Wednesday, 30 September 2020

టిటిడి ఆస్థాన గాయనిగా పద్మశ్రీ శోభరాజు నియామకం


ప్రఖ్యాత అన్నమయ్య పద గాయనీ శోభా రాజును టిటిడి ఆస్థాన గాయనీగా నియమించారు.   30 నవంబర్ ,1957  అప్పటి తమిళనాడు రాష్ట్రంలో వున్న చిత్తూరు జిల్లా వాయల్పడులో శోభారాజు జన్మించారు..
 భారతీయ సంగీతకారుడు, భక్తి గాయకుడు, రచయిత మరియు స్వరకర్త, 15 వ శతాబ్దపు సాధువు-స్వరకర్త అన్నామాచార్య కీర్తనలను శోభరాజు తనదైన భక్తిభవంతో పాడి పలువురి మన్ననలు అందుకున్నారు..సంగీత తానికి అమే చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.ఎన్నో కచేరీల ద్వారా సంగీత అభిమానులకు శోభరాజు చిరపరిచితురాలు..శోభరాజు టిటిడి ఆస్థాన గాయనీ గా నియమకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మూచ్ఛటగా మూడుసార్లు గరుడునిపై తిరుమలేశుడు..

అక్టోబర్ నెలలో ఓ అధ్భుతం చోటుచెసుకోభోతోంది..
గరుడ వాహనంపై శ్రీవారు ముచ్ఛటగా మూడుసార్లు .అధిరోహించి భక్తులకు కనువిందు చేయనున్నారు...
అక్టోబర్ 1వతేది గురువారం.పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వుంటుంది .
అనంతరం ఆశ్వీయుజ మాసం శరన్నవరాత్రుల సమయంలో తిరుమలలో ప్రతి సంవత్సరం జరిపించే బ్రహ్మోత్సవాల సందర్భంగా.. 5వ రోజు..అక్టోబర్ - 20వతేది మంగళవారంనాడు.. తిరుమల శ్రీవారు
గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు..ఇహ అక్టోబర్..31 శనివారం మళ్లి పున్నమి కావడంతో మూడో సారి గరుడ వాహనంపై శ్రీవారు పూజలు అందుకోనున్నారు..31 రోజలలో మూడు సార్లు గరుడ వాహనంపై తిరుమల శ్రీనివాసుని దర్శనం అధ్భతమే కదా.
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌‌రులో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

👉అక్టోబ‌రు 1, 31వ తేదీల్లో పౌర్ణ‌మి గ‌రుడ సేవ‌.
👉అక్టోబ‌రు 15న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.
👉అక్టోబ‌రు 16న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం.
👉అక్టోబ‌రు 20న గ‌రుడ‌సేవ‌.
👉అక్టోబ‌రు 21న పుష్ప‌క విమానం.
 👉అక్టోబ‌రు 24న చక్ర‌స్నానం.
👉అక్టోబ‌రు 25న పార్వేట ఉత్స‌వం.

నమోవెంకటేశ...

Monday, 28 September 2020

తిరుమలలో భాగ్ సవారీ ఉత్సవం...

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సోమ‌వారం సాయంత్రం ”భాగ్‌సవారి” ఉత్సవం ఏకాంతంగా నిర్వ‌హించారు.
తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సోమ‌వారం సాయంత్రం  ”భాగ్‌సవారి” ఉత్సవం ఏకాంతంగా నిర్వ‌హించారు.l
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బందీస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బందీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. 
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవంలో భాగంగా సాయంత్రం 4.00 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి, స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేంచేపు చేశారు.  కోవిడ్ – 19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.   

అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర నిర్వ‌హించారు. 

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌‌నాథ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Sunday, 27 September 2020

శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం..


తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆది‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం అయిన మ‌హ‌ల్ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో  ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 8.15 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.
          ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

          ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం  చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు  పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
చక్రస్నానం - లోకం క్షేమం
         తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.
        చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.
   ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకున్నవారికి..చూసిన వారికి సమస్త సన్మంగళములు చేకూరులని రుత్వీక్కులు ఆశీస్సులు అందజేస్తున్నారు

Friday, 25 September 2020

.బాలుకు హిందూపురం పాస్టర్ల నివాళి..

ప్రముఖనేపద్యగాయకుడుSpబాలసుబ్రమణ్యం గారి మృతికి హిందూపురం యునైటెడ్ పాస్టర్స్&క్రిస్టియన్ లీడర్స్ అసేసియేసన్ సభ్యులు నివాళి అర్పించారు.
కదిలింది కరణరథం అంటూ 1978లో ప్రారంభించి నేటి వరకు తెలుగు క్రైస్తవలోకానికి ఎన్నో  అద్బుతమైన ఆత్మీయగీతాలను ఆలపించి అనేకహృదయాలలో ప్రతిద్వనించిన ప్రముఖగాయకులైన Spబాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతిచేకూరాలని హిందూపురం క్రైస్తవులు, యునైటెడ్ పాస్టర్స్&క్రిస్టియన్ లీడర్స్ ప్రార్థించారు. ఈకార్యక్రమములో రెవ.S.సూర్యప్రకాష్ .ప్రెసిడెంట్,.రెవ.M.దేవరాజుగారు.సెక్రటరి..,రెవ,.NG,సుదాకర్,కన్వీనర్ పాల్గొన్నారు.

సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై కేశ‌వ‌మూర్తి అలంకారంలో సిరినివాసుడు..

తిరుమ‌ల‌: సూర్యనారాయణ మూర్తిగా శ్రీనివాసుడు..సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై కోటికాంతులతో భక్తులకు దర్శనం ఇచ్ఛి న మ‌ల‌య‌ప్ప‌...
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్ర‌‌‌వారం ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు  శంఖు, చక్రం, గ‌థ‌‌, అభ‌య‌హ‌స్తం ధ‌రించి చ‌తుర్భు‌జ కేశ‌వ‌మూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు.
సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తి
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
        

Thursday, 24 September 2020

సర్వభూపాలవాహ‌నంపైశ్రీదేవిభూదేవిస‌మేతశ్రీ‌మలయప్ప

  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం  సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు #స్వ‌ర్ణ‌ర‌థంబదులుగాశ్రీవారిఆలయంలోనిక‌ల్యాణోత్సవమండ‌పంలోశ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతోకలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.
 సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.   అనంతరం రాత్రి 7.30 గంటలకు శ్రీవారు గజవాహనంపై  లక్మీరమణునిగా దర్శనం ఇచ్ఛారు.కాగా ఉదయం తిరుమల గిరి రాయలు...
శ్రీరామ చంద్రునిగాధనుర్బాణాలతో..అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుని భూజస్కందాలపై నిలచి భక్తులకు దర్శనమిచ్చారు...

బాలు గురించి 15 ఆసక్తికరమైన విషయాలు.


 గాత్రంలో బాషలకు అతీతమైన బాహుబలి
అతడు...
ఏ బాషలో పాడిన ఆ పదాలకు తనదైన ముద్ర వేసిన గానకంఠుడు అతడు..
అతనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం @ బాలు..
👉ఎస్బిపి తండ్రి హరికత కళాకారుడు. చిన్న వయస్సులో, అతను సంగీతాన్ని ఇష్టపడ్డాడు.
👉చిన్న వయస్సులో, తెలుగు సంగీత సంస్థ నిర్వహించిన గానం పోటీలో పాల్గొని మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఆ బహుమతి అతనిలో గాయకుడిగా ఉండాలనే కోరికను కలిగించింది.
👉మాతృభాష తెలుగు. 'శ్రీశ్రీ మరియాథ రామన్న' చిత్రంలో తన మొదటి పాటను తెలుగు స్వరకర్త సంగీతం పాడారు
👉SP బాలసుబ్రమణ్యం.
1969 లో శాంతి నిలయం చిత్రానికి 'ఇలయకన్నీ' పాట పాడటం ద్వారా ఆమె తమిళంలో ప్లేబ్యాక్ సింగర్‌గా అడుగుపెట్టింది.
👉'ఇలయకన్నీ' విడుదలకు ముందే, 'ఆదిమైప్పెన్' చిత్రంలోని 'అయిరామ్ నీలవే వా' పాటతో ఆమె గొంతు తమిళ ప్రపంచంలో వినడం ప్రారంభమైంది.
👉మిన్చారకనవు చిత్రంలో నటించిన 'తంగత్ తారగై మగలే' పాట కోసం జాతీయ అవార్డును అందుకున్న బాలు.
👉తమిళం, తెలుగు, కన్నడ, హిందీ అనే నాలుగు భాషల్లో పాడిన వివిధ పాటలకు ఇప్పటివరకు ఆరుసార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
👉 గాయకుడు మాత్రమే కాదు, కొన్ని చిత్రాలకు డబ్బింగ్ నటుడిగా చాలా చిత్రాలలో నటించిన బాలు
👉ఎస్.బి.బాలాసుబ్రమణ్యం ఒక సినిమాలో పాడిన చాలా పాటలకు గిన్నిస్ రికార్డును కూడా కలిగి ఉన్నారు.
ఒక రోజులో 19 పాటలను రికార్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
👉 క్రికెట్ ఆటపై చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తన సంతకం చేసిన టోపీని ఎస్బిపికి బహుమతిగా బహుమతిగా ఇచ్చారు.
👉2016 లో 47 వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016 లో రజనీకాంత్, ఇళయరాజా, అమితాబ్ బచ్చన్లతో సహా అగ్ర తారలతో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు.
👉భారత ప్రభుత్వ పద్మశ్రీ - పద్మభూషణ్ అవార్డులను అందుకున్న బాలసుబ్రహ్మణ్యం. చిత్రలేఖనాన్ని ఆనందిస్తారు. వేణువును బాగా ప్లే చేస్తారు.
👉గాయకుడిగానే కాకుండా స్వరకర్త, ప్లేబ్యాక్ వాయిస్ మరియు క్యారెక్టర్ యాక్టర్‌గా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన నంది ఫిల్మ్ అవార్డులను ఎస్బిపి గెలుచుకున్నారు.
👉 వివిధ భాషలలో దాదాపు 60 చిత్రాలకు సంగీతం సమకూర్చిన బాలు..

.

హిందూ సంప్రదాయం గౌరవ సూచకం.. శ్రీవారి బొట్టును ధరించిన ఎ.పి. సి.ఏం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

 ఎ.పి సి.ఎం.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గురువారం ఉదయం శ్రీవారిని కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో కలసి దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా భావించే తిలకాన్ని దిద్దారు..  అనంతరం కర్నాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మాణం గావించనున్న  యాత్రి సథన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..
ఈ సందర్భంగా నాదనీరాజనం మండపంలో జరుగుతున్న సుందరాకాండ పారాయణం కార్యక్రమం వద్ద ఇరువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

Wednesday, 23 September 2020

గరుడ వాహనం పై భక్తలను కటాక్షించిన గోవిందుడు... వెంకన్నకు పట్టు వస్త్రాలను సమర్పించిన ఎ.పి.సి.ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన మలయప్పస్వామి భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిచ్చాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నారు.
అంతకు ముందు...
తిరుమ‌ల‌లో ఎపి సి.ఎం.   వై..ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి ఘన స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం సాయంత్రం తిరుమలలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. వీరికి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
విమానాశ్ర‌యంలో  గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ స్వాగ‌తం ప‌లికారు.
        ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి,  శ్రీ గౌత‌మ్ రెడ్డి, శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, శ్రీ వేణు గోపాలకృష్ణ, చీఫ్‌‌విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి, తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు శ్రీ క‌రుణాక‌ర్‌రెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

మోహినీ అవతారంలో మలయప్ప.. మోహపరవశంలో భక్తజనం...


శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌‌వారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.
మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం      
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
కాగా నేటి రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షించనున్నారు.
గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీమ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా.నిశ్చిత‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Tuesday, 22 September 2020

పబ్లిసిటీ చేయలంటే తెలివి తేటలు ఉండాలి : మంత్రి తలసాని వాఖ్య


*హైద‌రాబాద్ :  ప్రతిపక్షాలవి పనికిరాని తెలివితేటలని  మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్‌ అన్నారు. డబుల్రో బెడ్రూమ్లల నిర్మాణంలో కొద్దీ రోజులుగా..కాంగ్రెస్ట్ నేత  విక్రమార్క చెస్తున్న ఆరోపణలపై మరోసారి మంత్రి స్పందించారు.. కరోనా  కిట్ల విషయంలో నూ..డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల విషయంలోను కాంగ్రెస్ పార్టీ అర్థరహితంగా మాట్లాడుతూ అతి తెలివితో వ్యహరించిందని,  ఆ నిర్మాణాల‌ను చూపించేందుకు సిద్ధ‌మైన ప్రతిపక్షాలు నేతలు చాలినంత సమయం ఇవ్వకుండా రాధ్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్.. కేటీఆర్. దిశానిర్దేశంలో తాము తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నామని. మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇండ్లు* *క‌ట్ట‌లేద‌ని భ‌ట్టి అన‌డం స‌రికాదని *ఒక వేళ ఆయ‌న జీహెచ్ఎంసీలో స్థ‌లం చూపిస్తే అక్క‌డ త‌ప్ప‌కుండా ఇండ్ల నిర్మాణం చేప‌డుతామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ల‌క్ష ఇండ్ల‌కు సంబంధించిన జాబితా ఇస్తే పరిశీలించకుండా మరోమారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా డబుల్ బేడ్రూమ్ నిర్మాణాల విషయంలో కాగితాలపై లెక్కలే గాని కట్టిన లేక్కలు ఎక్కడో చూపాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మరోసారి సవాల్ విసిరారు .

గోవుల గోపన్నగా గోవిందుడు.... కల్పవృక్ష వాహనంపై కనువిందు చేసిన ఏడుకొండల రేడు....

క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తుల కోరికలు ఈడేర్చే కల్పతరువుగా తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాసుడు దర్శనం ఇచ్ఛాడు.
త‌ల‌పాగా, జాటీతో గోపాల నందనందునిగా మ‌ల‌య‌ప్ప కనువిందు చేశాడు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష‌‌ వాహనంపై త‌ల‌పాగా, జాటీతో గోవుల గోప‌న్న‌గా దర్శనమిచ్చారు.
క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

Sunday, 20 September 2020

రైతు చేతికి అధికారం: ప్రధాని మోదీ


 వ్యవసాయ రంగ చరిత్రలో ఇదో శుభదినం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. 
ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే కోట్ల మంది రైతులకు చేతికి అధికారం వస్తుందని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కీలక బిల్లుల ఆమోదం అనంతరం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘దేశ వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం. ఈ బిల్లులు వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు కోట్లాది రైతుల చేతికి అధికారం ఇస్తుంది. దశాబ్దాలుగా రైతు సోదరసోదరీమణులు మధ్యవర్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లులు వారికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తాయి. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మా ప్రయత్నాలకు ఈ బిల్లులు దోహదపడతాయి. అంతేకాదు, మన వ్యవసాయ రంగానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. వీటితో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. దీంతో దిగుబడి పెరగడమే కాక.. మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇకపైనా రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కొనసాగిస్తామని, ప్రభుత్వం నుంచి పంటల సేకరణ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేయడానికే తాము ఉన్నామని, వారికి మెరుగైన జీవనం అందించడమే తమ లక్ష్యమని వివరించారు.

ఎండు ద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపు కొమ్ముల‌ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం.

manikumar

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఎండు ద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపు కొమ్ముల‌‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌ల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ గోవిందాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. ప‌లు ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేస్తుండ‌గా, ప్ర‌త్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. ఎండుద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపుకొమ్మ‌లు, తుల‌సి గింజ‌లు, తామ‌ర గింజ‌లు, త‌మ‌ల పాకులు, రోజా పూల రేకులు మ‌రియు ప‌గ‌డపు పూల‌తో త‌యారు చేసిన మాల‌లు అలంక‌రించామ‌ని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు.
ఆకట్టుకున్న ఫల పుష్ప మండపం
స్నపనతిరుమంజనం నిర్వహించే రంగ నాయ‌కుల మండపాన్నివివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియ బ‌త్త‌యి, ద్రాక్ష గుత్తుల‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. క‌మ‌నీయంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు.

Saturday, 19 September 2020

ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.


శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శ‌ని‌వారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ గోవిందాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను(దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం.
విశ్వ‌మంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తించ‌బ‌డుతున్నారు. కాగా, ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం(ముద్గ‌ర‌) ప్ర‌సాద వినియోగం జ‌రిగింది. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. అదేవిధంగా, ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.
ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందుకు సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ కుమార‌గురు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు తదితరులు పాల్గొన్నారు.c

Friday, 18 September 2020

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోనే శాస్త్రోక్తంగా బ్ర‌హ్మోత్స‌వాలు.. 23న స్వామివారికి సిఎం జగన్ ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ...

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య అంకురార్ప‌ణ జ‌రిగిందని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంట‌ల మ‌ధ్య‌ మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌ంంకాగా. ఈ నెల 23వ తేదీ గ‌రుడ‌సేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందువ‌ల్ల గ‌రుడ‌సేవ రోజు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  తిరుమల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో క‌లిసి శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. 
బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హింంచనున్నట్లు తెలిపారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుందని.
24వ తేదీ ఉద‌యం ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప‌తో క‌లిసి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటారని పేర్కొన్నారు. అనంత‌రం ఉద‌యం 7 గంట‌ల‌కు నాద‌నీరాజ‌న వేదిక మీద జ‌రిగే సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారని. ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ర్ణాట‌క స‌త్రాల నిర్మాణానికి ముఖ్య‌మంత్రులిద్ద‌రు భూమిపూజ చేయనున్నట్లు ఎస్వీ తెలిపారు. 
 ఈసారి స్వ‌ర్ణ‌ర‌థం, ర‌థ‌రంగ డోలోత్స‌వం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుందని.ఈ నెల 27వ తేదీన చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయని పేర్కొన్నారు.
 తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భ‌‌క్తులు ఎదురు చూస్తారని. ఈ ఏడాది కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో పాల‌క‌మండ‌లి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిందని అన్నారు.. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుపుతామని
స్వామివారికి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారన్నారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని తెలిపారు. టిటిడి ప్ర‌జాసంబంధాల విభాగం ద్వారా మీడియాకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, ఫొటోలు అందుతాయని చెప్పారు.
సిఎం ఆదేశం మేర‌కే కాగ్ ఆడిటింగ్‌
మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల టిటిడి మీద, ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీద చేసిన ఆరోప‌ణ‌ల గురించి విలేక‌రులు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డిని ప్ర‌శ్నించగా
తిరుమ‌ల‌లో రాజ‌కీయాంశాలు మాట్లాడ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని ఆయ‌న తిర‌స్క‌రించారు. 
మాజీ ముఖ్య‌మంత్రి టిటిడికి సంబంధించిన అంశాల‌పైనే ఆరోప‌ణ‌లు చేసినందువ‌ల్ల స్పందించాల‌ని విలేక‌రులు కోరారు.
గ‌త‌ ప్ర‌భుత్వ హ‌యాంలో టిటిడిలో జ‌రిగిన నిధుల దుర్వినియోగం, అవ‌క‌త‌వ‌క‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేని సంస్థ‌తో ఆడిటింగ్ చేయించాల‌ని ఎంపి సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హైకోర్టులో పిల్ వేశార‌ని ఛైర్మ‌న్ చెప్పారు. 
ఈ విష‌యం గురించి తాను ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన‌పుడు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా జ‌రిగిన నిధుల ఖ‌ర్చుపై కాగ్‌తో ఆడిటింగ్ చేయించాల‌ని సిఎం ఆదేశించారు. 
పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని సిఎం తీసుకున్న ఈ నిర్ణ‌యం మేర‌కు టిటిడి నిధుల వ్య‌యంపై కాగ్ ఆడిటింగ్ జ‌రిపించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీర్మానం చేశాం. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో జ‌రిగిన ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను, అవినీతిని తాము పూర్తిగా నిర్మూలించాం. తిరుమ‌ల‌లో ఎలాంటి అన్య‌మ‌త ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో నెల్లూరు ఆర్‌టిసి డిపోలో ముద్రించిన అన్య‌మ‌త ప్ర‌చార టికెట్ల‌ను కుట్ర‌పూరితంగా తిరుమ‌ల‌కు పంపిన విష‌యం విచార‌ణ‌లో తేలింది. దీని మీద పోలీసు కేసు కూడా న‌మోదైందని వివరించారు.
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మీద న‌మ్మ‌కం, భ‌క్తి ఉన్న అనేక‌మంది ఇత‌ర మ‌తాలకు చెందిన వారు ద‌ర్శ‌నానికి వ‌స్తారని కోవిడ్‌-19 నేప‌థ్యంలో టిటిడి ఆదాయం త‌గ్గినా స్వామివారి కైంక‌ర్యాలు, ఆగ‌మ కార్య‌క్ర‌మాలు ఎలాంటి లోటు లేకుండా కొన‌సాగుతున్నాయని పేర్కొన్నారు.
కోవిడ్ ఇబ్బందుల వ‌ల్ల బ్యాంకులు వ‌డ్డీ త‌గ్గించ‌డంతో గ‌తంలో టిటిడి డిపాజిట్ల మీద 9 శాతం దాకా వ‌చ్చే వ‌డ్డీ ప్ర‌స్తుతం 4.5 శాతానికి త‌గ్గింది. డిపాజిట్ల మీద అధిక వ‌డ్డీ ల‌భించేలా చేయాల‌నే ఉద్దేశంతోనే నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఆర్‌బిఐ గ్యారంటీ ఉంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సెక్యూరిటీ బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచించామన్నారు. సమావేశంలోటిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ
అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్న స‌మ‌యంలో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం లైవ్ ఉన్నందువ‌ల్ల ఎస్వీబీసీ ఆ కార్య‌క్ర‌మాన్ని లైవ్ ఇవ్వ‌లేక‌పోయిందని. ఆ త‌ర్వాత వార్త‌ల్లోను, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోను ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌సారం చేసిందని చెప్పారు.శ్రీ‌వారి ఆల‌యంలో హుండీ నిండిన త‌రువాతే కొత్త వ‌స్త్రం మార్చ‌డం జ‌రుగుతుందని.ఈ ఏడాది డిసెంబ‌రుకు రూ.5 వేల కోట్ల డిపాజిట్లు కాల‌ప‌రిమితి ముగుస్తుందని. ఆ త‌రువాత అధిక వ‌డ్డీ వ‌చ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌స్తామని చెప్పారు. 
శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ కోవిడ్ నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించినందున. చ‌క్ర‌స్నానానికి సంబంధించి ఆల‌యంలోనే ఏర్పాట్లు చేశామని. అయినా, అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం మార్పులు వుంటాయని చెప్పారు. అష్ట‌దిక్పాల‌కుల‌కు జ‌రిగే ఉప‌చారాలు, బ‌లి, నైవేద్యాల స‌మ‌ర్ప‌ణ ఆల‌య ప్రాకారంలోనే నిర్వ‌హింంచామన్నారు. ఈ మీడియా స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌,  సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. 

Thursday, 17 September 2020

తరలిన విష్ణు దర్భతాడు.. కన్నులపండువగా బ్రహ్మఉత్సవాల తొలి ఘట్టం ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం వేడుకలో ఉపయోగించే దర్భ చాప, తాడులను తిరుమలలో గురువారం సాయంత్రం ఊరేగింపుగా ఆలయ ధ్యజస్థంభం దగ్గర కు తీసుకుని వెళ్లారు.
వార్షిక బ్రహ్మోత్సవములు సాంప్రదాయ ధ్వజరోహనం ఫెటీతో ప్రారంభమవుతాయి, ఇక్కడ శాస్త్రీయంగా డెస్మోటాచ బిపిన్నట అని పిలువబడే ఈ పవిత్రమైన “దర్భ”( ఉష్ణమండల గడ్డి)కి వేద గ్రంథాలలో అత్యంత శక్తి వంతమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ పవిత్ర గడ్డితో చేసిన చాప, తాడు ఆలయ ధ్వజ  స్తంభంతో ముడిపడివున్నాయి.
 వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా ధ్వజస్థంభం పైన గరుడ జెండాను ఉంచి వేద మంత్రాల జపాల మధ్య వైఖానస అగామ సిద్ధాంతాల ప్రకారం పూజలు చేస్తారు.
కార్యక్రమం అనంతరం  డిఎఫ్‌ఓ టిటిడి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, ఇతిహాసాలు రెండు రకాల  దర్భాలు ఉన్నాయని చెబుతున్నాయి - శివ దర్భ,  విష్ణు దర్భ. శ్రీవారి ఆలయంలో చిత్తూరు జిల్లాలోని వడమలపేట ప్రాంతానికి సమీపంలో ఉన్న చెల్లూరు నుండి విష్ణు దర్భాను సేకరిస్తారు. ఒక వారం పాటు సూర్యకిరణాలలో ఎండబెట్టిన తరువాత, 7 × 2 మీటర్ల మత్ మరియు 212 అడుగుల తాడును పవిత్ర ధ్వజారోహనం కార్యక్రమానికి టిటిడి సిబ్బంది 16 రోజుల పాటు  అత్యంత భక్తితో పెనుతారని పేర్కొన్నారు.ఈ దర్భ తాడును శ్రీవారి ఆలయంలోని ఆలయ   హరింద్రనాథ్కు అప్పగించగా ఆయన రంగనాయకుల మండపంలో ఉన్న శేషవాహనం.  పైన ఉంచడంతో కార్యక్రమం పూర్ణం అయింది.
ఊరేగింపులో డిఇఒ పంచాయతీ, రెవెన్యూ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఎవిఎస్ఓ శ్రీ గంగరాజు, శ్రీ వెంకటరమణ, శ్రీ వీరబాబు, ఎఫ్‌ఆర్‌ఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. @ మణికుమార్.

Saturday, 12 September 2020

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు‌..


ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌ని‌‌వారం ఉద‌యం జరిగిన సుందరకాండలోని  12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయ‌ణం, శ్రీ‌రామ నామ స్మ‌ర‌ణ‌తో  తిరుమ‌లగిరులు పుల‌కించాయి.
 ఈ సంద‌ర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ మాట్లాడుతూ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామ‌య‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్నిటిటిడి అద్భుతంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తు‌న్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హం వ‌ల‌న త్వ‌ర‌లో క‌రోనా వైర‌స్ న‌శించి ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌న్నారు.  
 సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ ‌ప్ర‌పంచ ప్ర‌జ‌ల యోగ‌ క్షేమం కొర‌కు టిటిడి 156 రోజులుగా శ్రీ‌వారి అనుగ్ర‌హంతో మంత్ర పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు తెలిపారు. సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో 94వ రోజైన శ‌నివారం 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను  4వ విడ‌త అఖండ పారాయ‌ణం నిర్వ‌హించామ‌న్నారు.
అఖండ పారాయ‌ణంలో భాగంగా జూలై 7 నమొద‌టి ప‌ర్యాయం ప్ర‌థ‌మ‌స‌ర్గ‌లోని 211 శ్లోకాల‌ను, ఆగష్టు 6 న 2వ ప‌ర్యాయం ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను, ఆగస్టు 27 న 3వ ప‌ర్యాయం అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను పారాయ‌ణం చేసిన‌ట్లు తెలిపారు.
కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ప్రసిద్ధ త్యాగరాజ పంచరత్న కృతులు  " జగదానందకారక.... జ‌య జ‌నాకి ప్రాణ‌ నాయక......"   అనే సంకీర్త‌న‌తో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ బి.ర‌ఘునాథ్ బృందం అందించిన హనుమాన్ భజన్‌తో కార్య‌క్ర‌మం ముగిసింది.
           అఖండ పారాయ‌ణంలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధానితో క‌లిసి శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ శేషాచార్యులు పారాయ‌ణం చేశారు. ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.
           ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  శ్రీ మోహ‌న రంగ‌చార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌,  శ్రీ‌వారి ఆల‌య ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి శ్రీ విభీష‌ణ శ‌ర్మ  పాల్గొన్నారు.

అంతర్వేది ఘటన తరువాత ఆలయాలకు మరింత భధ్రత : తిరుపతి అర్భన్ యస్.పి.రమేష్ రెడ్డి

తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.  బ్రహ్మోత్సవాల నేపధ్యంలో భధ్రతా ఏర్పాట్లపై టి.టి.డి సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీస్ వ్యవస్థ కూడా కట్టు దిట్టమైన చర్యలు చేపడుతున్నాయని తిరుపతి అర్భన్ ఎస్.పి.రమేష్ రెడ్డి పేర్కొన్నారు. 
అంతర్వేదిలో జరిగినటువంటి రధం దగ్ధం తరువాత అన్ని ప్రాంతాలకు సంబందించిన ఆలయాలలు, రధాలు, ఆలయ పరిసర ప్రాంతాల భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఆయన  అన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు  ఈ  నెెెల 19 నుండి ఏకాంతంగా జరుగుతున్నందున ఆ సమయంలో ఆన్లైన్ లో ముందుగా టికెట్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీ వారి దర్శనానికి అనుమతిస్తూoదన మరియు Covid-19 ను దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, అలాగే ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం కూడా ఉన్నందున వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని Covid-19 ప్రభుత్వ నిబందనల మేరకు చర్యలు చేపట్టి భందోబస్తూ ఏర్పాటు చేస్తున్నామన్ననారుత. కచ్చితంగా ఆలయాలకు సంబంధించిన ప్రతి సంపదను వాటి యొక్క పరిరక్షణను కాపాడుతామని. జిల్లాలో మొత్తం 656 చిన్నా, పెద్దా ఆలయాలను  ఎప్పటికప్పుడు పోలీసులు విసృతంగా తనికీలు చేయడం జరుగుతుందిని ఎస్పీ అన్నారు. పలుచోట్ల అధికారులను., సిబ్బందిని మరియు ప్రజలను చైతన్యపరచటం జరిగిందని. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజలు తమకు వెంటనే తెలియపరచాలనివిజ్ఞప్తి చేశారు.     ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకొని మతసామ్యరసాన్ని దెబ్బతీసే విధంగా ఏమైనా చర్యలుగాని చేసినట్లైతే అది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, సోషల్ మీడియా ద్వారా కావొచ్చు చేసిన వారిపై   కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్.పి. హెచ్చరించారు.         బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఇప్పుడు ఏ పద్దతైతే అవలంబిస్తున్నామో టిక్కెట్ ఉన్న వారిని మాత్రమే కొండమీదకు అనుమతించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం భక్తులు అందరు కూడా గమనించవలసినదిగా ప్రార్థన. శ్రీ వారి సేవలు ఏకాంతంగా జరుగుతాయి కాబట్టి మిగత సమయాల్లో స్వామి వారి దర్శనం ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది. అనవసరంగా ఎక్కువ ప్రజలు అలిపిరి వద్ద వచ్చి టికెట్స్ ఇస్తారని గుమ్మి కూడటంలాంటివి చేయకూడదని విన్నపం చేసుకుంటున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్దలతో ఎవరి మనోభావాలను కించపరచకుండా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మతసామ్యస్త్రం పాటించాలని వాటికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మేము హెచ్చరించడం కూడా జరిగింది. AP Public Safty Act కింద దాదాపు 150 ఆలయాలకు నోటీసు కూడా జారీ చేయటం జరిగింది. ఎక్కడైతే సి.సి. కెమెరాలు లేవో అక్కడ సి.సి కెమరాలు పెట్టించి వాటి యొక్క జాగ్రత్త తెసుకోవలసిందిగా తెలియజేశాము. పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వదల్చినా కూడా మాకు 8099999977 కు మరియు డయల్ 100 కు తక్షణమే సమాచారం అందించి సహకరించాలి. తప్పని సరిగా పోలీస్ వారు 10 to 15 నిమిషములలో చేరి అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుక్కోవడానికి సిద్దంగా ఉంటారని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు తిరుమల యందు తెలియజేసాాారు

Wednesday, 9 September 2020

తేనెపట్టుల కోసం ప్రయత్నంలో రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా: అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనలో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. తేనెపట్టుల కోసం కొందరు చేసిన ప్రయత్నం వికటించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.

ఈ షెడ్‌లో ఒకవైపు తెరిచి ఉంచి ఆ భాగాన్ని తాటాకులతో కప్పి ఉంచారు  రథాన్ని ఒక షెడ్‌లో ఉంచగా ఈ రథానికి తేనెపట్టులు పట్టాయి గమనించిన కొందరు వ్యక్తులు తేనెపట్టులు తీసుకునే ప్రయత్నంలో. తేనెటీగలను చెదరగొట్టేందుకు 20 అడుగుల గెడ తెచ్చి దానికి, కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడా సాయంతో తేనెటీగలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు  ఆ ప్రయత్నంలోనే కాగడా జారిపడి తాటాకులకు నిప్పు అంటుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో పాటు తేనెతుట్టెలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు.

Tuesday, 8 September 2020

విజయవాడలో హవాలా నగదు ప‌ట్టివేత‌..

 విజయవాడ :హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.1.47 కోట్ల విలువైన నగదు, 34 వేల అమెరికన్ డాలర్లు, ఒక కారును స్వాధీనం
విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ ఏ.డి.సి.పి. కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపిలు టి.కనకరాజు, వి.ఎస్.ఎన్.వర్మ, ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్ మరియు వారి సిబ్బందితో కలసి విజయవాడ, భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని, గొల్లపూడి, వై-జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఏపీ 37 బి డబ్ల్యూ 4532 నెంబరు గల షిఫ్ట్ కారులో ప్రత్యేకంగా సీటు వెనుక ఏర్పాటు చేసిన బాక్సులలో అమర్చి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో హవాలా నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.1 కోటి 47 లక్షల విలువ గల నగదు, 34 వేల ఆమెరికన్ డాలర్లు మరియు ఒక షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు.
వివరాలలోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబులు ఇద్దరు అన్నదమ్ములు వీరిద్దరు గత కొంత కాలంగా నరసాపురంలో గల దేవి జ్యూయలరీ మార్ట్ నందు పని చేయుచుండగా సదరు షాపు యజమాని అయిన ప్రవీణ్ కుమార్ జైన్ తన వద్ద పని చేస్తున్న పై ఇద్దరు నిందితులకు రూ. 50 లక్షలు, వేలు (సుమారు రూ. 25 లక్షలు) గల అమెరికన్ డాలర్లు కలిగిన హవాలా నగదు, విజయవాడకు చెందిన మరో నలుగురు వ్యక్తుల వద్ద నుండి (రూ. 50 లక్షలు వల్లూరి శివనాథ్ వద్ద, రూ.20 లక్షలు భారతీయ వద్ద, రూ.15 లక్షలు ఉత్తం వద్ద, రూ. 12 లక్షలు దివాకర్ వద్ద) రూ.97 లక్షలు హవాలా నగదు మొత్తం కలిపి రూ.1 కోటి 47 లక్షల నగదు మరియు 34 వేలు అమెరికన్ డాలర్లను తీసుకుని హైదరాబాద్ లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ జైన్ సోదరుడు అయిన కీర్తికి ఇచ్చిరమ్మని ఎటువంటి బిల్లులు లేనటువంటి హవాలా నగదును ఏపీ 37 బి డబ్యూ 4532 నెంబరు గల షిఫ్ట్ కారులో సీటుకు వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులలో సదరు నగదును అమర్చి తరలిస్తుండగా సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని అక్రమ మార్గంలో రవాణా చేయబడుతున్న కావాలి నగదు సుమారు రూ.1 కోటి 47 లక్షల నగదు మరియు 34 వేలు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు నిమిత్తం భవానీపురం పోలీసు వారికి నిందితులను అప్పగించడం జరిగింది. 
మరియు ఇంకంట్యాక్స్ అధికారులకు, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇ డి) వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. 
ఈ సందర్భంగా హవాలా నగదును తరలిస్తున్న నలుగురు నిందితులైన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబు, వల్లూరి శివనాద్, ప్రవీణ్ కుమార్ జైన్లను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.

Saturday, 5 September 2020

ఈనెల 12 నుండి 80 ప్రత్యేక రైళ్లు...

సెప్టెంబర్ 12 నుంచి తిరిగే 80 ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల...80 ప్రత్యేక రైళ్లకు భారతీయ రైల్వే గ్రీన్‌సిగ్నల్..  భారతీయ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. సెప్టెంబర్ 10 నుంచి రిజర్వేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు వచ్చి చేరుతాయని  రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ శనివారంనాడు తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కోసం అదేమార్గంలో సమాంతర రైళ్లు (క్లోన్ ట్రైన్స్) నడుపుతామని కూడా ఆయన వెల్లడించారు.'ఏదైనా రైలుకు డిమాండ్ ఎక్కువై, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్లోన్ రైళ్లను ఆ వెనుకనే నడుపుతాం. అందువల్ల ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు' అని వీకే యాదవ్ తెలిపారు. పరీక్షలు, ఇదే తరహా కారణాలతో రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా రైళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. బుల్లెట్ ట్రైన్స్‌పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతి దశలో ఉందన్నారు. భూముల సేకరణ నిర్ధారణ అయిన తర్వాత ట్రైమ్ ఫ్రేమ్‌లో పని జరుగుతుందన్నారు. గుజరాత్ నుంచి 82 శాతం, మహారాష్ట్ర నుంచి 23 శాతం భూసేకరణ ఉంటుందన్నారు.

భారత సైన్యం మానవీయ విలువలకు చైనీయుల వందనం

భారత - చైనా  సరిహద్దు ప్రాంతాలు లేహ్..లాడ్డాక్  లలో చైనా దుందుడుకు పనులను ధీటుగా తిప్పి కొడుతున్న భారత సైన్యం.. మరోవైపు మానవీయ విలువలతో చైనా పౌరులకు ఆండగా నిలిచి వారి మనసులు గెలుకుంటోంది ..
ఉత్తర సిక్కింలో చిక్కుకున్న చైనీయులకు..వైధ్య సహకారాన్ని అందజేయడంతో పాటు వారికి ఆహారం అందజేసింది భారతీయ సైన్యం. ఉత్తర సాక్కింలో  చైనా - భారత్ సరిహద్దుల్లో దాదాపు ..17,500 ఏత్తు కొండ ప్రాంతంలో. చైనీయుల వాహనం రిపేర్ కారణంగా అక్కడికక్కడే నిలిచింది.. గమనించిన భారత సైనికులు.. వారికి ఆక్సిజన్.. వైధ్యంతో పాటు..ఆహారం అందజేశారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు కారును రిపేర్ చెయడంతో . ఇబ్బంది తమను కాపాడిన భారత సైనికుల మానవీయ విలువలకు చైనా పౌరులు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి హరీశ్ రావు కు కరోనా...


తెలంగాణా మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్టాఫ్ ,ఎమ్మెల్యే లకు, మీడియా ప్రతినిధులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
 ఈ రోజు అసెంబ్లీలో టెస్ట్ చేపించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోవిడ్ రిపోర్ట్  నెగటివ్ రాగా మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న ప్రగతి భవన్లో సీఎం మంత్రులతో అసెంబ్లీ సమావేశాలపై చర్చ లో పాల్గొన్నారు. అయితే జూన్ నెలలోనే తన పీఏ కి కరోనా సోకగా హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలోని ఓ వ్యక్తిగత సహాయకుడికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్పుడు మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు.కాగా ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని. తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హారిష్ రావు సూచించారు..

తిరుమలలో ప్లాస్టిక్ బంద్..

తిరుమల లడ్డులకు ఇప్పటి వరకు అందజేస్తున్న ప్లాస్టిక్ కవర్ల స్థానంలో టిటిడి క్లాత్ సంచులను అమ్మకానికి పెట్టింది.. రకరకాల కవర్లు..అందుబాటులోకి తెచ్ఛిన టిటిడి.. లడ్డులను కొనుగోలు చేసిన వారికి క్లాత్ బ్యాగ్ ధరల పట్టిక ఏర్పాటు చేశారు. 

Friday, 4 September 2020

అక్టోబర్ 17 నుండి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..

విజయవాడ : 
అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు నిర్వహణకు ఆలయ అధికారులు సన్నధం అవుతున్నారు..9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మకు 
వేదమంత్రాల నడుమ కుంకుమ అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు
అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ 
18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా...
19న శ్రీ గాయత్రీ దేవిగా,
 20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా , 
21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ 
22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 
23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 
24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ 
25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం...    అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం
కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం. 
రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు.
గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు 
ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్న దుర్గగుడి అధికారులు.