Monday, 30 January 2023
నేను చూసిన తిరుమల రధసప్తమి..
Thursday, 26 January 2023
ఖమ్మంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వి పి గౌతం ...
Wednesday, 25 January 2023
నేలకొండపల్లిలో ఘనంగా భక్తగ్రేసరుడు రామదాసు జయంతి వేడుక...
ఈ సందర్భంగా ధ్యాన మందిరంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వేద పండితులచే చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. భక్త రామదాసు విగ్రహంపై నిర్మించిన మండవ గోపురంపై కలశం ప్రతిష్ట, సంప్రోక్షణ, తీర్థ ప్రసాదాలు, మాలాధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భక్త రామదాసు జన్మ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియం నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీ నిధులు రూ. 10 కోట్లలో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 3 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Tuesday, 24 January 2023
ప్రకృతి వనంలో మొక్కలు నాటిన కలేక్టర్
Saturday, 21 January 2023
తెలంగాణలో రహాదారులు -భవనాలకు గృహానిర్మాణం..
హైదరాబాద్ : _తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది._ _రాష్ట్ర రహదారులు, భవనాల శాఖలో గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు._
గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేశారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆస్తులు, పథకాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ బీ శాఖలోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ శాఖలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో పాటు బలహీనవర్గాల గృహ నిర్మాణాన్ని ఇతర శాఖలు చేపడుతున్నందున ఈ శాఖను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాఖలోని గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
శాఖలో మిగిలిన అంశాలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేసింది. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలనా శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Wednesday, 18 January 2023
గులాబీ దళపతి కెసిఆర్ భుజం తట్టారు...ఎర్రదండు నేత కరచలనం చేశారు.. ఇది ఖమ్మం కలెక్టర్ కు దక్కిన ప్రత్యేక గౌరవం..
Friday, 13 January 2023
ప్రగతి భవన్ లో ఘనంగా జరిగిన గోదాదేవి కళ్యాణం..పాల్గొన్న కెసిఆర్ దంపతులు....
ఘనంగా ముగిసిన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు
Thursday, 12 January 2023
సరిహద్దుల్లో డ్రోన్ల వేట..తలపై రూ.45లక్షల రివార్డు..!*చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్న హిడ్మా?.
హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా వేట.. చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్న హిడ్మా?.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు
భూపాలపల్లి, చర్ల, జనవరి 11:
పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ హిడ్మా కోసం హెలికాప్టర్.. డ్రోన్ ల వేట కొనసాగుతోంది..
తలపై రూ.45లక్షల రివార్డు వున్న హిడ్మా ఆచూకీ దండకారణ్యంలో పోలీసులకు సవాల్‌గా మారిన నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిద్ముల్లా టార్గెట్‌గా పోలీసులు స్పెషల్ ఆపరేషన్‌ను చేపట్టారు.
భద్రాద్రి జిల్లా చర్ల మండల సరిహద్దులోని.. ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చింతల్నార్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలౌరీ అడవుల్లో హిడ్మా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఓ బృందం బుధవారం సాయంత్రం హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఈ క్రమంలో హెలికాప్టర్ యాంపురం గ్రామం సమీపంలోని అడవుల వద్దకు చేరుకోగానే.. కింది నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. హెలికాప్టర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఆ సమయంలో హిడ్మా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా, అతని అనుచరులు ఈ దాడిలో మృతిచెందినట్లు ప్రచారం జరిగినా.. పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. ‘‘హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా బేస్‌క్యాంప్ చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు’’ అని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. హిడ్మాపై రూ.45లక్షల రివార్డు ఉంది. భద్రతా దళాలను హతమార్చిన ఘటనల్లో హిడ్మా కీలక నిందితుడు. పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు.
*కన్నుగప్పి తప్పించుకున్న హిడ్మా?*
దండకారణ్యంలో అణువణువూ తెలిసిన హిడ్మా.. పోలీసుల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి హిడ్మా బలౌరీలో సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడి నుంచి చుట్టూ నాలుగు అంచెల్లో హిడ్మా అంగరక్షకులు కాపుకాచారని తెలుస్తోంది. కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాల హెలికాప్టర్, డ్రోన్లు బలౌరీ వైపు వెళ్తుండడాన్ని గమనించే.. యాంపురం వద్ద ఉన్న హిడ్మా అనుచరులు కాల్పులు జరిపినట్లు స్పష్టమవుతోంది. పోలీసు తేరుకొనేలోపే హిడ్మా ఎస్కేప్ అయినట్లు తెలిసింది.
*తెలంగాణ సరిహద్దుల్లో హైఅలెర్ట్*
ఛత్తీస్ గఢ్ కాల్పుల ఘటన నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు తెలంగాణలోకి వచ్చే అవకాశాలుండడంతో.. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం సరిహద్దుల వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు.
*అటవీ గ్రామాల్లో దాడులు: మావోయిస్టులు*
సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల ఏరియల్ దాడులను మావోయిస్టులు ఖండించారు. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లోని గ్రామాల్లో వైమానిక బాంబు దాడులు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సుక్మా సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో బుధవారం అర్ధరాత్రి ఓ లేఖ విడుదలైంది. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ పోలీసులు డ్రోన్‌లు, హెలీక్రాఫ్టర్ల ద్వారా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
*హిడ్మా స్కెచ్ వేస్తే..*
2007లో సుక్మా జిల్లా ఉర్పల్‌మెట్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చాడు
2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు
2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర
2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చాడు
2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు.
శబరిమలై లో ప్రసాదాల అమ్మకం నిలిపివేత...6 లక్షల టిన్నులు తొలగింపు
*తిరువనంతపురం, కేరళ
శబరిమల అరవనంలో ఉపయోగించే ఏలకులు తీవ్రమైన క్రిమిసంహారం అని తేలింది. దీని ఆధారంగా సన్నిధానంలో అరవణ పంపిణీని హైకోర్టు అడ్డుకుంది. ఉన్న అరవణ పాయసం సీల్ చేయాలని కూడా కోర్టు సూచించింది. శబరిమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏలకులు లేకుండా అరవణాలను దేవస్వం బోర్డు తయారు చేసి పంపిణీ చేయవచ్చని హైకోర్టు కూడా చెప్పింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైకోర్టులో సమర్పించిన నివేదికలో ఏలకుల్లో తీవ్రమైన పురుగుమందులు ఉన్నాయని పేర్కొంది. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ పరిశీలించిన యలకుల్లో తీవ్రమైన మోతాదులో పురుగుమందులు ఉన్నట్లు తేలింది.
స్పైసెస్ బోర్డ్ పై తనిఖీ నిర్వహించారు. ఈ యాలకులో పద్నాలుగు జాతుల పురుగుమందులు ఉన్నాయి. ఇవి అనుమతించదగిన పరిమాణం కంటే ఎక్కువ. బబుల్ కిల్లర్స్ , కలుపు కిల్లర్స్ తనిఖీలో కనుగొనబడ్డాయి. ఇవి మానవ శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి దర్యాప్తులో కనుగొనడం సీరియస్ గా ఉందని కోర్టు గమనించింది. తినలేని యాలకులతో అరవణ తయారు చేస్తారా, అరవణ స్టాక్ ఎంత ఉందని గతంలో కోర్టు అడిగ
No Cyber Attacks Reported Said White House...All fleights or on Board in US
Wednesday, 11 January 2023
కంటివెలుగు విజయవంతానికి అందరికృషి అవసరం : కలెక్టర్ వి.పి.గౌతమ్.
Tuesday, 10 January 2023
ఏమ్మేల్సీ రేసులో 40 మంది..జగన్ కు చేరిన లిస్థు..... ఆధినేత మదిలో పార్వతి పురం నేత పేరంటున్న అబిజ్ఞ వర్గాలు..!!
Sunday, 8 January 2023
ఊహలు గుసగుసలాడే..
హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కుప్పం సంఘటన పై చర్చించారని తెలుస్తుండగా రాబోయే ఎన్నికల్లో పొత్తు
ఖరరైతే చంద్రబాబును పవన్ కళ్యాణ్ అడుగుతున్న సీట్లలో 24అసెంబ్లీ సీట్లు ఇవే.. అన్నట్లు ఊహాగానాలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..1. విశాఖ నార్త్
2. చోడవరం
3. గాజువాక
4. భీమిలి
5. యలమంచిలి
6.రాజానగరం
7. అమలాపురం
8.రాజోలు
9. కాకినాడ రూరల్
10. భీమవరం
11. నరసాపురం
12. తాడేపల్లి గూడెం
13. కైకలూరు
14. విజయవాడ పశ్చిమ
15. తెనాలి
16. సత్తెనపల్లి
17. గుంటూరు పశ్చిమ
18. పుట్టపర్తి
19. గిద్దలూరు
20. చీరాల
21. చిత్తూరు
22. తిరుపతి
23. దర్శి
24.అనంతపురం అర్బన్..
కాగా ఈనాటి బేటీ పై వైకాపా శ్రేణులు విమర్శలు గుప్పించాయి...