and students of SV college of music and dance enthralled the devotees and citizens of Tirupati

Monday, 15 January 2024

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి వేడుకలు....


విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:     ఆలయ స్థానాచార్యుల వారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి వేద మంత్రోచ్చారణాల నడుమ సాంప్రదాయబద్ధముగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, మేళములతో వైభవముగా భోగి మంటలు కార్యక్రమంతో ఆదివారం సంక్రాంతి వేడుకలు మొదలు అయ్యాయి‌భోగి మంటలు వెలిగించి, ప్రదక్షిణలు చేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు , కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, కార్యనిర్వాహక ఇంజనీర్లు,  వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు  సిబ్బంది  భక్తులు..
భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపి, శ్రీ అమ్మవారి స్వామివారి కృపాకటాక్షములు అందరికీ ఉండాలని కోరుకున్నారు.
సంక్రాంతి సందర్బంగా మహామండపం 07వ అంతస్తు పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు..బొమ్మల కొలువు వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి  బొమ్మల కొలువు ప్రారంభించారు.
ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసములు, హరిదాసు కీర్తనలు, బొమ్మల కొలువు, వివిధ వర్ణముల ముగ్గులు, అయోధ్య రామమందిరం ముగ్గు, ఎద్దుల బండి, కోడి పుంజులు, రైతు, నాగలి, గుడిసె, రోకలి, చెరకు గడలు, తదితరులను తీర్చి దిద్దారు.కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ, పాలక మండలి సభ్యులు,  వైదిక కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది..ఉదయం నుండి విశేషముగా అమ్మవారి దర్శనార్థం వస్తున్న భక్తులు... సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాట్లును విశేషముగా తిలకిస్తున్న భక్తులు..*పెద్దరాజగోపురం ఎదురుగా ఉన్న ప్రదేశం నందు సాయంత్రం 05 గం. లకు నిర్వహించనున్న చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయు కార్యక్రమం జరిపించారు..

Wednesday, 10 January 2024

ప్రజలు వివేకంతో గెలిపించారు: మంత్రి పొంగులేటి



ఎవరు ఎన్ని చెప్పినా పది సంవత్సరాలు పాలించి ప్రజల గోడు పట్టని ప్రభుత్వాన్ని దించి ప్రజలు వివేకంతో 
 ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచారం,పౌరసంబంధాల శాఖామాత్యులు.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.. బుధవారం కూసుమంచిలోని పాలేరు క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులతో మమేకమైన శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు Brs పార్టీ ఖమ్మం జిల్లాలో ఏ మీటింగ్ పెట్టిన కేసీఆర్ డబ్బు అహంకారం తో ఉన్న వారిని గెలిపించొద్దనే స్లోగన్ ఇచ్చారని పేర్కొన్నారు.. 
గతంలో తాము అధికారంలో లేనమని,ముఖ్యమంత్రి గా వుండి ,ప్రజల సొమ్ము దోచుకోలేదని ,తెర వెనుక వేలాది కోట్లు సంపాదించలేదని. శ్రీనివాసరెడ్డి అన్నారు. ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులం ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రజల సేవకులుగా పనిచేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు...గత ప్రభుత్వం 6లక్షల 71 వేల కోట్ల అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజలు గమనించారని
.ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం తప్ప మాయమాటలు చెప్పి ప్రభుత్వం కాదు..ఇరిగేషన్ ప్రాజెక్టు ల పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పామో ఈరోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సమీక్ష చేస్తున్నారు.గత ప్రభుత్వం లో చేసిన తప్పులు కనపడతాయాని ఫైళ్లను మాయం చేసే కార్యక్రమం చేపడితే ఆ ఫైళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  తప్పు చేయకపోతే ఫైళ్లను మాయం చేయాలని బిఆర్ఎస్ నేతలు ఎందుకు చూసారు..  ప్రభుత్వ ఆస్తులను వారి తొత్తులకు కట్టబెట్టారు..ఇప్పటికే ఖమ్మం లో రెండు మూడు అంశాలను కలెక్టర్ బయటకు తీశారు..ప్రభుత్వ ఆస్తులను ప్రజలకు చెందే విధంగా చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది..వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉంది..
కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ మనోధైర్యం తో గౌరవం గా ఉండి మీ కృషి తో తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో మీరందరూ భాగస్వామ్యులయి అందరం ప్రజల కోసం పని చేయాలని పొంగులేటి పిలుపు నిచ్చారు..

