Thursday, 31 October 2024

కోదాడ డిఎస్.పి శ్రీధర్ రెడ్డికి కేంద్ర దక్షతా పతకం.. హాజీపూర్ నిందితుల పట్టివేతలో కీలకపాత్ర వహించిన శ్రీధర్ రెడ్డి...

*నేర పరిశోనలో అత్యుత్తమమైన  ప్రతిభకు గుర్తింపుగా కోదాడ డి యస్ పి శ్రీ మామిళ్ల శ్రీధర్ రెడ్డికి   కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం*
తేది 31.10.2024 నాడు జాతీయ సమైక్యత దినోత్సవం (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ, నేర పరిశోధనలో అత్యున్నతమైన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా, సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ డి యస్ పి 
శ్రీ మామిళ్ళ  శ్రీధర్ రెడ్డి కి 2024 సంవత్సరానికి "కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతాకాన్ని" ప్రకటించటం జరిగింది. 
1998 నవంబర్ లో సబ్-ఇన్స్ పెక్టర్ గా  ఎంపికైన శ్రీ మామిళ్ల  శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో , రాచకొండ కమిషనెరేట్ మరియు ప్రత్యేక నిఘా విభాగంలో పనిచేసారు.ప్రతిష్ట్మాకమైన  ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి దేశం తరుపున ఎంపికై 2016-17 లో   హైతీ దేశంలో పోలిస్ ఆపరేషన్స్ ప్లానింగ్ అధికారిగా పని చేసారు.సంచలనాత్మక హాజీపూర్ కేసులో ముగ్గురు  మైనర్ బాలికల అత్యాచారం, హత్య చేసిన  నిందితుడిని  తన సాంకేతికత నైపుణ్యాన్నీ ఉపయోగించి  స్వల్పకాలంలోనే అరెస్ట్ చేయడంలో, అత్యంత కీలక పాత్ర పోషించటం జరిగింది. నర్సింహులగూడెం  ఫ్యాక్షన్ హత్య కేసు, మరో మూడు హత్య, అనేక దోపిడీ, దొంగతనాల కేసుల ఛేదన మరియు దర్యాప్తును తనదైన శైలీలో కృషి, పట్టుదలతో చేసి అనేక కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా విధులను నిర్వహిస్తూ, అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. 26 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక మైన శాంతి భద్రతల విషయాల్లో, సామాజిక విషయాల్లో , పోలీస్ ప్రజా సంబంధాలను పటిష్టం చేయటంలో, అనేక  తీవ్రవాద, దోపిడీ, హత్య , మనుషుల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల కేసుల్లో తన ప్రతిభ పాటవాలను గుర్తించి, తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం మరియు   పొలిసు ఉన్నతాధికారులు, గతంలో కూడా పోలీస్ సేవ పతాకాన్ని, తెలంగాణ రాష్ట్ర శౌర్య పతాకాన్ని, ఉత్తమ సేవ పతాకాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పతాకాన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ బహుకరించటం జరిగింది. అంతేకాకుండా 2015 లో పంజాబ్ లో జరిగిన అఖిల భారత స్థాయి  డ్యూటీ మీట్ లో  ఫోరెన్సిక్ సైన్స్ విభగంలో రజత పతాకాన్ని సాధించారు.   2017 లో ఐక్య రాజ్య సమితి శాంతి పతాకాన్ని సాధించారు. మరో రెండొందలకు పైగా రివార్డులు/అవార్డులు పొందారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీ శ్రీ జితెందర్ IPS, శాంతి భద్రతల అదనపు డీజీపీ శ్రీ మహేష్ భగవత్,IPS, జోనల్ ఐజీపీ శ్రీ సత్యనారాయణ IPS, సూర్యాపేట జిల్లా యస్ పి శ్రీ సన్ ప్రీత్ సింగ్, IPS & అదనపు యస్ పి నాగేశ్వర్ రావు మరియు ఇతర అధికారులు కోదాడ  డి ఎస్ పి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించటం జరిగింది.

Wednesday, 30 October 2024

*మయోనైజ్ బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం*



తెలంగాణ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్న మయోనైజ్  ను రాష్ట్రంలో నిషేధిస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని నందినగర్ లో మోమోస్ లో మయోనైజ్ తిని ఓ మహిళ మృతి చెందగా.. 20 మందిదాకా ఆసుపత్రుల పాలయ్యారు. అలాగే నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో కూడా తరుచూ ఇలాంటి ఘటనలు జగరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Mayonnaise is an emulsion of oilegg yolk, and an acid, either vinegar or lemon juice;[4] there are many variants using additional flavorings. The color varies from near-white to pale yellow, and its texture from a light cream to a thick gel.Commercial eggless versions are made for those who avoid chicken eggs because of egg allergies, to limit dietary cholesterol, or because they are vegetarian or vegan.[5]


నందనవనం లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తాం ; మంత్రి పొంగులేటి.

రంగారెడ్డి జిల్లా ఎల్.బీ.నగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్ల అసలు లబ్ధిదారులకు న్యాయం జరిపించి తీరుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని అధికారులను ఆదేశించారు  తెలిపారు. ''నందనవనం''  ఆక్రమణదారుల తొలగింపునకు చర్యలు చేపట్టి.. అర్హులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.
బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య, కేటాయింపుపై అధికారులతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్‌, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ డి. దివ్య, ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన డాక్టర్ ఎస్. హరీష్‌, కె. శశాంక్ తదితరులు పాల్గొన్నట్లు ట్వీట్‌లో తెలిపారు.

Monday, 28 October 2024

*ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి..*


2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకకు చిరంజీవి కుటుంబసభ్యులు, నాగార్జున కుటుంబసభ్యులతోపాటు
పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.

మంత్రి పొంగులేటి కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. జిల్లా వ్యాప్తంగా జన్మదిన వేడుకలు...

*తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..*
 *మంత్రి పొంగులేటి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
మరోవైపు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పొంగులేటి అభిమానులు బైక్ ర్యాలీలతో ఉమ్మడి ఖమ్మంజిల్లాను హెూరెత్తించారు. పురవీధులన్నీ  కటౌట్లు, ప్లెక్సీలు, భారీ హెర్డింగ్ లతో నిండిపోయాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రతి పల్లెల్లో పెద్ద ఎత్తున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడుకలను కోలాహలంగా  జరిపారు.. ప్రాంతంలోనూ పండుగ వాతావరణం కనిపించింది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. పొంగులేటి  పిలుపు మేరకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలంతా సమాజ, సామాజిక కార్యక్రమాల్లోనే నిమగ్నమయ్యారు.*
- *ఖమ్మం, కూసునుంచి క్యాంపు కార్యాలయాల్లో....*
*మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో పుట్టినరోజు సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బాణోతు విజయబాయి, గుమ్మా రోశయ్య, హరినాథబాబు, కల్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, కొప్పుల అశోక్, కొంగర జ్యోతిర్మయి, కీసర పద్మజా రెడ్డి, కర్లపూడి భద్రకాళి, పంతులు నాయక్, భీమనాథుల అశోక్ రెడ్డి, లింగాల రవికుమార్, గురుప్రసాద్, మియాభాయ్, కిలారు మనోహర్, ఉమ్మినేని కృష్ణ, కానుగుల రాధాకృష్ణ, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా వందలాది మంది పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జెండా ఊపి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు.*
 *ఖమ్మం, పాలేరు నియోజకర్గాల్లో....*
*ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో శీనన్న పుట్టిన రోజు సంబురాలను కోలాహలంగా నిర్వహించారు. రామన్నపేటలో బండి మనోజ్ ఆధ్వర్యంలో బొమ్మస్వామి గుడి వద్ద రక్తదాన శిబిరాన్ని, దానవాయిగూడెంలో చల్లా కృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం కైకొండాయిగూడెంలో నాగటి ఉపేందర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాలను చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని, రాజీవ్ గృహకల్పలో రూరల్ మండల కమిటీ, పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా మిషనరీ చారిటీలో అన్నదాన కార్యక్రమం జరిపారు. ఖమ్మంలోని జీవన సంధ్యా వృద్ధాశ్రమం, అన్నం ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. బోనకల్, ముదిగొండ మండలాల్లోనూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కల్లూరు మండలం నారాయణపురంలో పొంగులేటి నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ, పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ముగింపు రోజున విజేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.*

Wednesday, 23 October 2024

*ఖమ్మంలో 16వ అన్న ప్రసాద వితరణ*. *మాలదారుల ఆనందం**శరణు ఘోషతో* *మారుమోగుతున్న**అన్న ప్రసాద వేదిక*


*ఖమ్మం : వీడియోస్ కాలనీ వెంకటేశ్వర థియేటర్ ఏరియాలోని గురుస్వామి రాంప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న ప్రసాద వేదిక ప్రతిరోజు శరణు ఘోషతో మారుమోగుతోంది వేలాదిమంది అయ్యప్పలు అన్న ప్రసాదం స్వీకరించి ఆనందంతో అన్నదాత సుఖీభవ అంటుండగా. తిన్నదాతా జాయిభవ అంటూ వితరణ చేసిన వారు మారు పలుకుతున్నారు*
*అన్న ప్రసాద వితరణ అంటే అది ఒక మహాయోగం ఆ యోగంలో తరించిన వారిలో ఆధ్యులు డొక్కా సీతమ్మ గారు ఇంకా జిల్లెల్లముడి అమ్మగారు మరెందరో .. అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ అన్న వితరణ వేదిక మారుమోగుతుండగా అన్నపూర్ణమ్మ కృప కోసం కృషి చేసే వారు అనేకులు వారు ఎందరో..సమర్పణ చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. మీ భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా  ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నసమర్పణతో శరీరం తిరిగి ఉత్తేజితంగా మారి దైవీక కార్యక్రమాలకు సన్నద్ధం అవుతుంది చేస్తే. తిన్నవారు అన్నదాత సుఖీభవ అంటూ అన్న ప్రసాద వితరణ చేసిన వారిని కొనియాడుతారు.. అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ మనం నిత్యం ప్రార్థించే అమ్మ అన్నపూర్ణమ్మ సైతం అన్న సంతర్పణ చూసి *అత్యంత ఆనందం చెందుతుంది.* 
*మాలధారణం నియమాల తోరణం మనిషి ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఆధ్యాత్మికం దైవికం గా సంక్రమించే ఒక మార్గం దేవుని అనుమతి లేనిదే ఏ వ్యక్తి కూడా* *ఆ మార్గాన్ని అనుసరించలేడు అలా అనుసరించే వారిలో ఖమ్మం అయ్యప్పలు ఎందరో వారికి అన్న సంతర్పణ చేయడానికి పూనుకొని గత 16 సంవత్సరాలుగా భక్తి భావంతో మహా మహా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి..*
*ఈ గురు స్వామి మరి కొందరు స్వాములతో మమేకమై గత 16 సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధారణ వేసుకున్న స్వాములకు ఖమ్మంలోని వీడియోస్ కాలనీలో గల పాత వెంకటేశ్వర థియేటర్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేలాది అయ్యప్పలు మాల ధారణ కాలంలో వీరి అన్న సంతర్పణలో సంతృప్తిగా భుజిస్తూ స్వామి శరణం అంటూ సాగుతున్నారు. అక్టోబర్ నవంబర్ జనవరి మాసాల్లో దాదాపు 100 రోజులు ఈ అన్న సందర్భంగా ఎటువంటి" *ఆటంకం లేకుండా సాగిస్తున్నారు రాంప్రసాద్ గురుస్వామి ఈ స్వామికి మరికొందరు స్వాములు ఆర్థికంగానూ.. సేవ పరంగాను వారి యొక్క చేయూతను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగించడంలో ఎందరో సహకారం ఉందని వారందరికీ తన ధన్యవాదాలు అయ్యప్ప ఆశీస్సులు ఉంటాయని రాంప్రసాద్ గురుస్వామి పేర్కొన్నారు ..*
*అయ్యప్పల రక్తదానం..*
*మాధవ సేవ తోపాటు మానవ సేవ అన్నట్లుగా ఈ ఏడాది కొందరు స్వాములు రక్తదానం కార్యక్రమం చేపట్టి దాన్ని* *విజయవంతం చేశారు. స్వాములే కాకుండా ఇతరులు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని రక్త దాతలుగా నిలిచారు. వీరిలో కొందరు రక్తదానం అనంతరం మాల ధారణ చేయడం విశేషం.*

ఈ నెల 25న ఖమ్మం రానున్న గవర్నర్.. ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ శ్రీజ సమీక్ష....


ఖమ్మం : ఈ నెల 25న జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటిస్తారని, పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర స్థాయిలో భారత రాష్ట్రపతి ప్రతినిధి అని, ప్రోటోకాల్ పరంగా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.ఈ నెల 25న మధ్యాహ్నం ఎన్ఎస్పి గెస్ట్ హౌజ్ చేరుకొని, మధ్యాహ్నం 2.00 గంటలకు కలెక్టరేట్ చేరుకుంటారని, గంటపాటు జిల్లా అధికారులతో ఇంటరాక్ట్ అవుతారని, మ. 3.00 గంటల నుండి ప్రసిద్ధ కవులు, కళాకారులు, రాష్ట్ర, కేంద్ర అవార్డు గ్రహీతలతో ఇంటరాక్ట్ అవుతారని, సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారని అదనపు కలెక్టర్ అన్నారు.
జిల్లా అధికారులతో ఇంటరాక్ట్ సందర్భంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక చక్కటి పిపిటి రూపకల్పన చేయాలని, ఇందుకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం లోగా తమ తమ శాఖలకు సంబంధించి స్లైడ్స్ పంపాలన్నారు. అధికారులు తమ శాఖల కార్యకలాపాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖలకు సంబంధించి స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు, కాన్వాయ్ లో అంబులెన్స్ ప్రోటోకాల్  తో ఉండాలని, జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Monday, 21 October 2024

దక్షణ కొరియాలో మంత్రి పొంగులేటి బిజీ బిజీ.. .. సుందరీకరించిన నదుల పరిశీలన..


