Monday, 21 October 2024

*పోలీసు అమరవీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువ పోలీసులు సమాజ సేవలో ముందుండాలి*... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*



ఖమ్మం : పోలీసు అమరవీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువ పోలీసులు శాంతి సమాజ స్ధాపన కోసం, సమాజ సేవలో ముందుండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా పోలీస్ యంత్రాంగం సోమవారం ఘనంగా నివాళులర్పించింది. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పెరేడ్‌ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. తొలుత, అమర వీరుల స్మృత్యర్థం సాయుధ బలగాలు పెరేడ్, గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అనంతరం పోలీసు ఆయుధాలు కిందకు దింపి వందనం చేసి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. గార్డ్ ఆఫ్ హానర్ పెరేడ్ ఇన్చార్జిగా ఆర్ఐ శ్రీశైలం  వ్యవహరించారు. 
దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధినిర్వహణలో అసువులు బాసిన 214 మంది అమర వీరుల పేర్లను అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ నరేష్ కుమార్ చదివి వినిపించారు. 
పోలీసు అమర వీరులకు నివాళులర్పించేందుకు  వచ్చిన వారి కుటుంబీకులు, బంధువులు స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించే సమయంలో.. తమ వారిని స్మరించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీసు అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.ప్రస్తుత పరిస్థితులలో జిల్లాలో అధికార యంత్రాంగం ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నరంటే అనాటి పోలీసు త్యాగాల ఫలితంగానే అన్నారు.ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలను నిష్పక్షపతంగా అమలు చేయడంలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తారని, ప్రజాస్వామ్య దేశానికి ఇది చాల కీలకమని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని అన్నారు.కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నా రన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నామని, వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలను అంకిత చేశారని అన్నారు.అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబీకులతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ మాట్లాడారు. ఏదైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అక్టోబర్‌ 25 & 27న సైకిల్ ర్యాలీ, 26వ తేదీన రక్తదానం శిభిరం, 27వ తేదీన పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు , 28 వ తేదీన విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీల అవగాహన కార్యక్రమాలు, 29 వ తేదీన ఆన్‌లైన్ ఓపెన్ హౌస్,  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ (లా&ఆర్డర్) ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయ్ బాబు, ఏసీపీలు వేంకటేశ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రఘు, సాంబరాజు,రవి, మల్లయ్య, నర్సయ్య, ఆర్ ఐలు కామరాజు,శ్రీశైలం, సురేష్, అప్పలనాయుడు, సిఐలు ఉదయ్ కుమార్,బాలకృష్ణ, రమేష్, భానుప్రకాశ్, సాగర్, రాజు, తిరుపతి, కిరణ్ కుమార్, రాజిరెడ్డి, రామకృష్ణ, సతీష్, మోహన్ బాబు, హనుక్, స్వామి, తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment