Monday, 14 October 2024

*పద్మశ్రీ మొగులయ్య గోడ కూలగొట్టిన దుండగులు అండగా వుంటానన్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు



పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు‌. విషయం తెలుసుకున్న మొగిలయ్య రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును  ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో  కలిసి సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన సిపి సుధీర స్థల పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని అతనికి హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, భాగ్ హయత్ నగర్ సర్వే నెం.159 లో 600 గజాల భూమిని మంజూరు చేయడం జరిగింది. మొగులయ్య సదరు ఫ్లాట్ కు చుట్టూ ఫ్రీ కాస్ట్ గోడ నిర్మించుకున్నారు.  11.10.2024 తేదీన ఉదయం 08:00 గంటల సమయంలో మొగులయ్య  తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసేసరికి ఉత్తరం వైపు ఉన్న ఫ్రీ కాస్ట్ గోడ  కూల గొట్టబడి ఉండటాన్ని గమనించారు.  హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్  సుధీర్ బాబు ఐపియస్ ని మొగులయ్య ఈరోజు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. తను మరల ఫ్రీ కాస్ట్ గోడ పునర్ నిర్మించుకొనుటకు తగిన తోడ్పాటు  అందించాలని కోరగా.. మొగులయ్య  నుండి వివరాలు cp సుధీర్ బాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొగులయ్య స్థలం పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని ఈ కేసులో తదుపరి విచారణ చేసి నేరస్థులను గుర్తించి  చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హామీ ఇచ్చారని మొగిలయ్యే పేర్కొన్నారు. ఆనంతరం కమీషనర్ మొగులయ్యని గౌరవ పూర్వకంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్, హయత్ నగర్ సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment