Wednesday, 9 October 2024

ఆత్మ చైతన్యాన్ని కలుగజేసే సరస్వతి అవతారంలో బెజవాడ కనకదుర్గమ్మ

దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలని అనుసరించి, ఏడోవ రోజున సరస్వతీ అలంకారంలో అమ్మవారి దర్శనం...🥥🙏🏼 
‘‘విద్యారూపా .. విశాలాక్షి బ్రహ్మజాయా మహాఫలా
త్రయా మూర్తిః త్రికాలజ్ఞా త్రిగుణా - శాస్తర్రూపిణీ’’ అని హంసవాహిని శ్ేవతవస్త్రాలంకారణి అయన సరస్వతీ దేవిని జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. ‘వాగ్భూషణమ్ భూషణమ్’- మానవునకు ‘మంచి మాటే’ అలంకారము కనుక ఆ వాక్కును ప్రసాదించే దేవతగా సరస్వతీదేవిని నవరాత్రులలో పూజించడం అనాదిగా వస్తోంది. సకలబుద్ధులను ప్రకాశింపచేసే దేవతే సరస్వతి అని యజుర్వేదం కూడా చెప్తుంది.
అసలు ‘‘యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా... నమసె్తైసె్తై నమసె్తైసె్తై నమస్తసె్తై నమో నమః ‘శక్తి’ అనే పదం స్ర్తిలింగం కనుక అమ్మ అని పిలుస్తున్నాం. ఆ అమ్మ స్వయం పోషక పదార్థాలలో ఉద్భవించింది. కనుక బిడ్డ పుట్టగానే ఆహారాన్ని అందిస్తుంది. ఆ అమ్మనే కట్టకడదాకా తోడునీడగా వుండి వివేకవిచక్షణాలను కలిగిస్తుంది కనుకనే ఆ శక్తి స్వరూపిణినే సరస్వతీగా భావించి పూజించడం నవరాత్రుల్లో భాగమైంది.
బ్రహ్మకు ఇల్లాలు, సర్వులకు జ్ఞానాన్ని ప్రసాదించే శారదాదేవినే ‘వాగ్దేవి’గా పూజిస్తారు. ఈ తల్లి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో వివరించి ఉన్నారు. ‘సరస్వతీ రహస్యోపనిషత్’ ద్వారా అశ్వలాయనుడు సరస్వతీ కటాక్షంతో పొందిన అపార జ్ఞానసంపద వివరణతో సరస్వతిని ఉపాసిస్తుంటారు. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి ‘సరస్వతి’కనుక ‘శ్రీపంచమి తోపాటు నవరాత్రుల్లోనూ విశేషంగా ఈ తల్లిని అర్చించి ఆమె కృపకు పాత్రులవుతారు బుద్ధిని, విద్యను, జ్ఞానమును, వివేచనాశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని ధారణా శక్తిని అనుగ్రహించే సరస్వతీ దేవిని వసంతపంచమి నాడు పూజించిన వారికి కరతలామలకంగా ఏ విద్యయైనా ఒనగూడుతుందని అంటారు. యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు వాణీస్తోత్రం, వశిష్ఠ స్తోత్రాల్లో ఈ తల్లి ని ఏవిధంగా పూజించాలో వివరించి ఉన్నారు.
ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను పద్మంలో ఆసీనురాలై ఉండే దేవతనే సరస్వతీ దేవి. వేదవ్యాసులు కూడా ఈ తల్లి చలువ వల్లనే రచనాభాండాగారాన్ని నింపాడని పురాణోక్తి. జ్ఞాన ఐశ్వర్యాలను ప్రసాదించే అమ్మలను కొలువై ఉండేటట్టు అనుగ్రహించిన వేద వ్యాసులను ఇక్కడ పూజించుకునే ఏర్పాటు చేశారు. నవరాత్రి పూజోత్సవాలే కాక మాఘశుద్ధ పంచమినాడు వసంత పంచమి పేరిట విశేష అర్చనలు చేస్తారు. . ధర్మాధర్మ విచక్షణాజ్ఞానాన్ని పొందాలనే అంతరార్థంతో చేసే తారతమ్యభావనలు లేక ప్రజలందరూ నవరాత్రి పర్వదినంలో మూలా నక్షత్రం రోజు శారదా మాతను కొలుస్తారు 
పోతనామాత్యుడూ అమ్మను పూజించిన తరువాతే భాగవతరచన ఉపక్రమించినట్లు చరిత్ర చెప్తోంది. శుంభనిశుంభరాక్షసులను సంహరించిన వాగ్దేవిగాను సరస్వతీ దేవిని ఆరాధిస్తుంటారు. అజ్ఞానమనే రాక్షససంహారం కావించే దేవిగా భావించి ప్రతి వారు తమకు జ్ఞానజ్యోతులను ప్రసాదించమని ఈ తల్లిని వేడుకుంటారు. ప్రతి మానవుని జీవితంలోను జ్ఞాన ఉద్దీపన జరగాలని కోరుకుంటూ లోకాసమస్తా సుఖినోభవన్తు అందాం.🌹

వీణాపాణి వేద వాణి!
ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి
ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...
వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.
వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.
యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.
ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. 
* ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.

No comments:

Post a Comment