*హైదరాబాద్ : ప్రతిపక్షాలవి పనికిరాని తెలివితేటలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డబుల్రో బెడ్రూమ్లల నిర్మాణంలో కొద్దీ రోజులుగా..కాంగ్రెస్ట్ నేత విక్రమార్క చెస్తున్న ఆరోపణలపై మరోసారి మంత్రి స్పందించారు.. కరోనా కిట్ల విషయంలో నూ..డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల విషయంలోను కాంగ్రెస్ పార్టీ అర్థరహితంగా మాట్లాడుతూ అతి తెలివితో వ్యహరించిందని, ఆ నిర్మాణాలను చూపించేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు నేతలు చాలినంత సమయం ఇవ్వకుండా రాధ్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్.. కేటీఆర్. దిశానిర్దేశంలో తాము తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నామని. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్లు* *కట్టలేదని భట్టి అనడం సరికాదని *ఒక వేళ ఆయన జీహెచ్ఎంసీలో స్థలం చూపిస్తే అక్కడ తప్పకుండా ఇండ్ల నిర్మాణం చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. లక్ష ఇండ్లకు సంబంధించిన జాబితా ఇస్తే పరిశీలించకుండా మరోమారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా డబుల్ బేడ్రూమ్ నిర్మాణాల విషయంలో కాగితాలపై లెక్కలే గాని కట్టిన లేక్కలు ఎక్కడో చూపాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మరోసారి సవాల్ విసిరారు .
No comments:
Post a Comment