అవుటపల్లి రాంబాబు గురుస్వామి ఈ పేరు కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ప్రాంత అయ్యప్ప మాల దారులను అడిగితే.. గురువులకు గురువు అంటారు..తన 20వ యేట 1978లో తొలిసారి అయ్యప్ప మాల వేసి పెద్ధపాదం ద్వారా 50మైళ్లదూరం కొండకోనలు..అటవీ చీకటి ప్రాంతాలను దాటి మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు..
ఇహ ఆ ఏడాది నుండి అకుంఠిత దీక్షతో 46సంవత్సరాలలో 180 సార్లు
శబరి వాసుని మాలధారణ వేసుకొని శబరిమలై సన్నిధికి వస్తారు..అయ్యప్ప భక్తిలో ఎందరికో దీక్షమాల వేయించి సన్మార్గంలో నడిపించుతూ అయ్యప్పస్వామి సంపూర్ణ ఆశీస్సులు పొందారు..
దీక్షకాలం ప్రారంభం అయిందంటే అయ్యప్ప పడిపూజల ప్రాంగణంలో భక్తి గీతాలు..భజనలు.. స్వాములను భక్తి పారవశ్యంలో ఓలాలాడాంచి దీక్ష మార్గంలో తత్వమసిని స్వాముల హృదయాలకు చేర్చడంలో తరిస్తున్నారు..
46సంవత్సరాల కాలంలో ఒక వైపు సింగరేణి ఉద్యోగం చేస్తూ మరోవైపు స్వాములకు భక్తిమార్గం చూపుతూ... 180వ సారి అయ్యప్పను దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.. కొత్తగూడెం లో అయ్యప్ప ఆలయం నిర్మాణంలో తన వంతు కృషి చేసిన గుర్గుగురువు రాంబాబు..40సంవత్సరాల క్రితమే యాత్ర బస్ ఏర్పాటు చేసి స్వాములను శబరిమలై సన్నిధికి తీసుకొని వెళ్ళి శబరిసురుని దర్శనం చేయించారు..
No comments:
Post a Comment