Tuesday, 9 January 2024

ఆధునీకరించిన వెబ్‌సైట్ ప్రారంభించిన టిటిడి... #TTD launched latest Website on local temples#


తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల టీటీడీ స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించేదిశ‌గా అన్ని వివ‌రాల‌తో ఆధునీకరించిన వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.టీటీడీలో 60కి పైగా ఉన్న  స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు సంబంధించిన స్థ‌ల‌పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న వేళ‌లు, రవాణా వివరాలు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ ను ఆధునీకరించింది.
Tirupati, TTD Chairman  Bhumana Karunakara Reddy launched a revamped website ttdevasthanams.ap.gov.in with objective to give extensive publicity to TTD temples in Tirupati and other locations across the country.
The website launch program was held at the Mahati Auditorium on Monday.
The revamped website provided updates on local temple history, Arjita Sevas, Darshan hours, transport and other infrastructure available at over 60 TTD managed temples and Information Centres across the country.
The portal also provided photos, videos and other geographical details with the technical support from Jio and the Configurations made by the TTD IT department.

ప్రజలు తిరస్కరించలేదు.. ఓటమి అనుకోవద్దు...‌కేటిఆర్


హైదరాబాద్  : ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనం. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయి.ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయాం. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదాంఇప్పటికీ జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిగిన సంగతి తెలిసిందే. ఖమ్మం సమీక్ష 7 వది.రాష్ట్రం లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. వచ్చిన తెల్లారినించే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రేస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని ఆ పార్టీ నెల రోజుల పోకడ స్పష్టమౌతున్నది.వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది.ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రేస్ పార్టీ సొంతం.గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే. 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయపరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది.1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీని తిరస్కరించి కాంగ్రేస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రేస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు.ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది.
ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీ ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం మనం మరువగూడదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రేస్ పార్టీ కి వుండదు అనేది గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది.ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రేస్ పార్టీ మీద వత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుంది.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ను గెలిపించింది.పదేండ్ల అనతికాలం లోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టింది. తెలంగాణ గళం బిఆర్ఎస్.. తెలంగాణ బలమూ బీఆర్ఎస్సే..రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుతున్న తీరుకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బిఆర్ఎస్ కార్యకర్త.. నాయకునిదే.
నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్పూర్తితో నిన్నటిదాకా సాధించిన ప్రగతి దీప్తిని తిరిగి నిలబెట్టుకుందాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనీ గెలిపించుకుందాం.
అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలం. 
మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమే. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారు. రానున్న రోజుళ్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి.కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయి.త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాం.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందే.

Monday, 8 January 2024

మహాలక్ష్ములు ఒరిజినల్ చూపండి......

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారని #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును #TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం.

#సివిల్ సప్లై.పై వడ్డీ భారం 3000కోట్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి#

జనవరి 31వ తేదీలోపు భారత ఆహార సంస్థకు (ఎఫ్.సి.ఐ కి) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ,  ఎఫ్‌సిఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్‌ను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని,  రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్‌సిఐకి అందజేయాలని అన్నారు, పౌర సరఫరాల శాఖ నుండి ఎఫ్‌సిఐకి పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, అయితే డెలివరీలలో పని తీరు తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారని వివరించారు.  
పౌర సరఫరాల సంస్థ జనవరి 31 నాటికి 7.83 లక్షల మెట్రిక్‌ టన్నుల వానాకాలం బియ్యం యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరుగకూడాదని అధికారులను ఆదేశించారు.  దీని కోసం తెలంగాణ మిల్లర్లందరూ రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
 రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు అవసరమైనంత నాణ్యతలో ఎఫ్‌సిఐకి బియ్యాన్ని పంపిణీ చేయడంపై ఆధారపడి ఉంటుందని  జాప్యం జరిగితే కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.  గత 9-10 సంవత్సరాలలో రూ. 58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వలన సివిల్ సప్లైపై భారం పడిందని అన్నారు. ఆలస్యం చేయడం వలన అదనంగా దాదాపు రూ. 3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడనుందని అన్నారు.  సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.
ఎఫ్‌సీఐకి నిర్ణీత పరిమాణంలో సీఎంఆర్‌ బియ్యాన్ని పంపిణీ చేయడంలో  జాప్యం చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.  ఎఫ్‌సిఐకి సకాలంలో బియ్యం పంపిణీ చేసేందుకు విధానాలను మెరుగుపరచాలని, ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
జిల్లా కలెక్టర్లు, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, రైతులకు, రాష్ట్ర ఆర్థిక మరియు పౌర సరఫరాల కార్పొరేషన్ యొక్క భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. లక్ష్యం గడువుకు 21 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, లక్ష్యాన్ని సాధించడానికి రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన ప్రతిపాదించారు.
దీనికి తోడు పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  కేంద్రం, రాష్ట్రాలు కిలో రూ.39కి కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైకిల్ చేయడం లేదా ఇతర అవసరాలకు మళ్లించడం జరుగుతోందని ఆయన గుర్తించారు.  PDS బియ్యాన్ని "పవిత్రమైనది"గా పేర్కొంటూ, పేదలను చేరుకోవడంలో మరియు వాణిజ్యీకరణను నిరోధించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అధిక ధరలకు ఎగుమతి చేసేందుకు మిల్లర్లు పీడీఎస్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి రీసైక్లింగ్‌ చేస్తున్నారనే వార్తలను ప్రస్తావించగా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కేసులను అత్యంత సీరియస్‌గా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఒక్కో బియ్యం బస్తాకు 4-5 కిలోల తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రేషన్‌ షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బియ్యం సరఫరా విషయంలో ప్రతి జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.  
     ఈ సందర్భంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, తక్కువ కొనుగోళ్లు ఉన్న జిల్లాల్లోని కలెక్టర్లు ఎఫ్‌సీఐకి పంపిణీ చేసిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఆధార్, రేషన్ కార్డు లలోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని సి.ఎస్ అధికారులకు సూచించారు. ప్రజాపాలనలోని అభయహస్తం దారఖాస్తులన్నింటి డాటా ఎంట్రీని  ఈ నెల 17 వ తేదీ లోగా పూర్తి చేయాలన్నారు. 
ప్రజాపాలన, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, డీ.ఎస్. చౌహాన్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Saturday, 6 January 2024

మూసీని చుట్టనున్నా అభివృద్ధి.. ప్రణాళికలకు రంగం సిద్ధం...


మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఎరియా, షాపింగ్ మాల్స్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ ను రూపొందించాలని సూచించారు. 
ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హొటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులు...
హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్ లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.
చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్ఎస్పీడీసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు.

మెట్రో రైల్
సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబోలి – ఎయిర్ పోర్టు వరకు 32కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు వుండటం వల్ల వారు ఎక్కువగా స్వంత వాహనాలు వాడుతున్నారని అన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్ నుమా - ఏయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు వున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా ఉపయోగకరంగా వుంటుందని సిఎం అభిప్రాయపడ్డారు.

Thursday, 4 January 2024

శబరిమలలో అయ్యప్పల అవస్థలు.. మకర జ్యోతి కి పిల్లలతో రావద్దు : ట్రావన్ కుర్ దేవస్వామ్ బోర్డు.. కనీస వసతుల లేమి...చేతులెత్తేసిన దేవస్థానం బోర్డు...

