*అధికారం కోల్పోయినవారి పరిస్థితి ఏమిటో,*
*శూర్పణఖ రావణుని కొలువులో రావణునితో ఆనాడే చెప్పింది.*
*ఎండిన కర్రలు,*
*మట్టిబెడ్డలు,*
*బూడిద కూడ దేనికైన ఉపయోగించును.*
*కానీ స్థానభ్రష్టులైన రాజులవలన ప్రయోజనమేమీ ఉండదు.*
*రాజ్యభ్రష్టుడైన రాజు, ఎంత సమర్థుడైనా,*
*- కట్టి విడిచిన వస్త్రమువలె,*
*- నలిగిపోయిన పూలదండవలె వ్యర్థుడు.*
*శుష్కైః కాష్ఠైర్భవేత్కార్యం*
*లోష్టైరపి చ పాంసుభిః I*
*న తు స్థానాత్పరిభ్రష్టైః*
*కార్యం స్యాద్వసుధాధిపైః ৷৷*
*- అరణ్యకాండ 33/18*
*ఉపభుక్తం యథా వాసః*
*స్రజో వా మృదితా యథా I*
*ఏవం రాజ్యాత్పరిభ్రష్టః*
*సమర్థోఽపి నిరర్థకః ৷৷ 19*
*=×=×=×=*
*- రామాయణం శర్మ*
*భద్రాచలం*
*ఆధ్యాత్మికంలో హాస్యానికి స్థానం ఉందా... లేక దానికి వ్యతిరేకమా?*
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
హాస్యానికి ఆధ్యాత్మికం ఎన్నడూ వ్యతిరేకం కాదు. అసలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నాడంటే దేహంకన్నా వేరుగా ఉండే ఆత్మ గురించి, ఆ ఆత్మ పొందదగిన పరమాత్మ గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నాడని అర్థం. కాని తాపత్రయంలోని ఆధ్యాత్మిక తాపాలు అంటే శారీరక, మానసిక బాధలు అవుతాయి. ఆధ్యాత్మిక సాహిత్యంలో హాస్యాన్ని పుట్టించే ఘటనలు కోకొల్లలు, ఉదాహరణకు వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమ సీతమ్మను కనుక్కున్న వృత్తాంతం విని, వానరులంతా అపరిమితమైన ఆనందంతో మధువనం ప్రవేశిస్తారు. స్వేచ్ఛగా మధుపానం చేస్తూ వారు చేసే చేష్టలు నవ్వు పుట్టిస్తాయి. కొందరు రాగాలు తీస్తున్నారు. కొందరు దండాలు పెడుతున్నారు. కొందరు ఆడుతున్నారు. కొందరు నవ్వుతున్నారు. కొందరు కిందపడుతున్నారు. కొందరు ఎగిరి గెంతులు వేస్తున్నారు. కొందరు ప్రేలాపనలు చేస్తున్నారు.
గాయన్తమన్యః ప్రహసన్ను పైతి
హసన్న మన్యః ప్రరు దున్ను పైతి రుదన్తు మన్యః ప్రణు దున్ను పైతి సదన్త మన్యః ప్రణ దున్ను పైతి
పై శ్లోకం అర్ధం తెలుసుకుని హాయిగా నవ్వుకోండి.
No comments:
Post a Comment