Tuesday, 24 January 2023

ప్రకృతి వనంలో మొక్కలు నాటిన కలేక్టర్


ఖమ్మం, జనవరి 24: సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ భవన సముదాయం ఆవరణలో ఏర్పాటుచేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవన సముదాయం ఆవరణలో 3 ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 3 వేల మొక్కలు ఇట్టి వనంలో నాటుతున్నట్లు ఆయన అన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అంతకుముందు కలెక్టర్ భవన సముదాయం లోని ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్, కలెక్టరేట్ రికార్డు రూం లను సందర్శించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. సముదాయం లో అధికారుల, సిబ్బంది వాహనాల పార్కింగ్ పై సూచనలు చేశారు. పార్కింగ్, నో పార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. 
    ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్డీఓ విద్యాచందన, అధికారులు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment