Wednesday, 23 September 2020

గరుడ వాహనం పై భక్తలను కటాక్షించిన గోవిందుడు... వెంకన్నకు పట్టు వస్త్రాలను సమర్పించిన ఎ.పి.సి.ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన మలయప్పస్వామి భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిచ్చాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నారు.
అంతకు ముందు...
తిరుమ‌ల‌లో ఎపి సి.ఎం.   వై..ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి ఘన స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం సాయంత్రం తిరుమలలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. వీరికి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
విమానాశ్ర‌యంలో  గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ స్వాగ‌తం ప‌లికారు.
        ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి,  శ్రీ గౌత‌మ్ రెడ్డి, శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, శ్రీ వేణు గోపాలకృష్ణ, చీఫ్‌‌విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి, తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు శ్రీ క‌రుణాక‌ర్‌రెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment