*వనమహోత్సవంలో ఆరోగ్యకరమైన మొక్కలు పెంచడం లక్ష్యంగా చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి పటిష్ట కార్యాచరణ*
*వనమహోత్సవం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి....*
*మేగా బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి రఘునాథపాలెం మండలంలో అనువైన స్ధలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*
భావితరాలకు ప్రకృతి పచ్చదనం.. ఆరోగ్యం ఇచ్చే మొక్కలు పెంచే వన మహోత్సవం కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.రఘునాథపాలెం మండలం జింకల తండా గుట్ట వద్ద వన మహోత్సవం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుకోసం మేగా బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి అనువైన స్ధలాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. గుర్తించిన స్థలంను ఎర్రమట్టితో చదునుచేసి మంత్రులతో విఐపి మెగా ప్లాంటేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,* వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వన మహోత్సవం క్రింద బ్లాక్ ప్లాంటేషన్ కొరకు జిల్లాలో గుర్తించిన స్థలాల లెవెలింగ్, గుంతల తవ్వకం పనులు, అవసరమైన మొక్కలు, మంత్రి వర్యులచే మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రణాళికా ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.నర్సరీలో అందుబాటులో ఎన్ని ఎత్తైన మొక్కలు ఉన్నాయి, బయట నుంచి ఎన్ని తెప్పించుకోవాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ కోసం గుర్తించిన స్థలాలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని అన్నారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలని అన్నారు. నాటిన మొక్కలకు రెగ్యులర్ గా నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డిఓ సన్యాసయ్య, రఘునాథపాలెం తహసీల్దార్ శ్వేత, ఎంపీడివో, అటవీ, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.
మణికుమార్ కొమ్మమూరు
మోబైల్: 9032075965
No comments:
Post a Comment