Saturday, 5 October 2024

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప


      శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.
శ్రీ‌వారి హంస‌ వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం రాత్రి హంస వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 క‌ళాబృందాలు 511 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.తిరుప‌తి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, మహారాష్ట్రకు చెందిన గీతా  బృందం కథక్ నృత్యం ప్రదర్శించారు. కర్నాటకకు చెందిన డాక్టర్ రక్షాకార్తిక్ దీప నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అజయ్ బృందం తప్ప నృత్యంతోను, బెంగళూరుకు చెందిన సుజేంద్ర బాబు బృందం దశావతారం రూపకంతోను అలరించారు.

No comments:

Post a Comment