Friday, 13 January 2023

ప్రగతి భవన్ లో ఘనంగా జరిగిన గోదాదేవి కళ్యాణం..పాల్గొన్న కెసిఆర్ దంపతులు....


పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో  సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది. 
వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు శోభ దంపతుల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది.
హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది.

No comments:

Post a Comment