Monday, 30 January 2023

నేను చూసిన తిరుమల రధసప్తమి..


విమానాల్లో తిరిగే సాఫ్ట్వేర్ భార్య కుమారుడితో..తిరుమల తరలివచ్ఛి..తిరుమల మాడవీధిలో ఉదయం 4గంటలకే మాడవీధిలో కూర్చొని... సూర్యప్రభ వాహనం మొదలు..రాత్రి 8గంటల వరకు వచ్ఛిన ప్రతి వాహనానికి గ్యాలరీ నుంచే  కర్పూర హారతి ఇస్తూ ఉపవాసంతో తిరుమల వాసుని దోసిలి మొగ్గి ఆర్తితో..అను రక్తితో గోవిందా అంటున్న దృశ్యం నేను చూశాను..
హైదరాబాద్ నుండి 
ఇద్దరు ఆడపిల్లలతో 
తరలి వచ్ఛిన కోటిశ్వరుని ఇల్లాలిది అదే భక్తి..అదే ఆర్తి అదే అనుభూతి..
మరో రైతు ..ఇంకో వ్యాపారి..మరో ఉద్యోగి..ఇంకో చిరువ్యాపారి..మరో కూలి..ఇంకో చిరు ఉద్యోగి..
15 గంటల పాటు తిరుమల మాఢవీధుల్లో ఎంతో ఒపికగా ఎంతో ఒద్దికగా... గొవిందుని ఏడు వాహనాలకు..హారతులు ఇస్తూ.  అర్తిగా..గోవిందా అంటూ ఆత్మానందం పొందిన క్షణాలు ..కోవేల వదిలి.. భక్తులను కరిణించేందుకు..కటాక్షించేందుకు వచ్ఛిన లక్మీ వల్లభూనికి..పద్మావతి రమణునికి... ఆపద మొక్కులవానికి మాఢవీదుల్లో  అడుగడుగునా
నిరాజన కైంకర్యాలు... అధ్భుతం...అది అమోఘం...అందరి పట్ల ఆశ్రీత వత్సలునిది అదే అభిమానం..అదేవాత్సల్యం.. అదే కరుణా రసం..
కడగి ధనికుని మీద కురయు  చూపోకటే..పుడమి పేదనిపై వెలయు కరుణోకటే..కడు పుణ్యులను..పాప కర్ములను జడగాయూ వెంకటపతి నామమోకటే...
తిరుమల లో శనివారం.. సూర్య రధసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
ఉదయం నుండి రాత్రి వరకు 
ఏడువాహనాలపై తరలివచ్ఛిన శ్రీనివాసుని చూసి భక్తజనం పరవశించారు..
..................@ మణికుమార్ కొమ్మమూరు
తిరుమల శ్రీవారి సేవలో..మోబైల్ : 9032075966.
తిరుమల రధ సప్తమి వేడుకల బంధోబస్తుకు వచ్ఛిన కానిస్టేబుల్ ముస్లిం మతస్తుడు..
 సైతం తన విధులను ఎంతో బాధ్యత గా నిర్వహించారు..
వెంకటేశ్వరునితో తన అనుబంధాన్ని.. నాతో పంచుకున్నారు

No comments:

Post a Comment