Tuesday, 10 January 2023

ఏమ్మేల్సీ రేసులో 40 మంది..జగన్ కు చేరిన లిస్థు..... ఆధినేత మదిలో పార్వతి పురం నేత పేరంటున్న అబిజ్ఞ వర్గాలు..!!

రానున్న ఎమ్మెల్సీ ఎంపిక జాబితా లో ప్రస్తుత టిడ్కో ఛైర్మన్ ప్రసన్న కుమార్ కి చోటు దక్కినట్టు సమాచారం..గత ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికి జగన్ ప్రసన్న కుమార్ కి టిడ్కో ఛైర్మన్ పదవితో సరిపెట్టారు. అయితే ఛైర్మన్ పదవి ప్రసన్న కుమార్  నీ సంతృప్తి పరచలేకపో యింది. అందుకే ఓ వైపు పార్వతిపురం నియోజకవర్గం లో తిరుగుతూ మరో వైపు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పార్వతి పురం ఎమ్మెల్యే గా ఉన్న జోగారావు పై అనేక అవినీతి ఆరోపణలు, సొంత వర్గంలో చీలికలు రావడంతో ప్రసన్న కుమార్ కి జనాదరణ పెరుగుతుంది. గత ఎన్నికలలో ప్రసన్న కుమార్ కీ టికెట్ ఇవ్వకుండా జోగారావు కి టికెట్ ఇవ్వడం పై సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు విమర్శలు ఆలస్యంగా సంధిస్తున్నారు..ఈ తరుణంలో పార్వతి పురం కేడర్ రెండూ ముక్కలు అవుతుంది అని గమనించిన ప్రసన్న కుమార్ కి ఎమ్మెల్సీ  పదవి  ఇచ్చి ఓ వైపు ఓట్లు చిలకుండ మరో వైపు నాయకుడు పోకుండా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ ప్రసన్న కుమార్ చివరి వరుకు ఈ జాబితాలో ఉంటారా అనేది ప్రశ్న. ఇప్పటి వరకూ ప్రసన్న కుమార్ పేరు సొంత నియోజకవర్గం లో తప్పా పక్క వారికి తెలీదు. రాష్ట్రం మొత్తం TIDCO గృహాల వద్ద పర్యటన చేస్తున్న ఒక్క వార్త వచ్చిన దాఖలు లేదు.తిరుగుతూ పని చేస్తున్న ప్రచారం లేకపోవడంతో  ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న ఎమ్మెల్సీ ల జాబితాలో పదవీ వచ్చే జాబితా వరుకు చేరుకోవడం చాలా కష్టమే ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు డబ్బు, మందు, ప్రచారం చుట్టూ తిరుగుతూ వస్తున్నాయి అలాంటిది అన్నిటికీ దూరంగా ప్రయాణిస్తున్న ప్రసన్న కీ ఎమ్మెల్సీ పదవి ప్రసన్నం అవుతుందా అంటే పెద్ద ప్రశ్న గా మారింది. లేదా స్థానిక ఎమ్మెల్యే జోగారావు మీద ఉన్న ఆరోపణలు తో ప్రసన్న కుమార్ కి టికెట్ ఇస్తారా అంటే జోగారావు అవినీతి డబ్బు తో అందరి ( మీడియా,అధికారులు) నోరు మూసేస్తున్నాడు. ఇలాంటి కష్ట తరుణంలో ప్రసన్న కుమార్ కి టికెట్ వస్తుందా.. అతని సన్నిహితులు కి మాత్రం టికెట్ వస్తుంది అని ప్రసన్న కుమార్ చెప్పుకొని తిరుగుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి వద్ద ఉన్న 40 మంది లిస్ట్ లో ప్రసన్న కుమార్ పేరు ఉంది. మరి అందులో నుంచి లిస్ట్ కట్ ఆఫ్ 23 కి వెళ్తుంది. ఆ 23 మంది లో ఆయనకి చోటు దక్కితే అదృష్టవంతుడే అవుతాడు.

No comments:

Post a Comment