*దక్షణ కొరియా లో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*మూసీ నది సుందరీకరణ కోసం దక్షిణకొరియా లో నదులను పరిశీలించారు .పొంగులేటి శ్రీనివాసరెడ్డి బృందం..మూడు నదులను పరిశీలించి వాటి నిర్వహణ గురించి అక్కడ అధికారులను అడిగితెలుసుకోనున్న మంత్రి బృందం..*మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తో పటు తెలంగాణ మీడియా విలేకరులు కూడా ప్రాజెక్టు స్టడీ చేశారు

దేశం ఏదైనా ఎన్నికల ప్రచారంలో ఫాస్ట్ ఫుడ్ ఎజెండా వుండాల్సిందే... ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసిన బోనాలు ట్రంప్....

ఎన్నికల ప్రచారం అంటే భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఇడ్లీల బండ్ల దగ్గర టీ కోట్ల దగ్గర పకోడీలు వేసే ప్రాంతాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించడం మనకు తెలిసిందే అమెరికాలో సైతం ఇటువంటి ప్రచారానికే అభ్యర్థులు మొగ్గుచూపుతున్నారు..అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ .. పెన్సిల్ వేనియాలోని ప్రఖ్యాత మేక్ డోనాల్డ్స్ రెస్టారెంట్లో ఒకరోజు పని చేశారు.. ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ ఫ్రైస్ ను తయారుచేసి కస్టమర్లకు పార్సిల్ చేసి సర్వ్ చేశారు విమల హరీష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను కాలేజీ రోజుల్లో చైనా రెస్టారెంట్లో పని చేసినట్లు చెప్పారు.
దీంతో ట్రంప్ రెస్టారెంట్లో పని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల ట్రంప్ ప్రత్యర్థి అభ్యర్థి విమల హరీష్ తన ప్రచారంలో తాను కాలేజీ రోజుల్లో చైనా రెస్టారెంట్లో పని చేశానని పేర్కొనడంతో ట్రంప్ ఇలా మెక్డోనాల్డ్స్ లో పనిచే చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు
మొత్తానికి మారింది దేశాలు వాతావరణమే తప్ప ప్రచారంలో మాత్రం అభ్యర్థులు ఎంపిక చేసుకున్న తీరు ఒకటే అనేది నూరు రూపాయడాలర్ల విషయం..

*పోలీసు అమరవీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువ పోలీసులు సమాజ సేవలో ముందుండాలి*... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*



ఖమ్మం : పోలీసు అమరవీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువ పోలీసులు శాంతి సమాజ స్ధాపన కోసం, సమాజ సేవలో ముందుండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా పోలీస్ యంత్రాంగం సోమవారం ఘనంగా నివాళులర్పించింది. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పెరేడ్‌ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. తొలుత, అమర వీరుల స్మృత్యర్థం సాయుధ బలగాలు పెరేడ్, గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అనంతరం పోలీసు ఆయుధాలు కిందకు దింపి వందనం చేసి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. గార్డ్ ఆఫ్ హానర్ పెరేడ్ ఇన్చార్జిగా ఆర్ఐ శ్రీశైలం  వ్యవహరించారు. 
దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధినిర్వహణలో అసువులు బాసిన 214 మంది అమర వీరుల పేర్లను అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ నరేష్ కుమార్ చదివి వినిపించారు. 
పోలీసు అమర వీరులకు నివాళులర్పించేందుకు  వచ్చిన వారి కుటుంబీకులు, బంధువులు స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించే సమయంలో.. తమ వారిని స్మరించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీసు అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.ప్రస్తుత పరిస్థితులలో జిల్లాలో అధికార యంత్రాంగం ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నరంటే అనాటి పోలీసు త్యాగాల ఫలితంగానే అన్నారు.ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలను నిష్పక్షపతంగా అమలు చేయడంలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తారని, ప్రజాస్వామ్య దేశానికి ఇది చాల కీలకమని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని అన్నారు.కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నా రన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నామని, వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలను అంకిత చేశారని అన్నారు.అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబీకులతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ మాట్లాడారు. ఏదైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అక్టోబర్‌ 25 & 27న సైకిల్ ర్యాలీ, 26వ తేదీన రక్తదానం శిభిరం, 27వ తేదీన పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు , 28 వ తేదీన విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీల అవగాహన కార్యక్రమాలు, 29 వ తేదీన ఆన్‌లైన్ ఓపెన్ హౌస్,  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ (లా&ఆర్డర్) ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయ్ బాబు, ఏసీపీలు వేంకటేశ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రఘు, సాంబరాజు,రవి, మల్లయ్య, నర్సయ్య, ఆర్ ఐలు కామరాజు,శ్రీశైలం, సురేష్, అప్పలనాయుడు, సిఐలు ఉదయ్ కుమార్,బాలకృష్ణ, రమేష్, భానుప్రకాశ్, సాగర్, రాజు, తిరుపతి, కిరణ్ కుమార్, రాజిరెడ్డి, రామకృష్ణ, సతీష్, మోహన్ బాబు, హనుక్, స్వామి, తదితరులు  పాల్గొన్నారు.

Sunday, 20 October 2024

కన్నవారిని కష్టపెడితే మూల్యం చెల్లించుకోక తప్పదు

*తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు*

*6 ఎకరాల భూమిని తిరిగి తండ్రి పేరిట మార్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్*

*తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రకటన*

ధర్మారం(పెద్దపల్లి): వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎక రాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే కొంతకాలంగా తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసేందుకు దరఖాస్తు సమర్పించారు. ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరువ ర్గాలకు నోటీసులు జారీ చేసి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ నిర్ధారిం చారు. దీంతో వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించారు. అలాగే తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామి రెడ్డి, కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత సంతానంపై ఉంటుంద ని.. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుం టామని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Wednesday, 16 October 2024

*బీజేపీ 'యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్' ప్రారంభం.. మొదటి క్రియాశీల సభ్యుడిగా మోడీ*


ఢిల్లీ: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి.. అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.
దీని తర్వాత వచ్చిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను మంచి ఫలితాలను సాధించిన బీజేపీ.. దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.. ఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బీజేపీ 'యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ పార్టీ యొక్క మొదటి క్రియాశీల సభ్యుడిగా మారారు. అనంతరం నేటి నుంచే దేశవ్యాప్తంగా ఈ 'యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్' పెద్దఎత్తున నిర్వహించేందుకు బీజేపీ సిద్దం అయింది.

Tuesday, 15 October 2024

నమస్కారం, బాగున్నారా, నేను మీ జిల్లా కలెక్టర్ ని.. ఆటోస్టాండ్ లో ఖమ్మం కలెక్టర్... సమస్యలు ఉంటే నేరుగా కలెక్టరేట్ కు రండి అంటూ భరోసా

-
నమస్కారం, బాగున్నారా, నేను మీ జిల్లా కలెక్టర్ ని, ఎలా నడుస్తున్నది వ్యాపారం, ఇక్కడి నుండి ఎక్కడి వరకు ఆటో నడుపుతారంటూ జిల్లా కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్ ఆటో డ్రైవర్ లు, ఫుట్ వేర్ యజమాని వద్దకు వెళ్లి వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఖమ్మం బస్ స్టాండ్ కు ఆనుకొని షాదీఖాన వెళ్ళే రోడ్డులో ఉన్న ఫుట్ వేర్ షాప్ లోకి  కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా వెళ్లి వ్యాపారం ఎలా నడుస్తున్నది, రోజువారీ సంపాదన, కుటుంబ పోషణ, పిల్లల చదువు నేపథ్యం మొదలగు వివరాలను షాప్ యజమాని సయ్యద్ బిలాల్ పాషా తో మాట్లాడి తెలుసుకున్నారు. వ్యాపార నిమిత్తం చెప్పుల స్టాక్ ఎక్కడి నుండి తెస్తారు, దానికి పెట్టుబడి ఎలా వస్తుంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారాలు చేసే వారి కోసం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా, అలాగే ముద్ర పథకం ద్వారా తక్కువ వడ్డీతో పెట్టుబడి కోసం రుణాలు పొందవచ్చని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  
తర్వాత బస్టాండ్ సిగ్నల్ ప్రాంతం మూల మీద ఆగి ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వెళ్లి ఆటో డ్రైవర్ లతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ లు రోజుకు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబ పోషణకు సరిపోతున్నాయా, ఆటో సొంతందా , కిరాయికి తెచ్చుకున్నారా వంటి వివరాలు తెలుసుకున్నారు. 
*జిల్లా కలెక్టర్ గా మీరే మా వద్దకే వచ్చి మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం చాలా సంతోషంగా ఉందని* ఆటో డ్రైవర్ లు తెలిపి, ఖమ్మం నగరంలో 3 వేల వరకు ఆటోలు ఉంటాయని, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆటో అడ్డాలు పెంచాలని ,  వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ ను కోరారు. 
ఖమ్మం జిల్లాలో పని చేసే మున్సిపల్ కార్మికులు, పంచాయతీ వర్కర్లకు ఇటీవల ఇన్సూరెన్స్ కల్పించామని, ఆటో డ్రైవర్ లు ప్రతి సంవత్సరం ఆర్.టి.ఓ. దగ్గర రెన్యువల్  చేసే సమయంలో కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తే, ఆటో డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని, దీనిపై త్వరలో జిల్లా స్థాయి ఆటోల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో చర్చిస్తామని కలెక్టర్ తెలిపారు.ఆటో అడ్డాల దగ్గర త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ లు మా పిల్లలు  ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో చదువు తున్నారని తెలుపగా, గురుకులాలలో, ప్రభుత్వ బడులలో పిల్లలు ఎలా చదువుతున్నారు, టీచర్లు జవాబుదారీ తనంతో ఉన్నారా, పేరెంట్ టీచర్స్ మీటింగ్ లకు  హాజరవుతున్నారా వంటి వివరాలు కలెక్టర్ ఆరా తీశారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ లకు రెగ్యులర్ గా హాజరు కావాలని, ప్రభుత్వ బడులలో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు.జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుంది, ఆటో డ్రైవర్లు వెళ్లినప్పుడు అవసరమైన మందులు ఇచ్చారా వంటి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ లకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తనను కలెక్టరేట్ కు వచ్చి కలవాలని, సమస్యల పరిష్కారానికి వీలైనంతవరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

Monday, 14 October 2024

*పద్మశ్రీ మొగులయ్య గోడ కూలగొట్టిన దుండగులు అండగా వుంటానన్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు



పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు‌. విషయం తెలుసుకున్న మొగిలయ్య రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును  ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో  కలిసి సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన సిపి సుధీర స్థల పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని అతనికి హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, భాగ్ హయత్ నగర్ సర్వే నెం.159 లో 600 గజాల భూమిని మంజూరు చేయడం జరిగింది. మొగులయ్య సదరు ఫ్లాట్ కు చుట్టూ ఫ్రీ కాస్ట్ గోడ నిర్మించుకున్నారు.  11.10.2024 తేదీన ఉదయం 08:00 గంటల సమయంలో మొగులయ్య  తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసేసరికి ఉత్తరం వైపు ఉన్న ఫ్రీ కాస్ట్ గోడ  కూల గొట్టబడి ఉండటాన్ని గమనించారు.  హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్  సుధీర్ బాబు ఐపియస్ ని మొగులయ్య ఈరోజు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. తను మరల ఫ్రీ కాస్ట్ గోడ పునర్ నిర్మించుకొనుటకు తగిన తోడ్పాటు  అందించాలని కోరగా.. మొగులయ్య  నుండి వివరాలు cp సుధీర్ బాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొగులయ్య స్థలం పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని ఈ కేసులో తదుపరి విచారణ చేసి నేరస్థులను గుర్తించి  చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హామీ ఇచ్చారని మొగిలయ్యే పేర్కొన్నారు. ఆనంతరం కమీషనర్ మొగులయ్యని గౌరవ పూర్వకంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్, హయత్ నగర్ సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Sunday, 13 October 2024

చెత్త కుండీలో ఆడ బిడ్డ... ఆ దుర్గమ్మే అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సై....

లఖ్‌నవూ: ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతారు. ఆదిపరాశక్తిగా పూజిస్తారు. కానీ భూమ్మీద అడుగుపెట్టిన ఆ పసికందుకు చెత్తకుప్పే దిక్కైంది. తల్లి దగ్గర హాయిగా నిద్రించాల్సిన ఆ బిడ్డ.. వ్యర్ధాల మధ్య గుక్కపట్టి ఏడుస్తోంది. చిన్నారి ఏడుపులను విన్న స్థానికుల సమాచారంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో వెలుగు చూసిన మరో మానవీయ కోణం చూపరుల మనసులను కరిగించింది.పోలీసుల సంరక్షణలో ఉన్న చిన్నారి కుటుంబీకుల ఆచూకీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి వివరాలు తెలియరాలేదు. దీంతో చిన్నారి పరిస్థితిని చూసి..చలించిన సబ్-ఇన్‌స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ దంపతులు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సింగ్ మాట్లాడుతూ 2018లో తమకు వివాహం అయినా ఇప్పటికీ పిల్లలు లేరని.. విజయ దశమి నాడు స్వయంగా దుర్గమ్మే ఈ చిన్నారి రూపంలో తమ ఇంటికి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు

అర్ధరాత్రి 12 గంటలకు నోయిడా వీధుల్లో యువకుడి పరుగు... లక్ష్యసాధనకు తప్పదంటూ జవాబు

#ప్రదీప్‌_మెహ్రా  ఇతని గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

స్కూల్‌కు ఏసి బస్‌.
అడిగిన వెంటనే షూస్‌.
కోరిన సీట్‌ రాకపోయినా డొనేషన్‌ సీట్‌.
ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌.
పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి?*
కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి ?
కష్టాలను ఎదుర్కొనడమూ, ప్రతికూలతను జయించడమూ జీవితమే" అని ఎప్పుడు తెలుసుకోవాలి.
పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా?
నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి.. మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
ముందు ప్రదీప్‌ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం.

మొన్నటి శనివారం రోజు.
 అర్ధరాత్రి.. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్‌ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు.* *అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్‌ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్‌ చేశాడు.

👉 *'ఎందుకు పరిగెడుతున్నావ్‌?'*
*🏃‍♂️'వ్యాయామం కోసం'*
🌹 *'ఈ టైమ్‌లోనే ఎందుకు?'*
🏃‍♂️ *'నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను'*
🌹 *'నీ రూమ్‌ ఎంతదూరం?'*
🏃‍♂️ *'10 కిలోమీటర్లు ఉంటుంది'*
🌹 *'అంత దూరమా? కారెక్కు. దింపుతాను'*
🏃‍♂️ *'వద్దు. నా ప్రాక్టీసు పోతుంది'*
🌹 *ఇంతకీ ఎందుకు వ్యాయామం?'*
🕴️ *'ఆర్మీలో చేరడానికి'*

ఆ సమాధానంతో వినోద్‌ కాప్రి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్‌ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్‌ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్‌ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్‌ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. 'కనీసం కలిసి భోం చేద్దాం రా' అని వినోద్‌ కాప్రి అడిగితే ప్రదీప్‌ మెహ్రా చెప్పిన జవాబు 'వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్‌ డ్యూటీ' అన్నాడు.

వినోద్‌ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్‌ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్‌ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్‌ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ పంపించాడు. ఆనంద్‌ మహీంద్ర అయితే 'ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు' అని ట్వీట్‌ చేశాడు. 'ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది.
                 
👉 ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
Satya Vara Prasad 

🎁 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్‌ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.

🎁 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్‌ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్‌ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్‌ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు.

🎁 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం.

🎁 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్‌ స్టార్‌ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్‌ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని 'నన్ను డిస్ట్రబ్‌ చేయకండి. పని చేసుకోనివ్వండి' అన్నాడు ప్రదీప్‌.

🎁 5. కష్టేఫలీ: 'మిడ్‌నైట్‌ రన్నర్‌'గా కొత్త హోదా పొందాక 'నువ్వు ఇచ్చే సందేశం' అని అడిగితే 'కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది' అని జవాబు చెప్పాడు.

👉 పిల్లలను పూర్తి కంఫర్ట్‌ జోన్‌లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్‌ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు.

Saturday, 12 October 2024

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం..టీటీడి ఏర్పాట్లపై భ‌క్తుల సంతృప్తి...టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు




      శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి ఆసౌక‌ర్యాం క‌లుగ‌కుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించిట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్య వేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌక‌ర్య‌ల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు.తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ,బ్ర‌హ్మోత్స‌వాల్లో అక్టోబ‌రు 4 నుండి 11వ తేదీ వ‌ర‌కు (8 రోజులు) న‌మోదైన వివ‌రాలు
శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ముఖ్యాంశాలు
- ముఖ్య‌మంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు అక్టోబ‌రు 4వ తేదీన శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.
-అక్టోబ‌రు 5వ తేదీ పాంచ‌జ‌న్యం విశ్రాంతి భ‌వ‌నం వెనుక వైపున రూ. 13.45 కోట్ల‌తో నూత‌నంగా నిర్మించిన వ‌కుళమాతా వంట‌శాల‌ను ప్రారంభించారు.

శ్రీవారి ఆలయం :
-  6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
-  15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు విక్షించారు.
- గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
- 7 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌.
- విక్రయించిన మొత్తం లడ్డూలు 30 లక్షలు.
- హుండీ కానుక‌లు రూ.26 కోట్లు.
- తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు.
- భ‌క్తుల‌కు 32,713 గ‌దుల కేటాయించాం.
- బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం.
-  క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద వివిధ విభాగాల ద్వారా ఏర్పాటు చేసిన ఫ‌ల పుష్ప ప్ర‌ద‌ర్శ‌న నాడు -నేడు కాన్సెప్ట్‌తో ఫోటో ఎగ్జిబిష‌న్‌, అట‌వీ, శిల్ప క‌ళాశాల‌ల‌చే ఏర్పాటు చేసిన‌ ఎగ్జిబిష‌న్లు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి.
 - తిరుమ‌ల‌లో ప‌లు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్ల‌తోపాటు, 32  పెద్ద డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు. ఇందులో నాలుగు మాడ వీధుల‌లో 23, ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో 9, ప్ర‌త్యేకంగా తిరుప‌తిలో 7 డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు చేశాం.

అన్నప్రసాదం :
- బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.
- గరుడసేవనాడు 8.71 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 ల‌క్ష‌ల తాగునీరు బాటిళ్ళు, స్నాక్స్‌గా సుండ‌లు, బిస్కెట్లు అందించడం జరిగింది.

వైద్యం :
-  45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్‌ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించడమైనది.
- 68 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు.

ఆరోగ్య విభాగం :
- తిరుమ‌ల‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1365 మంది సిబ్బంది, గ‌రుడ సేవ రోజు అద‌నంగా 600 మంది సిబ్బంది ఏర్పాటు.

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టులు :
- హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి వ‌చ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించారు. వాహ‌న సేవ‌ల‌తో పాటు తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భ‌క్తులు ఎంతో సంతోషించారు.

ఉద్యానవన విభాగం :
- శ్రీవారి ఆలయంతో పాటు ప‌లు కూడ‌ళ్ళు, అతిథి గృహాల వ‌ద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శన.
-  బ్ర‌హ్మోత్స‌వాల‌లో 40టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం.

