ఖమ్మం, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రగతిపై ఆయన సందేశం ఇచ్చారు. పాఠశాలల విద్యార్థులచే చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. గణతంత్ర వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డి.సి.సి.బి.చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఉమామామహేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా, అదనపు డి.సి.పి. డా. షబరిష్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment