Thursday, 31 July 2025

పూరి మందిరం వద్ద తొక్కిసలాటపై విచారణ నివేదిక...

Development Commissioner Smt. Anu Garg submitted the inquiry report on the unfortunate stampede near Sri Gundicha Temple in Puri during Rath Yatra 2025 (29th June) to Hon'ble Chief Minister  Mohan Charan Majhi.
ఒరిస్సా పూరి జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా గుండిచా మందిరం దగ్గర జరిగిన తొక్కేసలాటపై ఒరిస్సా రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనుగర్గ్ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జి కి విచారణ నివేదికను గురువారం సమర్పించారు.
నివేదిక పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సి ఉంది కాగా జూన్ 29 పూరి  చెక్క లోడుతో ఉన్న లారీ వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడారు అక్కడ అనుకొని విధంగా 50 మంది గాయపడగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 
అంతకుముందు రెండు రోజుల క్రితమే దాదాపు 500 మంది తొక్కిసలాటలో గాయపడటం కూడా జరిగింది

*మణి"రత్నాలు*గా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం : మంత్రి పొంగులేటి

*పాలేరు విద్యాభివృద్ధికి 470 కోట్లు*

- *“పేద పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాం”*

- *తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి*

కూసుమంచి : పాలేరు నియోజకవర్గంలో విద్యా రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు 470 కోట్ల రూపాయలను విద్యాభివృద్ధి కోసం కేటాయించామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. “పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు… వారిని మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం” అని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
*జూనియర్ కళాశాలకు శంకుస్థాపన*
కూసుమంచి పాత జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. “ఈ భవనాన్ని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విద్యార్థుల కోసం ప్రారంభిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం నాకు గర్వంగా ఉంది” అని మంత్రి అన్నారు.
*76 మంది బాలికలకు సైకిళ్లు*
పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తరగతి చదువుతున్న 76 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. “పేద పిల్లలకు ప్రయాణ సౌకర్యం లేక చదువులో వెనుకబడకూడదు. గతేడాది 8, 9, 10వ తరగతుల విద్యార్థినిలు అందరికీ  సైకిళ్లు ఇచ్చాం. వచ్చే ఏడాది నుంచి  జూనియర్ కళాశాలలో చేరుతున్న విద్యార్థినిలకు కూడా సైకిళ్లు అందిస్తాం” అని తెలిపారు.
*లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు*
ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. “పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాలను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పేదల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయి” అని ఆయన స్పష్టం చేశారు.
*విద్యా రంగానికి 470 కోట్ల రూపాయలు*
“గడచిన 18 నెలల్లో పాలేరు నియోజకవర్గానికి 470 కోట్ల రూపాయల నిధులు విద్యాభివృద్ధికి  కేటాయించాం. ఐటీఐ, నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కొత్త శకం తెస్తాయి. చదువు అందరికీ చేరేలా ప్రభుత్వ కృషి కొనసాగుతుంది” అని మంత్రి వివరించారు.
*వ్యక్తిగతంగా సహాయం చేస్తానని హామీ*
“ప్రభుత్వ సహాయంతో పాటు అవసరమైతే నేను కూడా వ్యక్తిగతంగా సాయం అందించేందుకు పేద విద్యార్థులకు అండగా ఉంటాను. స్కూల్ అభివృద్ధి కోసం అవసరమైతే స్వయంగా నిధులు సమకూరుస్తాను. ప్రతి విద్యార్థి మంచి చదువులు చదివేలా నా వంతు కృషి చేస్తాను” అని మంత్రి హామీ ఇచ్చారు.
*విమర్శలపై ఘాటు వ్యాఖ్యలు*
“పూర్వ ప్రభుత్వ పరిపాలన వల్లే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకుని, ప్రతి విద్యార్థిని సమాజంలో ఒక ఆభరణంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.

Wednesday, 30 July 2025

సంగారెడ్డి కలెక్టర్కు ముఖ్యమంత్రి అభినందన..


సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
జిల్లాలోని హత్నూర్ కేజీబీవీ స్కూల్లో ఆమె వ్యక్తిగతంగా సందర్శించి బస చేశారు. రాత్రంతా ఆమె పిల్లలతో గడిపారు. వేగవంతమైన అభివృద్ధి నిధులతో విషయమై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.
అక్కడ పిల్లలను కలిసి వారి బాగోగులు విషయం అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె పిల్లలతో క్లాస్ రూమ్ లో కొంత సేపు గడిపారు. వారితో భోజనం చేశారు.
CM @ revanth_anumula appreciated Sangareddy Collector  for personally monitoring facilities at Hatnoor KGBV school. She dined and stayed overnight with students, and instructed officials to fast-track CSR-funded development works.


సమన్వయంతో జెండా పండుగ విజయవంతం చేద్దాం: తెలంగాణ సిఎస్ కె.రామకృష్ణ


హైదరాబాద్ : 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో సీనియర్‌ అధికారులతో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించనున్నారని, అనంతరం చారిత్రాత్మక గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని, అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అన్ని విభాగాలు  సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని, ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్న సందర్భంగా  తగిన భద్రత ఏర్పాట్లు,  ట్రాఫిక్‌ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ శాసనసభ, హైకోర్టు, రాజ్‌ భవన్‌, సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహాలు వంటి ప్రముఖ ప్రభుత్వ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో జరిగే అధికారిక వేడుకల్లో భాగంగా రాష్ట్ర వారసత్వం, దేశభక్తిని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు.అత్యవసర పరిస్థితులను దృష్టి పెట్టుకొని అందుకు అవసరమైన అగ్నిమాపక భద్రతా సిబ్బంది, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు.దినోత్సవ వేడుకలకు ఎలాంటి విద్యుత్‌ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గౌరవం మరియు వైభవాన్ని కాపాడటానికి ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, సమాచారశాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

--------------------------------------------------------------------------------------------
స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.

ఆరోగ్యాన్ని పెంచే మొక్కలను పెంచుదాం ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*


*వనమహోత్సవంలో ఆరోగ్యకరమైన మొక్కలు పెంచడం లక్ష్యంగా చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి* 

*బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి పటిష్ట కార్యాచరణ*

*వనమహోత్సవం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి....*

*మేగా బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి రఘునాథపాలెం మండలంలో అనువైన స్ధలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*

భావితరాలకు ప్రకృతి పచ్చదనం.. ఆరోగ్యం ఇచ్చే మొక్కలు పెంచే వన మహోత్సవం కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.రఘునాథపాలెం మండలం జింకల తండా గుట్ట వద్ద వన మహోత్సవం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుకోసం మేగా బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి అనువైన స్ధలాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. గుర్తించిన స్థలంను ఎర్రమట్టితో చదునుచేసి మంత్రులతో విఐపి మెగా ప్లాంటేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,* వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వన మహోత్సవం క్రింద బ్లాక్ ప్లాంటేషన్ కొరకు జిల్లాలో గుర్తించిన స్థలాల లెవెలింగ్, గుంతల తవ్వకం పనులు, అవసరమైన మొక్కలు, మంత్రి వర్యులచే మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రణాళికా ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.నర్సరీలో అందుబాటులో ఎన్ని ఎత్తైన మొక్కలు ఉన్నాయి, బయట నుంచి ఎన్ని తెప్పించుకోవాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ కోసం గుర్తించిన స్థలాలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని అన్నారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలని అన్నారు. నాటిన మొక్కలకు రెగ్యులర్ గా నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డిఓ సన్యాసయ్య, రఘునాథపాలెం తహసీల్దార్ శ్వేత, ఎంపీడివో, అటవీ, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.

మణికుమార్ కొమ్మమూరు 
మోబైల్: 9032075965

Tuesday, 29 July 2025

తిరుమలేశునకు భారీ కానుక.

తిరుమల శ్రీవారికి భారీ కానుక. 

చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దాదాపు రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బరువున్న బంగారు శంఖం (శంకు) మరియు డిస్క్ (చక్రం)ను విరాళంగా ఇచ్చింది. టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాతలు అందచేశార

ఖమ్మం జిల్లాతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది : బజాపా అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు.

ఖమ్మం (సత్య న్యూస్ ప్రతినిధి): ఖమ్మం జిల్లాతో తనకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందని ... తన చిన్నప్పుడు కూసుమంచి గ్రామంలో గడిపినట్లు తెలంగాణ భాజపా అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అన్నారు. తన మేనత్త ఊరు అవడంతో జిల్లాతో చిన్నప్పుడే బంధం ముడిపడిందని పేర్కొన్నారు
తాను చిన్ననాడు గడిపిన కూసుమంచి గ్రామంలోని కాకతీయుల నాటి వ్యఖ్యాత శివాలయంలో పూజలు నిర్వహించంతో జిల్లా పర్యటన ప్రారంభం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా  నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోలాటలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో, సాంస్కృతిక కళాకారులు తెలంగాణ జానపద నృత్యాలతో ర్యాలీగా తరలివచ్చి స్వాగతం పలికారు. తెలంగాణ రాజకీయాల్లో  ఖమ్మం జిల్లాకు జిల్లాకు మంచి ప్రాధాన్యత ఉందని అధికార కాంగ్రెస్  ప్రభుత్వంలో జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించడం జిల్లా రాష్ట్రంలో  ప్రాధాన్యత సంతరించుకుందిన్నారు భాజపా శ్రేణులు కార్యకర్తలు నాయకులు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శక్తిని చాటాలన్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించే దిశగా ..ఖమ్మం జిల్లాలో తన పర్యటన ప్రారంభం పలుకుతుదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో ప్రజలు బిజెపి వైపు ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు జిల్లా వ్యాప్తంగా  కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపి లో చేరడం.. గెలుపు అంచనాలను పెంచుతోందని ఆయన స్పష్టం చేశారు గత BRS ప్రభుత్వం బిజేపి నాయకులపై రాజకీయ కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టి జిల్లాలో భాజపా శ్రేణుల మనో ధైర్యాన్ని నీరుగార్చిచిందని. ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్న దారుణ పరిస్థితి జిల్లాలో జరగడం బాధాకరమని. అయినప్పటికీ మొక్కవని దీక్షతో ధైర్యంతో ఇక్కడ కార్యకర్తలు భాజపా వైపు నిలబడ్డారని రామచంద్రరావు అన్నారు.రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి బిజెపిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్య అవుతుందని అందుకు అన్ని వర్గాలు భాజపా పక్షాన నిలబడాలని కోరారు.అనంతమైన ఖమ్మం జరిగిన పలు కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు. తొలిసారి అధ్యక్ష హోదాలో ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా  నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.కోలాటలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో, సాంస్కృతిక కళాకారులు తెలంగాణ జానపద నృత్యాలతో ర్యాలీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలకు. కళాకారులకు పార్టీ శ్రేణులకు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు.

ఖమ్మంలో కాషాయం జోష్..!
• రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం.
• వంద కార్లతో భారీ కాన్వాయ్.
• కూసుమంచి శివాలయంలో పూజలు.
• ఖమ్మం వీధుల్లో బైక్ ర్యాలీ సందడి.
• అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి.
• మేధావులతో సమకాలీన అంశాలపై చర్చ.
• భారీగా తరలివచ్చిన కార్యకర్తల కదలిక.
• పార్టీ కార్యాలయ ప్రారంభంతో కొత్త శకం.

ఖమ్మం, జూలై 29.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పునాది మరింత బలపడేలా ఈ పర్యటన సాగింది. సంప్రదాయ పూజలతో ప్రారంభమై, మేధో మంతనంతో ముగిసిన ఈ పర్యటనలో పార్టీ భావితరాల కార్యకలాపాలకు దిశానిర్దేశం లభించింది.

నాయకునిగూడెం వద్దే వందలాది కార్యకర్తలు కార్లపై చేరుకుని భారీ కాన్వాయ్‌ ద్వారా స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, ఇతర నేతలు రాష్ట్ర అధ్యక్షునికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

రామచంద్రరావు మొదట కూసుమంచిలోని శివాలయాన్ని దర్శించి గణపతి పూజలతో పర్యటనకు శుభారంభం చేశారు. స్థానికులు సాంప్రదాయబద్ధంగా పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం నగరంలో వేలాది మంది కార్యకర్తల బైక్ ర్యాలీతో దత్త తిరిగారు. వైరా రోడ్డు మీదుగా జడ్పీ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

అక్కడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఇది సమాజంలో న్యాయం, సమానత్వం పట్ల పార్టీ కట్టుబాటును చూపించింది. ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా నేతల కాన్వాయ్ సప్తపది ఫంక్షన్ హాల్‌కి చేరగా, అక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ. .. బీజేపీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి వ్యవస్థను మారుస్తుంది. ఖమ్మంలో పార్టీ బలపడటం నా ప్రధాన లక్ష్యం,” అని చెప్పారు.

పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు తమ ప్రాంతీయ సమస్యలు వివరించి, పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. మేధో మంతనంలో మౌలిక అవసరాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.

ఈ అనంతరం ఖమ్మం బైపాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కొత్త బీజేపీ జిల్లా కార్యాలయాన్ని రామచంద్రరావు ప్రారంభించారు. ఈ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

తర్వాత సూర్యతేజ ఫంక్షన్ హాల్‌లో మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, సామాజిక సమస్యలు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలపై వారి అభిప్రాయాలను విన్నారు.

ఖమ్మం పర్యటన ముగిసిన అనంతరం రామచంద్రరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరారు. ఈ పర్యటన బీజేపీకి స్థానికంగా మళ్లీ ఉత్సాహం నింపింది. పూజలతో ప్రారంభమై, బహిరంగ కార్యక్రమాలు, మేధోచర్చలతో ముగిసిన ఈ పర్యటన కార్యకర్తల్లో నూతన ధైర్యాన్ని కలిగించింది.

*కొమ్మమూరు మణికుమార్, సీనియర్ జర్నలిస్ట్,  ఖమ్మం.
మోబైల్ : 9032075966*

Friday, 25 July 2025

సమావేశంలో చర్చ చేద్దాం : మంత్రి పొంగులేటి

ఇళ్ల స్థలాల విషయం నాలుగు గోడల మధ్య చర్చించేది..

*వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు* 

ఖమ్మం జిల్లా: జర్నలిస్టులకు సంబంధించి ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇళ్ల స్థలాల విషయం న్యాయపరమైన సమస్య లు వున్నందున ఇలా సభలో చెప్పలేమని.. వాటిని వేరేగా చర్చిద్దాం అని మంత్రి స్పష్టం చేశారు 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్లాలోని వైరాలో టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) నాల్గో జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

*వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి* 

వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో యూనియన్ నాయకులతో చర్చించి ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వెంటనే హెల్త్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో న్యాయ నిపుణులతో చర్చించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మాటిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు..
--------------------------------------------------------------------

*వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి..!!*

*జర్నలిస్టులకు తహశీల్దార్ యూనియన్ నేతల విజ్ఞప్తి*

*ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలి.*

*జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది., బ్లాక్ మెయిల్ పాల్పడే వారిపై పిర్యాదులు చేశాం..*

 *బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి ఓ ఆన్లైన్ పత్రిక తనపైన తప్పుడు వార్తలు రాసి మానసిక వేదనకు గురి చేసిందని* అయినవోలు *తహసిల్దార్ విక్రమ్ కుమార్* అన్నారు. 
 *వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో వరంగల్ జిల్లా తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు* చేశారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని, గత ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందని, అయినా అవి ఏమీ పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నామని, *ఒక ఆన్లైన్ పత్రిక వారు అసత్య రాతలు రాసి, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని వారిపై మాత్రమే ఫిర్యాదు చేశామని,* ఎవరికైనా తమపై అనుమానాలు ఉంటే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, కానీ *ఆర్థికంగా డబ్బులు ఇస్తావా? లేదా? అని బెదిరింపులకు పాల్పడడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని* దీంతో పోలీసులు ఆశ్రయించానని విక్రమ్ కుమార్ తెలిపారు, 

 *తనకు మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందని, పత్రిక విలేకరులపైన, వారి వృత్తి పట్ల అత్యంత అభిమానం, గౌరవం ఉన్నాయని* అయినవోలు *ఎమ్మార్వో విక్రమ్ కుమార్* తెలిపారు. కానీ *బ్లాక్ మెయిల్ చేసే ఆ..జర్నలిస్ట్ లను భరించలేక మాత్రమే పోలీస్ లను ఆశ్రయించానని* తెలిపారు. 

