అధినేత కెసిఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్రి లింగయ్య తదితరులున్నారు.నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్నిఅందించి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.
No comments:
Post a Comment