ప్రజాసంబంధాల విభాగం :
- రాంభగీచా-2లో మీడియా సెంటర్, క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద నాడు - నేడు ఫొటో ఎగ్జిబిష‌న్‌ ఏర్పాటు.
- దాదాపు 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 4 వేల‌ మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.
- గ‌తంలో ఉన్న 5 స‌మాచార కేంద్రాల‌తో పాటు తిరుమ‌ల‌లో మ‌రో 5 స‌మాచార కేంద్రాలు, తిరుప‌తిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశాం.
-  అదేవిధంగా భ‌క్తుల‌కు విరివిగా స‌మాచారం ఇచ్చేందుకు శ్రీ‌వారి సేవ‌కుల స‌హ‌కారంతో దాదాపు 11 ప్రాంతాల‌లో మే ఐ హెల్ప్ యు కౌంట‌ర్ల‌ను నిర్వ‌హించాం.
-  టీటీడీ కాల్ సెంట‌ర్, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, స‌మాచార కేంద్రాలు, మీడియా, శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ వారికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాం.
-  తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రోక ప్రాంతానికి ఉచితంగా ర‌వాణా చేసేందుకు 14 ధ‌ర్మ ర‌థాల‌ను ఏర్పాటు చేశాం.
ఎపిఎస్‌ఆర్‌టిసి :-   9.53 ల‌క్ష‌ల మంది ఎపిఎస్‌ఆర్‌టిసి ద్వారా తిరుమ‌ల‌కు రాక పోక‌లు సాగించారు.
-     గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను చేరవేశాయి.
- బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో పాలుపంచుకున్న అర్చ‌క స్వాములు, అధికారులు, సిబ్బంది, క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులు, ఎన్‌సిసి విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.
-  అలాగే, బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.
-  బ్ర‌హ్మోత్స‌వాల వైభ‌వాన్ని భ‌క్తుల‌కు చేరువ చేసిన మీడియా మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.


Friday, 11 October 2024

తండ్రిని పట్టించుకోని కొడుకు.... డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు....

ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు.. వారిద్దరి చూసి తెగ మురిసిపోయేవాడు. తన జీవితం రాజ భోగంగా ఉంటుందని భావించాడు. వారిద్దరు పెద్దవాళ్లయ్యారు..
పెళ్లి చేశాడు. ఇంతలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇంటిని పెద్ద కొడుకు తన భార్య పేరిట రాయించుకున్నాడు.చివరకు ఆ తండ్రిని రోడ్డు మీదకు గెంత్తేశారు కొడుకులిద్దరు. రోడ్డుపై భిక్షాటన చేస్తూ కడుపు నింపుకునేవాడు. ఈ విషయం ఆయన ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాడు పెద్దాయన. రంగంలోకి దిగిన అధికారులు, ఆ కొడుకులిద్దరికీ ఊహించని ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది? .సిరిసిల్లకు చెందిన అదువాల రాజమల్లుకు ఇద్దరు కొడుకులు. ఒకరు అనిల్‌కుమార్ కాగా, మరొకరు సురేశ్. ఈ ఫ్యామిలీకి రెండేళ్ల కిందట గత ప్రభుత్వం తంగళ్లపల్లి మండలంలో డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించింది. ఇంతవరకు బాగానే సాగింది. ఇక్కడే అసలు కథ మొదలైంది.కొడుకుల మైండ్‌లో ఏం ఆలోచన వచ్చిందో తెలీదు. ఆ ఇంటిని రాజమల్లు పేరున ఇవ్వాల్సి ఉండగా పెద్ద కొడుకు అనిల్‌కుమార్ తన భార్య పేరిట రాయించుకున్నాడు. చివరకు కన్నతండ్రి ఇంట్లో నుంచి బయటకు గెంత్తేశారు.తొలుత ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లాడు రాజమల్లు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పెద్దాయన రోడ్లపై భిక్షాటన చేసి కడుపు నింపుకునేవాడు. ఈ వ్యవహారంపై అధికారులు అంతర్గతంగా విచారణ  చేపట్టారు.
తంగల్లపల్లి ఎమ్మార్వో పూర్తి స్థాయి విచారణ చేసి ఆర్డీవో రమేశ్‌కు నివేదిక ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎమ్మార్వో, ఆర్డీఓలు నేరుగా రాజమల్లు ఇంటికి వెళ్లారు. వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలని ఆదేశించారు ఆర్డీఓ. అంతేకాదు కొడుకులిద్దరూ ప్రతీ నెల రెండు వేలు చొప్పున చెల్లించాలన్నది ప్రధాన పాయింట్.డబుల్ బెడ్రూమ్ ఇంటిని రాజమల్లు పేరున మార్చాలని తహసీల్దారు ఆదేశించారు. కొడుకు అనిల్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన అధికారులకు రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో రమేష్ అన్నారు.

వేడుకగా తిరుమలేశుని రథోత్సవం... భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు.... భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు...

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

మానవతా విలువల శ్రీమంతుడా వీడుకోలు...

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం

డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.  కారణం ఆ నాల్గవ వ్యక్తి #రతన_టాటా.  '' సార్ , మీరు ? '' '' అవును ,  మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? ''  అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ] 
TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ! 

బాల్యంలో  ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది. 

యవ్వనంలో ఆయన girl friend  మోసం చేసింది. 

ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి. 

కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. #TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది : 

టాటా సంస్థ అయిన #TCS  యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.  

భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది. 

ప్రతి ఏటా  అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]  

నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క #TajHotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ]  ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి  ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన  , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ  బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే  ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం ,  పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ]  నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు :  Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.  నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో ''  దేశాన్ని సేవిస్తున్నాడు.అలాంటి మహనీయుడు ఈరోజు మనమధ్యలో లేకపోవడం శోచనీయం 
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 
ఓం శాంతి శాంతి శాంతి 🙏
సేకరణ సోషల్ మీడియా

Wednesday, 9 October 2024

*రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్‌ అరెస్ట్‌*


సూర్యాపేట : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు.ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. 
కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. 
ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్‌, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్‌కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు



ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా వచ్చి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఏ.పి సీఎం చంద్రబాబు.      ఈ సందర్భంగా స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ  చంద్రబాబు తలకు పరివేష్టం చుట్టి  పట్టువస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై ఉంచారు. అనంతరం కనకదుర్గమ్మ గర్బాలయంలో తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం  చంద్రబాబు కుటుంబానికి ఆలయ ఈవో రామారావు నేతృత్వంలో  అర్చకులు వేద ఆశీర్వచనం అందించి  తీర్థప్రసాదాలు అందజేశారు. 
అనంతరం ఆయన మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా   ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా వచ్చి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్న అన్నారు దుర్గమ్మ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టం. లక్షల మంది భక్తులు ఎంతో నమ్మకంతో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
చెడుని జయించటమే కాదు, మంచి పనులను ఆశీర్వదించాలని దుర్గమ్మను కోరుకున్నానన్నారు. దుర్గమ్మ దయ వల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి.  అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తవ్వాలి. రాష్ట్ర ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాల చంద్రబాబు ఆకాంక్షించారు.దుర్గగుడి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెప్పారంటూ ఎందుకు కృషిచేసిన అధికారులని, ప్రజాప్రతినిధులని అభినందించారు.దేవాలయాల్లో పవిత్రతను అందరం కాపాడుకోవాలని. సేవా కమిటీ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్నాం. దుర్గగుడి పాలకమండలి సభ్యులకు అభినందనలు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించారని పేరుపేరునా అందర్నీ అభినందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

హనుమంత వాహనంపై శ్రీరామునిగా మలయప్ప

 తిరుమల: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
` *హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి* 
హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.

ఆత్మ చైతన్యాన్ని కలుగజేసే సరస్వతి అవతారంలో బెజవాడ కనకదుర్గమ్మ

దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలని అనుసరించి, ఏడోవ రోజున సరస్వతీ అలంకారంలో అమ్మవారి దర్శనం...🥥🙏🏼 
‘‘విద్యారూపా .. విశాలాక్షి బ్రహ్మజాయా మహాఫలా
త్రయా మూర్తిః త్రికాలజ్ఞా త్రిగుణా - శాస్తర్రూపిణీ’’ అని హంసవాహిని శ్ేవతవస్త్రాలంకారణి అయన సరస్వతీ దేవిని జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. ‘వాగ్భూషణమ్ భూషణమ్’- మానవునకు ‘మంచి మాటే’ అలంకారము కనుక ఆ వాక్కును ప్రసాదించే దేవతగా సరస్వతీదేవిని నవరాత్రులలో పూజించడం అనాదిగా వస్తోంది. సకలబుద్ధులను ప్రకాశింపచేసే దేవతే సరస్వతి అని యజుర్వేదం కూడా చెప్తుంది.
అసలు ‘‘యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా... నమసె్తైసె్తై నమసె్తైసె్తై నమస్తసె్తై నమో నమః ‘శక్తి’ అనే పదం స్ర్తిలింగం కనుక అమ్మ అని పిలుస్తున్నాం. ఆ అమ్మ స్వయం పోషక పదార్థాలలో ఉద్భవించింది. కనుక బిడ్డ పుట్టగానే ఆహారాన్ని అందిస్తుంది. ఆ అమ్మనే కట్టకడదాకా తోడునీడగా వుండి వివేకవిచక్షణాలను కలిగిస్తుంది కనుకనే ఆ శక్తి స్వరూపిణినే సరస్వతీగా భావించి పూజించడం నవరాత్రుల్లో భాగమైంది.
బ్రహ్మకు ఇల్లాలు, సర్వులకు జ్ఞానాన్ని ప్రసాదించే శారదాదేవినే ‘వాగ్దేవి’గా పూజిస్తారు. ఈ తల్లి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో వివరించి ఉన్నారు. ‘సరస్వతీ రహస్యోపనిషత్’ ద్వారా అశ్వలాయనుడు సరస్వతీ కటాక్షంతో పొందిన అపార జ్ఞానసంపద వివరణతో సరస్వతిని ఉపాసిస్తుంటారు. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి ‘సరస్వతి’కనుక ‘శ్రీపంచమి తోపాటు నవరాత్రుల్లోనూ విశేషంగా ఈ తల్లిని అర్చించి ఆమె కృపకు పాత్రులవుతారు బుద్ధిని, విద్యను, జ్ఞానమును, వివేచనాశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని ధారణా శక్తిని అనుగ్రహించే సరస్వతీ దేవిని వసంతపంచమి నాడు పూజించిన వారికి కరతలామలకంగా ఏ విద్యయైనా ఒనగూడుతుందని అంటారు. యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు వాణీస్తోత్రం, వశిష్ఠ స్తోత్రాల్లో ఈ తల్లి ని ఏవిధంగా పూజించాలో వివరించి ఉన్నారు.
ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను పద్మంలో ఆసీనురాలై ఉండే దేవతనే సరస్వతీ దేవి. వేదవ్యాసులు కూడా ఈ తల్లి చలువ వల్లనే రచనాభాండాగారాన్ని నింపాడని పురాణోక్తి. జ్ఞాన ఐశ్వర్యాలను ప్రసాదించే అమ్మలను కొలువై ఉండేటట్టు అనుగ్రహించిన వేద వ్యాసులను ఇక్కడ పూజించుకునే ఏర్పాటు చేశారు. నవరాత్రి పూజోత్సవాలే కాక మాఘశుద్ధ పంచమినాడు వసంత పంచమి పేరిట విశేష అర్చనలు చేస్తారు. . ధర్మాధర్మ విచక్షణాజ్ఞానాన్ని పొందాలనే అంతరార్థంతో చేసే తారతమ్యభావనలు లేక ప్రజలందరూ నవరాత్రి పర్వదినంలో మూలా నక్షత్రం రోజు శారదా మాతను కొలుస్తారు 
పోతనామాత్యుడూ అమ్మను పూజించిన తరువాతే భాగవతరచన ఉపక్రమించినట్లు చరిత్ర చెప్తోంది. శుంభనిశుంభరాక్షసులను సంహరించిన వాగ్దేవిగాను సరస్వతీ దేవిని ఆరాధిస్తుంటారు. అజ్ఞానమనే రాక్షససంహారం కావించే దేవిగా భావించి ప్రతి వారు తమకు జ్ఞానజ్యోతులను ప్రసాదించమని ఈ తల్లిని వేడుకుంటారు. ప్రతి మానవుని జీవితంలోను జ్ఞాన ఉద్దీపన జరగాలని కోరుకుంటూ లోకాసమస్తా సుఖినోభవన్తు అందాం.🌹

వీణాపాణి వేద వాణి!
ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి
ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...
వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.
వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.
యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.
ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. 
* ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.

Sunday, 6 October 2024

*ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.. తెలంగాణలో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు*


ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ఆదివారం హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో ఇంగ్లీష్ మీడియం 12 వ తరగతి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, ఇబ్బంది కరమైన వాతావరణంలో విద్య నేర్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు నాడు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యంలో పేద బడుగు బలహీన కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ దేశ చరిత్రలోనే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయా? ఇలా కూడా కట్టొచ్చా? అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పొతున్నామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచాలని ఆలోచన ఉందన్నారు.ప్రస్తుతం 20 నుంచి 22 వరకు స్థలాలు సేకరించి ఆయా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామన్నారు. దసరా పండుగ కంటే ముందే భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, 663 స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు. బీసీలకు 367 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 అద్దె భవనాలు అని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. విజయదశమి ముందు రోజు ఈ నెల 11 వ తేదీన ఆ స్కూళ్లకు ఫౌండేషన్ వేస్తామని చెప్పారు. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Saturday, 5 October 2024

*నాణ్యతకు.. నమ్మకానికి కేరాఫ్ మన GV మాల్..; ;మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.*.సినీ నటి కీర్తీ సురేష్.,

ఖమ్మం: *వస్త్ర వ్యాపార రంగంలో* *నాణ్యతకు..నమ్మకానికి కేరాఫ్  వస్త్ర వ్యాపార సంస్థ* 
*మన GV మాల్ అని ప్రముఖ  సినీ నటి కీర్తీ సురేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.*
*శనివారం ఖమ్మం నగరంలోని జిల్లా కోర్టు సమీపంలో గల నూతన GV మాల్ నూతన  బ్రాంచ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా,  సినీ నటి కీర్తి సురేష్ జ్యోతి ప్రజ్వలన గావించారు..అనంతరం సిని  నటి కీర్తి సురేష్ తమ అభిమానులకు  అభివాదం చేస్తూ  ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు.. ఈసందర్భంగా సీని నటి కీర్తి సురేష్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..*
*GV మాల్ సంస్థ నిర్వాహకులు గుర్రం ఉమామహేశ్వరరావు,* *గుర్రం వాసు ఆద్వర్యంలో* *అట్టహాసంగా నూతన బ్రాంచ్ GV మాల్ ప్రారంభం కావడం *శుభప్రదమని  వారు అన్నారు..*
*GV మాల్ యాజమాన్యం గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం వాసులు*
*ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల, వినియోగదారుల ఆశీర్వాదాలు, మన్ననలను   పొందారని వారు అన్నారు.. ప్రతి రంగంలో పోటీ విధానం* *వుంటుందని, ఇక్కడ ప్రజల మన్ననలు పొందడం సాధారణ విషయం కాదన్నారు. ఈమేరకు* *వినియోగదారులు, ప్రజలు* *హర్షం వ్యక్తం చేశారు..*. 
*అనంతరం GV మాల్* *యాజమాన్యం గుర్రం ఉమా మహేశ్వర రావు, గుర్రం వాసు* *మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆదరాభిమానాలు తమ వ్యాపారంలో పొందాము కాబట్టే వారికి నా నాణ్యతతో కూడిన వస్త్రాలను అతి తక్కువ ధరలో అందించి మరింత ఆదరణ పొందాలి అనేది తమ అభిమతమని వారు ఉన్నారు.*
*ఈకార్యక్రమంలో  నగర మేయర్ నీరజ కార్పొరేటర్ కమర్తపు మురళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..*

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప


      శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.
శ్రీ‌వారి హంస‌ వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం రాత్రి హంస వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 క‌ళాబృందాలు 511 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.తిరుప‌తి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, మహారాష్ట్రకు చెందిన గీతా  బృందం కథక్ నృత్యం ప్రదర్శించారు. కర్నాటకకు చెందిన డాక్టర్ రక్షాకార్తిక్ దీప నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అజయ్ బృందం తప్ప నృత్యంతోను, బెంగళూరుకు చెందిన సుజేంద్ర బాబు బృందం దశావతారం రూపకంతోను అలరించారు.

Thursday, 3 October 2024

పెద్దవ్వకు కలెక్టర్ భోజనం.... అధికారులు పనిచేయండంటూ ముక్తాయింపు..

అది తమిళనాడులోని చిన్నమనై కెన్‌పట్టి అనే ఓ చిన్న ఊరు… పేదరికం తాండవించే ఊరు… ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె… మరీ చిన్న గుడిసె… దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది… ఒకాయన నీలి గళ్ల చొక్క టక్ చేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు… బెల్టు, బూట్లు… కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడే ఓ తడిక తీసుకుని లోపలకు తలవంచి వెళ్లాడు… మసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజుకళ్లతో ఓ ముసలామె కనిపించింది… ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు… ఆమెకు అధికార్లను చూస్తేనే వణుకు… భయంభయంగానే చెప్పింది… ‘అయ్యా, నా పేరు రంగమ్మాళ్… ఆయన పేరు రామన్… మా ఆయన… ఇప్పుడే ఎటో పోయాడు…’ అన్నది బెరుకుబెరుకుగా… ఆమె వయస్సు 80 ఏళ్లు… ఆయన వయస్సు 82… ఏందయ్యా..? అనడిగింది ఆమె ఆ దొరబాబును… ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని, కింద పరుచుకుని కూర్చున్నాడు… పరిచయం చేసుకున్నాడు… ‘అమ్మా, నా పేరు అంబళగన్… నేను ఈ జిల్లాకు కలెక్టర్‌ను…’ అన్నాడు… ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం… ఊళ్లో పట్వారీతో మాట్లాడటానికే ఆమెకు భయం… అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు… ఏం తప్పు జరిగింది..? అవును ఏం తప్పు జరిగింది..? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగుపెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికార్ల దృష్టిలో పెద్ద తప్పు… ఎంతసేపూ ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు…

అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ కింద వెళ్లాడు ఆ కలెక్టర్… మధ్యాహ్నం అయిపోయింది… అధికార్లు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసిపెట్టారు… కానీ అవన్నీ రిఫ్యూజ్ చేసి, ఇదుగో, ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను… చాప మీద బైఠాయించాడు… డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్. ఆ ఊరి పట్వారీ, ఏరియా గిర్దావర్, తాలుకూ తహసిల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు… ఆమె గురించి అడిగాడు… ఇద్దరు కూతుళ్లు… ఎక్కడో ఉంటున్నారు… ఆ గుడిసెలో ఆ ఇద్దరే… జీవనసంధ్యలో ఒకరికొకరు… పనిచేసే బలం లేదు… కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు… వాళ్లో వీళ్లో సాయం చేస్తే మిగతా సరుకులు… అంతే… అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది… చేదునిజం…

‘ఏం వండుకున్నావమ్మా… నాకూ కాస్త పెడతావా..?’ అనడిగాడు ఆ కలెక్టర్…

ఆమె మొహంలో మరింత ఆశ్చర్యం… ‘ఇంకా వండుకోలేదయ్యా..?’ అన్నది… ఏం..? అనడిగాడు కలెక్టర్… ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహం వంక చూస్తుండిపోయింది… కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తాడు క్యారియర్‌లో… డ్రైవర్‌ను కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు… ఆమెను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు… అరిటాకులు పరిచాడు… ఈరోజు నాతో భోజనం చేయి అన్నాడు… ఇదంతా కలా అనుకుంటున్నది ఆమె… అవును మరి, ఆమె ఊహించని, ఊహించలేనిదే కదా అది…

ఆమెతోపాటు భోజనం చేస్తూ అడిగాడు… మీకు వృద్యాప్య పెన్షన్లు వస్తున్నాయా..?

‘లేదయ్యా… ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిపెట్టేవాడు లేడు, మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు’ అన్నది ఉన్నదున్నట్టుగా… బయట నిలబడిన తహసిల్దార్‌ను లోపలకు పిలిచాడు… అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు… ఆమె వేలిముద్ర తీసుకున్నాడు… కింద కలెక్టర్ సంతకం… వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు… ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్… మరి ఆ ముసలాయనకు ఎలా..? ఏ పథకం కింద ఏం ఇవ్వవచ్చో చూసి, తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు… అంతేకాదు… ఆ తాలూకాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించాడు… ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడు… సరేనమ్మా… మా అమ్మతో కూర్చుని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి, వెళ్లిపోయాడు… ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతున్నది… ఈరోజు ఏం జరిగింది…?