ఈ మీడియా సమావేశంలో వరంగల్ తహాసిల్దార్ ఇక్బాల్, ఖిలావరంగల్ తహసిల్దార్ నాగేశ్వరరావు, హన్మకొండ తహసిల్దార్ రవీందర్, హసన్ పర్తి తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Saturday, 19 July 2025

CP Cyberabad Avinash Mohanty Extend his Support Run for SMA

*Cure SMA India Announces 3rd Edition Run for SMA on August 10 at Gachibowli Stadium*

Commissioner Of Police, Cyberabad Avinash Mohanty, IPS., extend his support to this vital public health initiative. Hyderabad, July 2025:  Cure SMA Foundation of India, a parent-led non-profit organization dedicated to supporting families affected by Spinal Muscular Atrophy (SMA), is organizing the 3rd edition of Run for SMA – 2025 on Sunday, August 10 at Gachibowli Stadium, Hyderabad.The press conference was graced by Avinash Mohanty, IPS., Commissioner of Police, Cyberabad, along with  Cyberabad Jt. CP Traffic Dr. Gajarao Bhupal, IPS., who Unveiled the official poster of the Run for SMA and extended his support to this important public health awareness initiative.  Also present were leading medical and research experts including Dr. Radha Rama Devi, Senior Geneticist and Pediatrician at Rainbow Children’s Hospital, Dr. Giriraj Chandak, Former Chief Scientist at CSIR–CCMB, Mr. Naved Alam Khan, CEO, Society for Cyberabad Security Council and Cure SMA India trustees Ms. Srilakshmi and Ms. Archana and representatives, launch held at held at Cyberabad commissioner office, Gachibowli.
*Commissioner of Police, Cyberabad Avinash Mohanty, IPS.,* emphasize that  Spinal Muscular Atrophy (SMA) treatment is important, prevention through awareness and early screening is even more critical. Commending the SCSC Health Forum for organizing the “Run for SMA,” he noted that such initiatives are vital, especially since treatment is costly. Collective efforts like these reflect the commitment to positive change. 
As part of the campaign, the CP also launched the official poster and T-shirt for the run, encouraging continued support for this meaningful cause.
*Srilakshmi Nalam, Co-founder and Trustee of Cure SMA India,* stressed the need for collaboration between medical professionals, research bodies, corporates, and the government to create a sustainable ecosystem for rare disease families in India.

Run for SMA is part of global SMA Awareness Month observed in August. The Run includes timed and non-timed running categories—21K, 10K, 5K, and 5K non-timed—with attractive cash prizes for winners in various categories. Registration includes a T-shirt, medal, certificate, and breakfast.

The run is expected to see enthusiastic participation from students, corporate employees, medical professionals, SMA families, and the general public. It aims to raise awareness about Spinal Muscular Atrophy, a severe and rare genetic disorder that affects children’s muscle strength and movement, often leading to respiratory failure if left undiagnosed and untreated.
While treatment options have recently become available in India, their extremely high cost makes them inaccessible to most. Hence, awareness and prevention, especially through genetic carrier screening, are crucial to reducing the disease burden in future generations, She added.
Registrations are open and the public is invited to join hands in creating awareness and hope for the SMA community. 

*Registration Link:* 

http://ifinish.in/running/runforsma 

Monday, 14 July 2025

*ॐ పదవీచ్యుతుని పరిస్థితి*



    *అధికారం కోల్పోయినవారి పరిస్థితి ఏమిటో,*
    *శూర్పణఖ రావణుని కొలువులో రావణునితో ఆనాడే చెప్పింది.*

    *ఎండిన కర్రలు,* 
    *మట్టిబెడ్డలు,*
    *బూడిద కూడ దేనికైన ఉపయోగించును.*
    *కానీ స్థానభ్రష్టులైన రాజులవలన ప్రయోజనమేమీ ఉండదు.*
   *రాజ్యభ్రష్టుడైన రాజు, ఎంత సమర్థుడైనా,*
  *- కట్టి విడిచిన వస్త్రమువలె,*
  *- నలిగిపోయిన పూలదండవలె వ్యర్థుడు.*
*శుష్కైః కాష్ఠైర్భవేత్కార్యం* 
*లోష్టైరపి చ పాంసుభిః I*
*న తు స్థానాత్పరిభ్రష్టైః*
*కార్యం స్యాద్వసుధాధిపైః ৷৷*      
            *- అరణ్యకాండ 33/18*
*ఉపభుక్తం యథా వాసః*
*స్రజో వా మృదితా యథా I*
*ఏవం రాజ్యాత్పరిభ్రష్టః*
*సమర్థోఽపి నిరర్థకః ৷৷          19* 

                           *=×=×=×=* 

*- రామాయణం శర్మ* 
        *భద్రాచలం*


*ఆధ్యాత్మికంలో హాస్యానికి స్థానం ఉందా... లేక దానికి వ్యతిరేకమా?*
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
హాస్యానికి ఆధ్యాత్మికం ఎన్నడూ వ్యతిరేకం కాదు. అసలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నాడంటే దేహంకన్నా వేరుగా ఉండే ఆత్మ గురించి, ఆ ఆత్మ పొందదగిన పరమాత్మ గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నాడని అర్థం. కాని తాపత్రయంలోని ఆధ్యాత్మిక తాపాలు అంటే శారీరక, మానసిక బాధలు అవుతాయి. ఆధ్యాత్మిక సాహిత్యంలో హాస్యాన్ని పుట్టించే ఘటనలు కోకొల్లలు, ఉదాహరణకు వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమ సీతమ్మను కనుక్కున్న వృత్తాంతం విని, వానరులంతా అపరిమితమైన ఆనందంతో మధువనం ప్రవేశిస్తారు. స్వేచ్ఛగా మధుపానం చేస్తూ వారు చేసే చేష్టలు నవ్వు పుట్టిస్తాయి. కొందరు రాగాలు తీస్తున్నారు. కొందరు దండాలు పెడుతున్నారు. కొందరు ఆడుతున్నారు. కొందరు నవ్వుతున్నారు. కొందరు కిందపడుతున్నారు. కొందరు ఎగిరి గెంతులు వేస్తున్నారు. కొందరు ప్రేలాపనలు చేస్తున్నారు.

గాయన్తమన్యః ప్రహసన్ను పైతి
హసన్న మన్యః ప్రరు దున్ను పైతి రుదన్తు మన్యః ప్రణు దున్ను పైతి సదన్త మన్యః ప్రణ దున్ను పైతి

పై శ్లోకం అర్ధం తెలుసుకుని హాయిగా నవ్వుకోండి.

Tuesday, 8 July 2025

శ్రీశైల మల్లన్నను దర్శించిన ఎ.పి.ముఖ్యమంత్రి చంద్రబాబు


శ్రీశైలం : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు. *ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం... ఆరవ అష్టాదశ శక్తిపీఠం... ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం మంగళవారం ఉదయం 12.40 గంటలకు  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును
ఆలయ అర్చకులు *ఆలయ సంప్రదాయం ప్రకారం...  రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రాలతో  స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకువెళ్లారు.*
*ఆలయంలో ప్రధమంగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి*
*అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ముఖ్యమంత్రి  పూజలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆలయంలో రుద్ర హోమం పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.*
*అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.*ఏం.పి. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి,  ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రెటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవో, పిఆర్వోలు, ఆలయ సిబ్బంది తదితరులు ముఖ్యమంత్రివెంట వున్నారు..*

Wednesday, 2 July 2025

దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ విపత్తు మేనేజ్మెంట్ అథారిటీ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ : ప్రకృతి వైప‌రీత్యాల‌ను  స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని వీలైనంత వ‌ర‌కు ప్రాణ న‌ష్టం, ఆస్ధి న‌ష్టం జ‌ర‌గకుండా ఉండేలా  తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ‌)ని బ‌లోపేతం చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. దేశానికి ఒక మోడ‌ల్‌గా ఉండేలా వ్య‌వ‌స్ధ‌ను రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్ధ  (TGSDMA) ను పున‌ర్వ్య‌వ‌స్ధీక‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంస్ధకు గౌర‌వ‌ ముఖ్య‌మంత్రి ఛైర్మ‌న్‌గా  ఉంటార‌ని ఇందులో  రెవెన్యూ, హోమ్‌, ఆర్ధిక‌, వైద్య ఆరోగ్యం, భారీ నీటిపారుద‌ల‌, ర‌హ‌దారులు భ‌వ‌నాలు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌ల మంత్రులు స‌భ్యులుగానూ, చీఫ్ సెక్ర‌ట‌ర్ మెంబ‌ర్ క‌న్వీన‌ర్‌గాను, రెవెన్యూశాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌త్యేక ఆహ్వానితునిగా ఉంటార‌ని తెలిపారు. బుధ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో గోదావరి మరియు కృష్ణా నదీ ప‌రివాహ‌క  జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల క‌లెక్టర్లు , ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో చీఫ్ సెక్ర‌ట‌రీ కె. రామ‌కృష్ణారావు, విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌తో క‌లిసి సమావేశం  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రిగారు  మాట్లాడుతూ "వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల ఆక‌స్మికంగా వ‌చ్చే వ‌ర‌దలు,  వ‌ర్షాల స‌మాచారాన్ని  ఐఎండీతో స‌మ‌న్వ‌యం చేసుకొని శాస్త్రీయంగా విశ్లేషించుకొని ఎప్ప‌టిక‌ప్పుడు  పై స్ధాయి నుంచి కింది స్ధాయి వ‌ర‌కు అందించేలా వ్య‌వ‌స్ధ‌ను రూపొందించుకోవాలి.స‌మాచార వ్య‌వ‌స్ధ మ‌రింత బ‌లోపేతం కావాలి.రాష్ట్ర స్దాయిలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు సంబంధం ఉన్న  ఇరిగేష‌న్‌, విద్యుత్‌, హెల్త్‌, వ్య‌వ‌సాయం, పోలీస్, ర‌వాణా త‌దిత‌ర‌ విభాగాల‌కు    ప్ర‌త్యేక నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మిస్తున్నాం.  ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను మ‌నం అడ్డుకోలేం కానీ వాటి ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి  ముంద‌స్తుగా ప‌టిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటే న‌ష్టాన్ని వీలైనంత‌వ‌ర‌కు త‌గ్గించ‌గ‌లుగుతాం. ప్ర‌ధానంగా కృష్ణా గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల అధికార యంత్రాంగం  వ‌ర‌ద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. దీనివ‌ల‌న మ‌నం న‌ష్టాన్ని త‌గ్గించిన‌వార‌మ‌వుతాం. న‌దీప‌రివాహ‌క ప్రాంతాల్లో ఏ మేర‌కు వ‌ర‌ద ఉధృతి వ‌స్తే ఏఏ గ్రామాలు ముంపున‌కు గురౌతాయోన‌న్న స‌మాచారాన్ని  నీటిపారుద‌ల శాఖ ముందుగానే అందించాలి. ఇత‌ర రాష్ట్రాల‌లో  వ‌చ్చే వ‌ర‌ద వివ‌రాలు, స్ధానికంగా ప‌డిన వ‌ర్షం వివ‌రాలు, ఎంత నీటిని విడుద‌ల చే్స్తార‌నే విష‌యాలు స‌వివ‌రంగా ఉండాలి.  న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని నివాసితుల‌ను వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ  సుర‌క్షిత  ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం కంటే వారికి శాశ్వ‌త నివాసం క‌ల్పించాలి. ఇందుకు సంబంధించి నివాసితుల వివ‌రాల‌ను గుర్తిస్తే  అద‌న‌పు కోటా కింద ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మించి ఇస్తాం." భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వాగుల్లో వంక‌ల్లో చెరువుల్లో చిక్కుకు్న్న‌వారిని ర‌క్షించ‌డానికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్దం చేసుకోవాలి. ఈ ఎయిర్ లిఫ్ట్ వ్య‌వ‌స్ద స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల గ‌త ఏడాది నా నియోజ‌క‌వ‌ర్గం పాలేరులో చిక్కుకున్న బాధితుల‌ను ర‌క్షించుకోలేక‌పోయాన‌ని ఈ సంద‌ర్బంగా మంత్రిగారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎయిర్ లిఫ్ట్ మెకానిజం ఏవిధంగా ఉండాలి, విప‌త్తు సంభ‌వించిన ప్రాంతానికి ఏవిధంగా చేరుకోవాలి వంటి అంశాల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అరవింద్ కుమార్‌, సెక్ర‌ట‌రీ శివ‌శంక‌ర్‌, అగ్నిమాప‌క శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ నాగిరెడ్డి, హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాధ్‌, పంచాయితీరాజ్ క‌మీష‌న‌ర్ సృజ‌న‌, సిపి డిసిఎల్ డైరెక్ట‌ర్ ముష్రాఫ్ అలీ, వ్య‌వ‌సాయ స‌హ‌కార శాఖ డైరెక్ట‌ర్ బి. గోపి. ఐఎండీ అధికారిణి నాగ‌ర‌త్నం. సివిల్ స‌ప్ల‌యిస్ డైరెక్ట‌ర్ ముజ‌ముల్ ఖాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tuesday, 1 July 2025

We will fight for rights in Krishna and Godavari waters : CM Revanth Reddy at High level meet

Hon'ble Chief Minister Sri A. Revanth Reddy stated that Telangana will move forward with a clear policy to secure its rightful share and allocations in the Krishna and Godavari rivers. He emphasized that a solution to surplus and flood water issues will only come after proper legal allocations are made for the projects being constructed in Telangana. He asserted that surplus water too must be allocated based on an equitable ratio between the two states.
❇️ At Phule Praja Bhavan, Irrigation Minister Shri N. Uttam Kumar Reddy gave a detailed PowerPoint presentation to public representatives on Telangana’s rightful water share in the Krishna-Godavari basin. CM Revanth Reddy, Deputy CM Mallu Bhatti Vikramarka, cabinet ministers, and several public representatives participated.
❇️ The presentation covered critical aspects such as the history of inter-state water disputes, relevant provisions in the State Bifurcation Act, the status of Telangana's sanctioned projects, and Andhra Pradesh’s illegal constructions violating Telangana’s rights. The government’s ongoing efforts to halt such violations were also explained.
❇️ The Chief Minister strongly urged that the Central Government must play a decisive role in resolving water disputes. He cautioned that encouraging disputes between states is not a responsible policy. "Water disputes will be resolved only when allocations are made for the projects currently under construction in Telangana," he said.
❇️ The CM reiterated that the government’s core agenda is to secure permanent water rights and rightful allocations to Telangana in the Krishna-Godavari basins. “First, legal net allocations must be made. Only then can surplus and flood water sharing be addressed,” he said.
❇️ He asserted that once Telangana’s pending projects are completed, the discussion on surplus and flood waters must follow, with allocations done fairly between the two states based on agreed ratios.
❇️ Referring to the Palamuru-Rangareddy project, the CM questioned why Andhra Pradesh hasn’t issued a No Objection Certificate (NOC) despite the Centre allocating 45 TMC of water. "On one hand, Telangana’s rights are objected to, and on the other, Andhra is building projects in the name of surplus waters — how is that justified?" he asked.
❇️ The CM said Telangana will continue its fight for water rights — technically, politically, and legally — based on the situation. He added that decisions taken during the last nine and a half years have significantly harmed Telangana’s interests.
❇️ He pointed out that clear net water allocations existed during the united state, but post-bifurcation, projects in Telangana were not completed, nor were necessary permissions obtained. “Had they been completed, today’s problems would not have arisen,” he said.
❇️ CM Revanth Reddy called for high-level official-level talks between the two states. If issues remain unresolved, they should be taken up before the Apex Committee for resolution.
❇️ Finally, the Chief Minister made it clear: “We will fight for Telangana’s rights in Krishna and Godavari waters — technically before the governments, politically among the people, and legally in the courts. These facts must be explained to the public.