ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా వచ్చి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఏ.పి సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ చంద్రబాబు తలకు పరివేష్టం చుట్టి పట్టువస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై ఉంచారు. అనంతరం కనకదుర్గమ్మ గర్బాలయంలో తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం చంద్రబాబు కుటుంబానికి ఆలయ ఈవో రామారావు నేతృత్వంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా వచ్చి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్న అన్నారు దుర్గమ్మ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టం. లక్షల మంది భక్తులు ఎంతో నమ్మకంతో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
చెడుని జయించటమే కాదు, మంచి పనులను ఆశీర్వదించాలని దుర్గమ్మను కోరుకున్నానన్నారు. దుర్గమ్మ దయ వల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తవ్వాలి. రాష్ట్ర ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాల చంద్రబాబు ఆకాంక్షించారు.దుర్గగుడి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెప్పారంటూ ఎందుకు కృషిచేసిన అధికారులని, ప్రజాప్రతినిధులని అభినందించారు.దేవాలయాల్లో పవిత్రతను అందరం కాపాడుకోవాలని. సేవా కమిటీ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్నాం. దుర్గగుడి పాలకమండలి సభ్యులకు అభినందనలు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించారని పేరుపేరునా అందర్నీ అభినందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

No comments:
Post a Comment