Tuesday, 29 July 2025

ఖమ్మం జిల్లాతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది : బజాపా అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు.

ఖమ్మం (సత్య న్యూస్ ప్రతినిధి): ఖమ్మం జిల్లాతో తనకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందని ... తన చిన్నప్పుడు కూసుమంచి గ్రామంలో గడిపినట్లు తెలంగాణ భాజపా అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అన్నారు. తన మేనత్త ఊరు అవడంతో జిల్లాతో చిన్నప్పుడే బంధం ముడిపడిందని పేర్కొన్నారు
తాను చిన్ననాడు గడిపిన కూసుమంచి గ్రామంలోని కాకతీయుల నాటి వ్యఖ్యాత శివాలయంలో పూజలు నిర్వహించంతో జిల్లా పర్యటన ప్రారంభం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా  నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోలాటలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో, సాంస్కృతిక కళాకారులు తెలంగాణ జానపద నృత్యాలతో ర్యాలీగా తరలివచ్చి స్వాగతం పలికారు. తెలంగాణ రాజకీయాల్లో  ఖమ్మం జిల్లాకు జిల్లాకు మంచి ప్రాధాన్యత ఉందని అధికార కాంగ్రెస్  ప్రభుత్వంలో జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించడం జిల్లా రాష్ట్రంలో  ప్రాధాన్యత సంతరించుకుందిన్నారు భాజపా శ్రేణులు కార్యకర్తలు నాయకులు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శక్తిని చాటాలన్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించే దిశగా ..ఖమ్మం జిల్లాలో తన పర్యటన ప్రారంభం పలుకుతుదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో ప్రజలు బిజెపి వైపు ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు జిల్లా వ్యాప్తంగా  కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపి లో చేరడం.. గెలుపు అంచనాలను పెంచుతోందని ఆయన స్పష్టం చేశారు గత BRS ప్రభుత్వం బిజేపి నాయకులపై రాజకీయ కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టి జిల్లాలో భాజపా శ్రేణుల మనో ధైర్యాన్ని నీరుగార్చిచిందని. ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్న దారుణ పరిస్థితి జిల్లాలో జరగడం బాధాకరమని. అయినప్పటికీ మొక్కవని దీక్షతో ధైర్యంతో ఇక్కడ కార్యకర్తలు భాజపా వైపు నిలబడ్డారని రామచంద్రరావు అన్నారు.రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి బిజెపిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్య అవుతుందని అందుకు అన్ని వర్గాలు భాజపా పక్షాన నిలబడాలని కోరారు.అనంతమైన ఖమ్మం జరిగిన పలు కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు. తొలిసారి అధ్యక్ష హోదాలో ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా  నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.కోలాటలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో, సాంస్కృతిక కళాకారులు తెలంగాణ జానపద నృత్యాలతో ర్యాలీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలకు. కళాకారులకు పార్టీ శ్రేణులకు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు.

ఖమ్మంలో కాషాయం జోష్..!
• రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం.
• వంద కార్లతో భారీ కాన్వాయ్.
• కూసుమంచి శివాలయంలో పూజలు.
• ఖమ్మం వీధుల్లో బైక్ ర్యాలీ సందడి.
• అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి.
• మేధావులతో సమకాలీన అంశాలపై చర్చ.
• భారీగా తరలివచ్చిన కార్యకర్తల కదలిక.
• పార్టీ కార్యాలయ ప్రారంభంతో కొత్త శకం.

ఖమ్మం, జూలై 29.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పునాది మరింత బలపడేలా ఈ పర్యటన సాగింది. సంప్రదాయ పూజలతో ప్రారంభమై, మేధో మంతనంతో ముగిసిన ఈ పర్యటనలో పార్టీ భావితరాల కార్యకలాపాలకు దిశానిర్దేశం లభించింది.

నాయకునిగూడెం వద్దే వందలాది కార్యకర్తలు కార్లపై చేరుకుని భారీ కాన్వాయ్‌ ద్వారా స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, ఇతర నేతలు రాష్ట్ర అధ్యక్షునికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

రామచంద్రరావు మొదట కూసుమంచిలోని శివాలయాన్ని దర్శించి గణపతి పూజలతో పర్యటనకు శుభారంభం చేశారు. స్థానికులు సాంప్రదాయబద్ధంగా పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం నగరంలో వేలాది మంది కార్యకర్తల బైక్ ర్యాలీతో దత్త తిరిగారు. వైరా రోడ్డు మీదుగా జడ్పీ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

అక్కడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఇది సమాజంలో న్యాయం, సమానత్వం పట్ల పార్టీ కట్టుబాటును చూపించింది. ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా నేతల కాన్వాయ్ సప్తపది ఫంక్షన్ హాల్‌కి చేరగా, అక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ. .. బీజేపీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి వ్యవస్థను మారుస్తుంది. ఖమ్మంలో పార్టీ బలపడటం నా ప్రధాన లక్ష్యం,” అని చెప్పారు.

పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు తమ ప్రాంతీయ సమస్యలు వివరించి, పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. మేధో మంతనంలో మౌలిక అవసరాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.

ఈ అనంతరం ఖమ్మం బైపాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కొత్త బీజేపీ జిల్లా కార్యాలయాన్ని రామచంద్రరావు ప్రారంభించారు. ఈ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

తర్వాత సూర్యతేజ ఫంక్షన్ హాల్‌లో మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, సామాజిక సమస్యలు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలపై వారి అభిప్రాయాలను విన్నారు.

ఖమ్మం పర్యటన ముగిసిన అనంతరం రామచంద్రరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరారు. ఈ పర్యటన బీజేపీకి స్థానికంగా మళ్లీ ఉత్సాహం నింపింది. పూజలతో ప్రారంభమై, బహిరంగ కార్యక్రమాలు, మేధోచర్చలతో ముగిసిన ఈ పర్యటన కార్యకర్తల్లో నూతన ధైర్యాన్ని కలిగించింది.

*కొమ్మమూరు మణికుమార్, సీనియర్ జర్నలిస్ట్,  ఖమ్మం.
మోబైల్ : 9032075966*

No comments:

Post a Comment