శివాలయాల్లో పుష్యపూర్ణమి ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు హోమాలు అభిషేకాలు అర్చనలతో వివిధ శివాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు సందడి మొదలైంది ప్రముఖ క్షేత్రమైన అమరావతి శ్రీశైలం కాళహస్తి తదితర సవిక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి ముఖ్యంగా శైవుల ప్రప్రధమ శివాలయం తమిళనాడు శ్రీ రామనాథపురం జిల్లా లోని ఉత్తర కోసం మంగై మంగళ నాథ స్వామి..
ఈ లోకంలో ప్రప్రధమ శివాలయం ఉత్తరకోస మంగై మంగళనాధ స్వామి శివాలయం అని శైవులు ధృఢంగా చెప్తారు. దేవతలంతా ఉత్తరకోసమంగైలోనే మొదటిసారిగా ఆరుద్రా దర్శనం చేసుకున్నారని ప్రతీతి. ఇక్కడ వెలసిన పరమేశ్వరుడు స్వయంభూ ఈశ్వరుడని, కళ్యాణ సుందరేశ్వరుడని, ప్రళయకేశ్వరుడు, కైతై వనేశ్వరుడని, దురితపావకుడని, ఇలవంతికేశ్వరుడని పలు పేర్లతో పిలువబడుతూ బదరీవృక్షం క్రింద ప్రతిష్టించబడ్డాడు.
మూల విరాట్ మంగళనాధుడు స్వయంభూరూపంగా చతురస్ర పానువట్టంలో దర్శనమిస్తున్నాడు. అమ్మవారు మంగళాంబికాదేవి తన హస్తమునందు జపమాలతో దర్శనమిస్తున్నది. బలమైన వాద్య శబ్దాలకి మరకతం వంటి సున్నితమైన శిల బీటలు దీస్తుంది . అటువంటి సున్నితమైన మరకత శిలతో నటరాజ స్వామి విగ్రహం చేయబడినది. విగ్రహం 5 అడుగుల ఎత్తు వుంటుంది. ప్రపంచంలోనే అపురూప శిల్పంగా ఈ నటరాజ శిల్పం కీర్తించబడుతున్నది.ఇక్కడ నిత్యమూ మధ్యాహ్నం మరకత లింగానికి, స్ఫటిక లింగానికి జరిపే అభిషేకాలు విశేషమైనవి. ఈ ఆలయ స్ధలవృక్షమైన బదరీ వృక్షం 3000వేల సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు. ఈ ఉత్తరకోసమంగై ఆలయంలో ప్రాతఃకాల పూజలో అమ్మవారు ఈశ్వరుని పూజించడం ఐహీకం. ఆ విధంగానే నాయన్మరులలో ఒకరైన మాణిక్యవాచకర్ అనే పరమ శివభక్తుడు అమరజీవిగా వరం పొంది పరమేశ్వరునికి ఆహారం కైంకర్యం చేస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
తిరుప్పెరుంతురైలో మాణిక్యవాచకర్ కి పరమశివుడు స్వయంగా దర్శనమిచ్చిన తరువాత తిరిగి దర్శనమిచ్చిన ఆలయం ఉత్తరకోసమంగై. మాణిక్యవాచకర్ తమ తిరువాచక గ్రంధంలో 38 చోట్ల యీ ఆలయాన్ని గురింఛి కీర్తించారు. మంగళనాధుని ఆలయానికి ఉపాలయంగా స్వయంభూ వారాహి అమ్మవారి ఆలయం సమీపముననే వున్నది. ఈ అమ్మవారు ప్రాచీనకాలంలో "మంగై బిడారి" అని పిలువబడినది.రామేశ్వరం వలెనే యీ ఆలయ ప్రాకారం అంతా విశాలమైన మండపములతో బ్రహ్మాండంగా నిర్మించబడినది.ఒకే రోజు మూడువేళలా మంగళనాధుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ లేని మోక్షం పొందుతారని భక్తులు ధృఢంగా నమ్ముతారు. ఏ అడ్డంకులు కలుగకుండా వుండడానికి భక్తులు యీ ఆలయానికి వచ్చి ఈశ్వరుని పూజించి శుభాలు పొందుతారు .
మరోవైపు ఇక్కడ కోలువై ఉన్న మరకత నటరాజ స్వామి కి ప్రత్యేకత వుంది..
శిల్పాచార్యుల అద్భుత ప్రతిభకు నిదర్శనము
మయుని నిర్మితం మరకత నటరాజ విగ్రహం & కుడి వైపున పురుషుల నృత్య కదలికలు మరియు ఎడమ వైపున స్త్రీల నృత్య కదలికలతో పంచలోహ నటరాజ విగ్రహము
మరకరము (పచ్చ) విలువైన రత్నం. గరుడ పురాణం ప్రకారం సర్పరాజైన వాసుకి అను సర్పం బకాసురుని పిత్తాశయాన్ని సంగ్రహించి ఆకాశంనందు ఎగురుతున్న సమయంలో అది చూసిన వాసుకి శాత్రువు గరుత్మంతుడు వాసుకితో యుద్ధం చేయును. ఆ సమయంలో వాసుకి నోటిలోకి పిత్త కోశం మలయ పర్వత ప్రాంతంపై వదిలి వేయును. ఆ పిత్తాశయ భాగాలు విడిపోయి పడిన ప్రదేశాలలో అంతయు ఆకుపచ్చగా ప్రకాశించును. అందులోని కొంత భాగాన్ని గరుత్మంతుడు ంరింగును. దానితో గరుడు మూర్చపోవును. లేచిన వెంటనే బయటికి వదిలివేయును. అదా పడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడపచ్చలని అంటారు.మరొక కథ ప్రకారం నలమహారాజుకు శనిగ్రహ పీడ విముక్తి కలిగిన తదుపరి విష్ణుమూర్తిని ప్రార్థించి శివలింగమును ప్రసాదించమని కోరగా విష్ణుమూర్తి మరకతమును ఇవ్వడం జరిగింది. దానిని నలుడు ప్రతిష్ఠించాడు. అది ఇప్పటికీ పూజలందుకొంటున్నది. ప్రస్తుతం పాడిచ్చేరి రాష్ట్రంలోని తరువళ్ళూరు అను పట్టణమున గలదు.అమర కోశములో గారుత్మతం మరకత మశ్మ గర్భోహరిన్మణి అని వివరణ ఉంది. గరుత్మంతుని వలన ఉద్బవించినది, కావున, "గారుత్మతం" 'రాయి'నుండి ఉద్బవించినది కావున, అశ్మ గర్భ. పచ్చని రంగును కలిగి ఉన్నది కావున హరిన్మణి, "పచ్చ", "పచ్చలు" అన్న పేర్లు ఉన్నాయి.
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అత్యంత పురాతనమైన శివాలయాలలో ఒకటి.అరుల్మిగు మంగళేశ్వరి ఉదనురై మంగళనాథ స్వామి దేవాలయం. దేవస్థానం రామనాథపురం సమస్థానం క్రింద వస్తుంది. నవగ్రహాల ఆవిర్భావానికి ముందే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నాలుగు యుగాల నాటిది.ఈ ఆలయంలో మరకత నటరాజ విగ్రహం చాల ప్రత్యేకమైనది.దీనిని విశ్వకర్మ వంశీయులలో మయుని నిర్మితం ...
1300వ సంవత్సరంలో ఢిల్లీని పాలించిన ప్రముఖ మొఘల్ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉతిరకోసమంగైలో మరకత నటరాజ విగ్రహం ఉందని తెలుసుకుని దానిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఎన్నో మార్లు ఈ విగ్రహమును తీసుకొనివెళ్ళాడనికి ప్రయతనము చేసి విఫలం అయ్యారు. పాండ్యన్ రాజుల పాలన అత్యుత్తమంగా ఉన్నప్పుడు, ఈ ప్రదేశం కొంతకాలం రాజధానిగా పనిచేసింది.ఈ ఆలయ శాసనాలలోనే రావణుని భార్య మండోదరి పేరు ప్రస్తావించబడింది.అందువల్ల ఈ ప్రాంతం రామాయణ కాలానికి పూర్వమే అంటారు ఈ ఆలయంలోని పంచలోహ నటరాజ విగ్రహము చాలా భిన్నంగా ఉంటుంది మరియు విగ్రహం యొక్క కుడి వైపున పురుషుల నృత్య కదలికలు మరియు ఎడమ వైపున స్త్రీల నృత్య కదలికలతో కూడిన ఒక అద్భుతమైన కళాఖండం శిల్పాచార్యులు యొక్క ప్రతిభకు నిదర్శనము. ఈ మరకత నటరాజ స్వామి కి మూడు సంధ్యల్లో మూడు పూజలు చేసి చందనము పూసి ఆ చందనము ప్రసాదముగా తీసుకున్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి.వార్షిక ఆరుద్ర దర్శనం , తిరుఉత్తరకోశమంగయ్ శ్రీఆది నటరాజ స్వామి (మరకత నటరాజ)
ఏడాది మొత్తం చందనం లో కప్పబడి ఉండే ఈ స్వామి ఆరుద్ర ముందు రాత్రి చందనం తీసి అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ,తిరిగి మళ్ళీ చందనం తో కప్పి వేస్తారు ఉత్తరకోశామంగయ్ , రామనాధపురం జిల్లా రామేశ్వరం దగ్గరలో ఉన్న ఈ ఆలయ సమూహం
.మదురై.. రామనాధపురం మార్గంలో రామనాధపురానికి 10 కి.మీ దూరంలోకుడి ప్రక్కగా విడిపోయి తూత్తుకుడి .. తిరుచ్చెందూరు వెళ్ళే మార్గంలో 15 కి.మీ దూరంలో ఉత్తరకోస మంగై ఆలయం వున్నది.....@ మణికుమార్ కొమ్మమూరు
No comments:
Post a Comment