శబరిమలైకు భక్తులు పోటెత్తారు.. ఆది సోమ సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మాలాదారులు ఇరుముడితో శబరిసురుని దర్శనానికి తరలి వెళ్లారు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి సైతం అయ్యప్పలు పోటెత్తాడంతో శబరిమలైలో గురువారం ఉదయం పరిస్థితి దారుణంగా తయారైనట్లు భక్తులు గగ్గోలు పెడుతున్నారు ముఖ్యంగా తెలుగువారు భాష సమస్య వల్ల తమను పట్టించుకునే నాధుడు లేడంటూ సోషల్ మీడియా వేదిక పోస్టులు పంచుకుంటున్నారు.. పెద్ద ఎత్తున భక్తులు తల రావడంతో దేవస్తానం బోర్డు సైతం కనీస వసతులు కల్పించలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది..
జ్యోతి దర్శనానికి వచ్చే అయ్యప్పలు పిల్లలను తీసుకురావద్దంటూ శబరిమలై దేవస్థానం బోర్డు విజ్ఞప్తి చేస్తుంది .
Swamiye Saranam Ayyappa 
TDB(Travancore Devosam Board) informed that 3,83,268 Devotees visited Sabàrimala for Makaravilakku Mahotvastam in 4 Days from  the largest number was 1,01,789 Devotees visited on 1st January 2024...Swamiye Saranam Ayyappa
 So requesting everyone those who are planning to Visit Sabàrimala on Jan 14-15 avoid children's & Malikappuram's on this two days Sabàrimala is going to witness huge crowd for upcoming Makaravilakku Mahotvastam.)
శబరిమలై కు ఈరోజు వెళ్లిన భక్తుని ఆందోళన అతని మాటల్లో..స్వామి శరణం 🙏
స్వామి శబరి లో తీరమైన రద్దీ చాలా ఇబ్బందులు తిండి లేక నిద్రలు లేక మల మూత్ర విశర్జన ఇబ్బందులు అధిక భక్తుల తో పోలీస్ వారు వీరంగం ఒక్కసారి లైన్లో ఉంటే వెనుకకు ముందుకు కదుల లేరు ముఖ్యం గా వృద్ధులు మహిళలు చిన్న పిల్లల ఆవేదన కష్టం చెప్పలేనిది బాషా ప్రాబ్లమ్ వినేవాడు లేడు తెలుగు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేరళ ప్రభుత్వం కు హెచరిక తో విజ్ఞప్తి చేయాలి సవుకర్యలకోసం ఏర్పాటు చేసి భోజనం తీసివేసారు తెలుగు భోజసనము మన వారు ఉద్యోగులు క్యాంపు లు పెట్టి తగు వసతులు ఏర్పాటు చేసేవిధంగా ఎందరో బీపీ షుగర్ అస్తమా పెషనట్లు చనిపోతున్నారు ఇది సత్యం
 కేవలం కేరళ ప్రభుత్వం దేవస్థానం వారి ఏర్పాట్లు లేక చాలా ఇబ్బందులు
పిల్లలు వృద్దులు మహిళలు పరిస్థితి తేలుసుకొని వెళ్ళండి.. ఉపేందర్ గురుస్వామి 25 సం ల నుండి ఇంత కష్టం ఎప్పుడు పడ లేదు స్వయం అనుభవం చెంది చలించి ఆవేదన తో చెబుతున్నా అంటూ పేర్కొన్నారు..
@Manikumar Kommamuru.

కేసీఆర్ ఇంటికి వైఎస్ జగన్...స్వాగతం పలికిన కెటిఆర్..

అధినేత కెసిఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ  జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు  దానం నాగేందర్,   కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు  జీవన్ రెడ్డి, చిరుమర్రి లింగయ్య తదితరులున్నారు.నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్నిఅందించి పరామర్శించారు. అనంతరం కేసీఆర్  యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.సీఎం  జగన్ వెంట ఎంపీ  మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ  రఘురాం, ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.

*జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై* *జనవరి 15తర్వాత* *ఉన్నతస్థాయి సమావేశం : పొంగులేటి హామీ *-


జర్నలిస్టుల ఇంటి స్థలాలు, సంక్షేమ చర్యలకు సంబంధించి జనవరి 15తర్వాత ఒకరోజు సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కె.రాంనారాయణలతో కూడిన ప్రతినిధి బృందం భేటీ అయ్యి జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలను సేకరించాలని, అలాగే వాటి ద్వారా ఇచ్చిన స్థలాల వివరాలు, స్వాదీనం చేయకుండా ఉన్న స్థలాల వివరాలు, ఇకముందు ఇవ్వడానికి అనువైన స్థలాలను నిర్ధిష్టంగా పేర్కొంటూ నివేదికలు పంపించాలని రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రతినిధి బృందానికి మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా ఇంటి స్థలాలు ఇవ్వనందున జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నారనే విషయాన్ని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. వీటితో పాటు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ విషయాన్ని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్థావించగా, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి తప్పని సరిగా పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.జర్నలిస్టుల నివేశన స్థలాలు, ఇతర సంక్షేమ చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై ఒక విధానపరమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు.జ ర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై టీయూడబ్ల్యూజే ఇచ్చిన 3పేజీల వివరణాత్మక వినతి పత్రాన్ని కులంకశంగా చదివి చర్చించిన మంత్రికి ప్రతినిధి బృందం కృతఙ్ఞతలు తెలిపింది.

*ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి లబ్ది : మంత్రి తుమ్మల*


ఖమ్మం, జనవరి 4: అభయ హస్తం క్రింద ఆరు గ్యారెంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నగరంలోని 49వ డివిజన్ రామాలయం వద్ద నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఇది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం క్రింద ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించేందుకు జిల్లా, మండల యంత్రాంగం మొత్తం ప్రజల మధ్యకే వచ్చిందని అన్నారు. 28 డిసెంబర్ నుండి జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి, దరఖాస్తుల స్వీకరణ చేస్తామని, ప్రజాపాలన సభ రోజున వీలుకాని వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తమ దరఖాస్తును జనవరి 6 లోపు తమ తమ గ్రామపంచాయితి కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో అధికారులకు అందజేయాలని మంత్రి అన్నారు.  ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే అందించి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో, గుర్తించబడిన కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్య చికిత్స కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 5 లక్షల పరిమితిని, పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. మిగతా పథకాలు అమలు చేయడానికి మీరు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటింటికి వస్తాయని, ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ సంపద అట్టడుగు వర్గాలకు అందించేందుకు ప్రజాపాలన చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ ఫలాలు అందరికి అందుతాయని అన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు సమర్పణకు వచ్చిన ప్రజలతో, ఏ ఏ పథకాల కొరకు దరఖాస్తు చేసింది అడిగి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాల అమలు చేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, పట్టణ ఏసీపీ హరికృష్ణ, స్థానిక కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ కమర్తపు మురళి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

టి.ఎస్.ఆర్టీసికి ఆర్థిక భరోసా.. రోజు వారి నిధులు సమకూరుస్తాం : మంత్రి బట్టి ఉద్ఘాటన.... ఇతర మార్గల్లో ఆదాయం పెంచుతాం... మహాలక్ష్మి కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది ఉచిత ప్రయాణం...


హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి  పొన్నం ప్రభాకర్తో కలిసి తెలంగాణ.              ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి  సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులను అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన సంస్థ దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని  ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని,  టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  రామకృష్ణా రావు, టీ ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ  కృష్ణ భాస్కర్, టీఎస్ఆర్టీసీ ఈడీలు ముని శేఖర్, కృష్ణ కాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్,  తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 2 January 2024

6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నంసంతృప్తిక‌రంగా ద‌ర్శించుకున్న భ‌క్తులు... Record 6.47 lakh devotees had Vaikuntadwara Darshan- Ttd EO

6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
సంతృప్తిక‌రంగా ద‌ర్శించుకున్న భ‌క్తులు

మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి

Record 6.47 lakh devotees had Vaikuntadwara Darshan- Ttd EO

Comfortable Darshan to all devotees
  వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 ల‌క్ష‌ల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం క‌ల్పించామ‌ని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వారికి నిర్దేశించిన స‌మ‌యంలోనే సంతృప్తిక‌రంగా స్వామివారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించామ‌న్నారు. ద‌ర్శించుకున్న భ‌క్తుల‌తోపాటు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య గ‌తం కంటే పెరిగింద‌ని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేశామ‌న్నారు. 10 రోజుల‌కు క‌లిపి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామ‌ని, 18,578 మంది హాజ‌రుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి ఆన్‌లైన్‌లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నార‌ని, 6,388 మంది హాజ‌రుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని వివ‌రించారు. శ్రీ‌వాణి దాత‌ల‌కు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామ‌ని, 19,083 మంది హాజ‌రుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలియ‌జేశారు. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 2.25 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నార‌ని, 1,97,524 మంది హాజ‌రుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 ల‌క్ష‌లు మంజూరు చేశామ‌ని, 3,24,102 మంది హాజ‌రుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజ‌ర‌య్యార‌ని వెల్ల‌డించారు.
అదేవిధంగా, ఈ ప‌ది రోజుల‌కు క‌లిపి రూ.40.20 కోట్లు హుండీ కానుక‌లు అందాయ‌ని, 17.81 ల‌క్ష‌ల మంది అన్న‌ప్ర‌సాదాలు, 35.60 ల‌క్ష‌ల మంది ల‌డ్డూ ప్ర‌సాదాలు స్వీక‌రించార‌ని, 2.14 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని ఈవో తెలియ‌జేశారు.
మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ఈవో స‌మాధాన‌మిస్తూ అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌గ‌ల రాతిమండ‌పం కూలిపోయే స్థితికి చేరుకుంద‌ని, దీని పున‌ర్నిర్మాణానికి సంబంధించి భార‌త పురావ‌స్తు శాఖకు ప‌లుమార్లు లేఖ‌లు రాసినా స్పంద‌న లేద‌ని తెలిపారు. నంద‌లూరులోని శ్రీ సౌమ్య‌నాథ‌స్వామివారి ఆల‌య గోడ కూలింద‌ని, దీనికి సంబంధించి పురావ‌స్తు శాఖ‌కు లేఖ‌లు రాసినా స్పందించ‌డం లేద‌ని చెప్పారు. రాతిమండ‌పాలు, ఆల‌యాల పున‌ర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్ర‌త్యేకంగా ఆల‌య నిర్మాణ విభాగం ఉంద‌ని, ఇక్క‌డ నిపుణులైన స్థ‌ప‌తులు ఉన్నార‌ని వివ‌రించారు. ఎస్వీ శిల్ప క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో ఎంతో మంది నిపుణుల‌ను త‌యార‌వుతున్నార‌ని, వీరు విగ్ర‌హాల త‌యారీతోపాటు, చ‌క్క‌గా ఆల‌యాలు నిర్మించ‌గ‌ల‌ర‌ని తెలియ‌జేశారు. ఇటీవ‌ల జ‌మ్మూకాశ్మీర్‌, వైజాగ్‌, హైద‌రాబాద్‌, ఒడిశా, క‌న్యాకుమారి, సీతంపేట‌, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో అత్యంత సుంద‌రంగా రాతి క‌ట్ట‌డంతో ఆల‌యాలు నిర్మించామ‌ని వెల్ల‌డించారు. అలిపిరి న‌డ‌క‌మార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత‌, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన‌పుడు వెంట‌నే భ‌క్తుల‌ను అప్ర‌మ‌త్తం చేసి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర అట‌వీశాఖకు రూ.3.5 కోట్లు అందించామ‌ని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇత‌ర చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని చెప్పారు.
Tirumala, TTD EO AV Dharma Reddy on Tuesday said that a record number of 6.47 lakh devotees were provided Vaikuntadwara Darshan between December 23 and January 1.Addressing a media conference at Annamaiah Bhavan in Tirumala he said devotees were provided with comfortable and hassle free Srivari Darshan through time Slotted tokens to avoid prolonged wait in queue lines and more number of devotees than usual had Anna Prasadam during the period. He said during ten days as many as 19,255 VIP break protocol tickets were issued but only 18,578 attended and 677 (3.3 % ) were absent. Similarly, 6858 tickets were booked online by donors of which 6388 were present and 470(7%)  were absent. The Srivani Trust donors were issued 20,000 tickets of which 917 (4.5%) did not come. A total of 2.25 lakh ₹300 Special Entry Darshan tickets were issued online of which 1,97,254 availed with 27,476 (12.2%) absentees. Nearly 4,23,500 time slot Sarva Darshan tokens were issued of which 3,24,102 utilized darshan and 90,850 (21.5%) did not come.In the same way, TTD Hundi collection recorded ₹40.20 crores, 17.81 Anna Prasadam, 35.60 lakh laddus sold and 2.14 lakh devotees tonsured hairs. Responding to a media query EO said there was no response from Archeological survey of India for several letters with regard to repairing the dilapidated stone Padala Mandapam at Alipiri.Similarly there was no response to letters about wall collapse of Sri Soumyanath Swamy temple at Nandalur. TTD has set up a division with experts and Sthapathis for rejuvenation of dilapidated Mandapams and temples. The SV traditional sculpture institute of TTD has produced sculptors to make and rebuild temples.They had built wonderful temples at Jammu,Visakhapatnam,Hyderabd,Odisha,Kanyakumari ,Seethampeta and Rampachodavaram regions.
He said devotees on Alipiri footpath are regularly alerted on movements of leopards and other wild animals after tracking them on trap cameras installed in the region. Further action was initiated to buy more trap cameras.

జర్నలిస్టులకు తీపికబురందించిన పొంగులేటి

 జర్నలిస్టుల గృహాలపై రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుముఖత..
 త్వరలోనే.. జర్నలిస్టులకు నీడ దక్కే అవకాశం..
మాట ఇస్తే మడం తిప్పని నాయకునిగా పొంగులేటి ప్రస్తానం... జర్నలిస్టుల గృహలపై ప్రకటన పట్ల ఆశ వాహుల హర్షం 

మంత్రి పొంగులేటికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా రిజిస్ట్రార్ అశోక్

ఖమ్మం: ఖమ్మం జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ ల అధికారి చిట్టిమళ్ల అశోక్ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పొంగులేటికీ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి జిల్లాలో రిజిస్ట్రేషన్ ల స్థితిని.. శాఖ పనితీరుని జిల్లా రిజిస్టర్ అశోకుని అడిగి తెలుసుకున్నారు..జిల్లా రిజిస్టర్ తో పాటు రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయం ఆడిట్ అధికారి ఏ.రవీంద్రబాబు పొంగులేటికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.